ఆరాధనా నీకే ఆరాధనా

పాట రచయిత: జోయెల్ ఎన్ బాబ్
Lyricist: Joel N Bob

Telugu Lyrics

ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా యేసు అన్ని వేళలా (2)
నా కష్టాలలో ఆరాధన
శోక సంద్రములో నీకే ఆరాధన
నా నష్టాలలో ఆరాధన
లోకమే నను విడచినా నీకే ఆరాధన           ||ఆరాధనా||

ఓటములే నాకు మిగిలినా – కన్నీట నిండ మునిగినా
ఆదరించు యేసుని చూస్తూ ఆరాధన
నా ప్రియులే చేయి విడచినా – సిరులున్నా లేక పోయినా
నను విడువని యేసుని చూస్తూ ఆరాధన (2)
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2)         ||ఆరాధనా||

రోగములే క్షీణించినా – శాంతిలేక కుమిలిపోయినా
సర్వమును భరించు యేసుకే ఆరాధన
శొధనలే చుట్టుముట్టినా – పాపములే రాజ్యమేలినా
లోకాన్ని గెలిచిన యేసుకే ఆరాధన (2)
యేసయ్యా నీకే నా ఆరాధన
యేసయ్యా నీకే నా స్తుతి కీర్తన (2)         ||ఆరాధనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా తల్లి నను మరచినా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా తల్లి నను మరచినా
నా వారే నను విడచినా (2)
విడువని దేవుడవయ్యా
ఎడబాయని వాడవయ్యా (2)
యేసయ్యా హల్లెలూయా (4)          ||నా తల్లి||

స్నేహితులే నన్ను బాధించినా
బంధువులే నన్ను వెలివేసినా (2)
అన్నదమ్ములే నన్ను నిందించినా
నే నమ్మినవారే గాయపరచినా (2)    ||విడువని||

లోకమంతా నన్ను ఏడ్పించినా
శత్రువులే నన్ను వేధించినా (2)
సాతానే  నన్ను శోధించినా
సమాజమే నన్ను త్రోసేసినా (2)        ||విడువని||

English Lyrics

Audio

అందరు నన్ను విడచినా

పాట రచయిత: టోని ప్రకాష్
Lyricist: Tony Prakash

Telugu Lyrics

అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే (2)
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)

వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా (2)
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా (2)

నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే (2)
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా (2)     ||అందరు నన్ను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME