సంతోషముతో నిచ్చెడు వారిని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును              ||సంతోషముతో||

అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు              ||సంతోషముతో||

వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు              ||సంతోషముతో||

దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై              ||సంతోషముతో||

ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యే-సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను              ||సంతోషముతో||

భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను              ||సంతోషముతో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ప్రభువా నిను కీర్తించుటకు

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

ఎంతగ నిను కీర్తించినను – ఏమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా (2)

ప్రభువా నిను కీర్తించుటకు వేనోళ్లు చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్లు చాలునా (2)
ఎంతగ నిను కీర్తించినను – యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పించగలనా (2)     ||ప్రభువా||

కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి
నా గుడారమునే విశాల పరచి (2)
ఇంతగ నను హెచ్చించుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను దీవించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా…      ||ప్రభువా||

నీ నోటి మాట నా ఊటగ నుంచి
నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి (2)
ఇంతగ నను వాడుకొనుటకు
నే తగుదునా… నే తగుదునా…
వింతగ నను హెచ్చించుటకు
నేనర్హుడనా… నేనర్హుడనా…        ||ప్రభువా||

English Lyrics

Audio

సంతోషమే సమాధానమే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సంతోషమే సమాధానమే (3)
చెప్ప నశక్యమైన సంతోషం (2)

నా హృదయము వింతగ మారెను (3)
నాలో యేసు వచ్చినందునా (2)              ||సంతోషమే||

తెరువబడెను నా మనోనేత్రము (3)
క్రీస్తు నన్ను ముట్టినందునా (2)              ||సంతోషమే||

ఈ సంతోషము నీకు కావలెనా (3)
నేడే యేసు నొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||

సత్య సమాధానం నీకు కావలెనా (3)
సత్యుడేసునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||

నిత్యజీవము నీకు కావలెనా (3)
నిత్యుడేసునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||

మొక్ష్యభాగ్యము నీకు కావలెనా (3)
మోక్ష రాజునొద్దకు రమ్ము (2)              ||సంతోషమే||

యేసు క్రీస్తును నేడే చేర్చుకో (3)
ప్రవేశించు నీ హృదయమందు (2)              ||సంతోషమే||

English Lyrics

Audio

 

 

HOME