విలువేలేని నా జీవితం

పాట రచయిత: వినోద్ కుమార్
Lyricist: Vinod Kumar

Telugu Lyrics


విలువేలేని నా జీవితం – నీ చేతిలో పడగానే
అది ఎంతో విలువని నాకు చూపితివే
జీవమే లేని నాలో నీ – జీవమును నింపుటకు
నీ జీవితాన్నే ధారబోసితివే (2)

నీది శాశ్వత ప్రేమయా – నేను మరచిపోలేనయా
ఎన్ని యుగాలైనా మారదు
ఎండిన ప్రతి మోడును – మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)

పాపములో పడిన నన్ను
శాపములో మునిగిన నన్ను
నీ ప్రేమతో లేపితివే
రోగమే నన్ను చుట్టుకొనియుండగా
రోదనతో ఒంటరినైయుండగా
నా కన్నీటిని తుడిచితివే (2)        ||నీది||

పగలంతా మేఘ స్తంభమై
రాత్రంతా అగ్ని స్తంభమై
దినమంతయు రెక్కలతో కప్పితివే
స్నేహితులే నన్ను వదిలేసినా
బంధువులే భారమని తలచినా
నా కొరకే బలి అయితివే (2)        ||నీది||

సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా యేసుకు సమస్తము
సాధ్యమే సాధ్యమే సాధ్యమే
నా ప్రియునికి సమస్తము (2)

ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును
నా దేవునికి సమస్తము సాధ్యమే (2)          ||విలువేలేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

రక్షింపబడిన నీవు

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు
గురి నిలిపి పయనిస్తున్నావా
రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు
అన్నట్టు జీవిస్తున్నావా (2)
యేసే లేని నీ బ్రతుకులో
వెలుగే లేదని తెలుసుకో
యేసే లేని జీవితానికి
విలువే లేదని తెలుసుకో (2)        ||రక్షింపబడిన||

మంటితోనే నిను చేసినా
కంటి పాపగా కాపాడెనే
మాటి మాటికి పడిపోయినా
శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2)
ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని
ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా
యేసే లేనిదే – పరలోకానికి
ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా      ||యేసే||

యేసులోనే నీ రక్షణ
యేసులోనే నిరీక్షణ
యేసులోనే క్షమాపణ
చేసుకో మరి ప్రక్షాళన (2)
ఎంతో ప్రేమను – నీపై చూపించెను
తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా
ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ
ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా       ||యేసే||

English Lyrics

Audio

సిలువ ధ్యానం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీ సిలువే నా శరణము (2)
విలువైన రుధిరాన్ని కార్చి
వెలపోసి నన్ను కొన్నావు (2)
ప్రేమా త్యాగం నీవే యేసయ్యా
మహిమా నీకే ఆరోపింతును

గాయాలు పొందినావు – వెలివేయబడినావు
నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు (2)
నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను
నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా (2)

సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)

విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా (2)
నాదు పాపమంతయూ (2)
నీదు భుజముపై మోసావయ్యా (2)

గొల్గొతా కొండ పైన (2)
గాయాలు పొందితివే (3)

చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ (2)
పొందెను యేసు నీ కొరకే
తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను (2)

కల్వారిలో జీవామిచ్చెన్ (2)
నీ పాపములను తొలగించుటకై
నీదు సిలువన్ మోసెను యేసు (2)

రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
చలించిపోయెనే ఆ సిలువ ధాటికి (2)
కసాయి చేతిలో అల్లాడిపోయెనే (2)

రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము

కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై
రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు (2)
ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో
పాడి కొనియాడి కీర్తింతుము
పూజించి ఘనపరతుము

హాల్లేలూయా హాల్లేలూయా (3)
నిన్నే ఆరాధింతుమ్ (3)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME