కంటిపాపలా కాచినావయ్యా

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

కంటిపాపలా కాచినావయ్యా – చంటిపాపను మోసినట్టు మోసినావయ్యా
చేతి నీడలో దాచినావయ్యా – తోడుగా మా ముందరే నడచినావయ్యా
పోషించినావయ్యా.. బలపరచినావయ్యా – భయము వలదని ధైర్యమునిచ్చినావయ్యా
నడిపించినావయ్యా.. కాపాడినావయ్యా – ఓటమంచులో విజయమునిచ్చినావయ్యా
మా తలంపులు కావు.. నీ తలంపులే – మా జీవితాలలో జరిగించినావయ్యా
మా ఊహలే కాదు.. నీ ప్రణాళికే – మానక సమయానికి నెరవేర్చినావయ్యా           ||కంటిపాపలా||

ఎన్నో ఏళ్లుగా.. ఎదురు చూసాముగా – ఆశలే అడియాశలవ్వగా సోలిపోయాముగా
దారే కానక.. ఆగిపోయాముగా – అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా
అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించెగా
అణగారిన మా ఆశలన్ని చిగురింపజేసెగా
ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా
చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా
కన్నీరు తుడిచినావు.. నాట్యముగ మార్చినావు
ఎనలేని ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

ఊహించువాటికంటే ఎంతో అధికముగా – హెచ్చించినావు దేవా.. నీ ప్రేమ మధురము
ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై – దీవించినావు దేవా.. నీ ప్రేమ మరువము
హీనులం.. బలహీనులం.. నిలువలేక పడిపోయినా
లేవనెత్తి బండపైనే నిలబెట్టినావుగా
చీటికీ.. మాటి మాటికీ.. మా నమ్మకమే కోల్పోయినా
అడుగడుగున నీ నమ్మకత్వమును కనబరచినావుగా
పోగొట్టుకున్నదంతా.. రెట్టింపు చేసినావు
నీ గొప్ప ప్రేమ మా పైన చూపి           ||కంటిపాపలా||

Download Lyrics as: PPT

అమూల్య రక్తం

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

అమూల్య రక్తం – ప్రశస్త రక్తం
విలువైన రక్తం – శక్తి గల రక్తం (2)
యేసు రక్తమే జయము
క్రీస్తు రక్తమే విజయము (2)
పాప క్షమాపణ యేసు రక్తములోనే
శాప విమోచన క్రీస్తు రక్తములోనే          ||అమూల్య||

తండ్రి చిత్తము నెరవేర్చ
గెత్సేమనేలో ప్రార్ధింప (2)
చెమట రక్తము గొప్ప బిందువులై కారెనే
ఆత్మ శక్తిని ప్రసాదించును – అమూల్య రక్తమే (2)         ||యేసు||

శాపానికి ప్రతిఫలము ముళ్ళు
ముండ్ల కిరీటముతో చెల్లు (2)
ప్రభువు నొందెనే మనకై కొరడా దెబ్బలు
ప్రతి వ్యాధిని స్వస్థపరచును – అమూల్య రక్తమే (2)             ||యేసు||

నీ చేతుల పనిని ఆశీర్వదింప
ప్రభు చేతులలో మేకులు గొట్ట (2)
కాళ్లలో మేకులు సువార్తకు సుందరమే
బల్లెపు పోటు బాగు చేయును – గుండెలను (2)         ||యేసు||

English Lyrics

Audio

క్రైస్తవుడా సైనికుడా

పాట రచయిత: కే రాజబాబు
Lyricist: K Rajababu

Telugu Lyrics


క్రైస్తవుడా సైనికుడా
బలవంతుడా పరిశుద్ధుడా
కదలిరావోయ్ నీవు కదలిరా (4)

జాలరీ మనుషులు పట్టు జాలరి
ఆత్మలు పట్టు కాపరి
అమృతమందించే ఆచారి
యేసుకై జీవించే పూజారి        ||క్రైస్తవుడా||

సిలువే నీ స్థావరము
శ్రమలే నీ సైన్యము (2)
సహనమే నీ ధైర్యము
వాక్యమే నీ విజయము (2)        ||క్రైస్తవుడా||

సత్యమే నీ గమ్యము
సమర్పణే నీ శీలము (2)
యేసే నీ కార్యక్రమం
ప్రేమే నీ పరాక్రమం (2)        ||క్రైస్తవుడా||

దేశంలో విదేశంలో
గ్రామంలో కుగ్రామంలో (2)
అడవులలో కొండలలో
పని ఎంతో ఫలమెంతో (2)        ||క్రైస్తవుడా||

సిద్ధాంతపు గట్టు దుమికి రా
వాగులనే మెట్టును దిగిరా (2)
దీనుడా ధన్యుడా
విజేయుడా అజేయుడా (2)        ||క్రైస్తవుడా||

వాగ్ధాన భూమి స్వతంత్రించుకో
అద్వానపు అడవి దాటి ముందుకుపో (2)
నీ ఇల్లు పెనూయేలు
నీ పేరే ఇశ్రాయేలు (2)        ||క్రైస్తవుడా||

English Lyrics

Audio

పరిశుద్ధుడా పావనుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


పరిశుద్ధుడా పావనుడా
అత్యున్నతుడా నీవే (2)
నీ నామమునే స్తుతియించెదా
నీ నామమునే ఘనపరచెదా (2)
నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ
నీలోనే విజయము నీలోనే సంతోషం
ఆరాధన నీకే (6)

నా అడుగులో అడుగై – నా శ్వాసలో శ్వాసై
నే నడచిన వేళలో ప్రతి అడుగై (2)
నా ఊపిరి నా గానము
నా సర్వము నీవే నా యేసయ్యా
నీకేనయ్యా ఆరాధన             ||ఆరాధన||

నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా
నీ శక్తితో నను నింపు బలవంతుడా (2)        ||ఆరాధన||

English Lyrics

Audio

దినదినము విజయము

పాట రచయిత: కృపాల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


దినదినము విజయము మనదే
జయశీలుడైన యేసునిలో
భయమే లేదు మాకు దిగులే లేదు
సైన్యములకు అధిపతి యుండగా
సాతానును ఓడించెను
స్వేచ్చా జీవము మాకిచ్చెను
పాప శాపములు తొలగించెను
పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2)

హోసన్నా జయం మనదే (3)
హోసన్నా జయం జయం మనదే           ||దినదినము||

English Lyrics

Audio

నేనునూ నా ఇంటి వారును

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నేనునూ నా ఇంటి వారును
యెహోవాను సేవించెదము
ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)
సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని        ||నేనునూ||

శ్రమలో శోధనలో మరణ బంధకంలో
శాంతి సమాధానం దయచేసి దేవుడు (2)
ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2)
ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2)          ||నేనునూ||

ఏ పాపము నన్ను ఏలనీయని వాడు
ఏ అపాయమును రాకుండా కాపాడును (2)
కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)
నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2)          ||నేనునూ||

దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2)
మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2)
మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2)          ||నేనునూ||

English Lyrics

Audio

HOME