యూదా స్తుతి గోత్రపు

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


యూదా స్తుతి గోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా (2)
నీవే కదా నా ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (2)

నీ ప్రజల నెమ్మదికై
రాజాజ్ఞ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను
అధముల చేసిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4)     ||యూదా||

నీ నీతి కిరణాలకై
నా దిక్కు దెశలన్ని నీవేనని
ఆనతికాలాన ప్రధమ ఫలముగా
భద్రపరచిన నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4)     ||యూదా||

నీ వారసత్వముకై
నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును
నాకిచ్చుఁటలో నీకు (2)
అసాధ్యమైనది ఏమున్నది (4)     ||యూదా||

English Lyrics

Audio

ఏడానుంటివిరా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఏడానుంటివిరా – ఓరన్న
వేగి ఉరికి రారా – ఓరన్న (2)
యాదికొచ్చెరా యాదన్న
యేసు సిత్ర కథ వినరన్న (2)
ఏలియాలో ఏలియాలో ఏలియాలో
యేసే నా రక్షకుడు ఏలియాలో
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా
యేసే నా రక్షకుడు హల్లెలూయా (2)

యూదా దేశమందు – ఓరన్న
బెత్లెహేమునందు – ఓరన్న
పశువుల శాలయందు – ఓరన్న
ప్రభు యేసు జన్మించె – ఓరన్న
చుక్కల రెక్కలు ఎగుర వేయుచు
చల్లని దూతలు పాట పాడిరి (2)
చల్ల చల్లని చలిలోన – ఓరన్న
గొల్ల గొల్లలు మ్రొక్కిరి – ఓరన్న (2)        ||ఏలియాలో||

పెద్ద పెద్దని వాడై – యేసన్న
ఇంత ఇంతింత ఎదిగె – యేసన్న
వింత వింతలు చేసె – యేసన్న
ఐదు రొట్టెలు రెండు చేపలు
ఐదు వేల మందికి పంచెను (2)
తుఫాను నణిచెను – యేసన్న
సంద్రాన నడిచెను – యేసన్న (2)        ||ఏలియాలో||

ఏ పాపమెరుగని – ఓరన్న
యేసయ్య తండ్రిని – ఓరన్న
సిలువ వేయమని – ఓరన్న
కేకలు వేసిరి – ఓరన్న
సిలువ మోసెను శ్రమల నోర్చెను
మూడవ నాడు తిరిగి లేచెను (2)
పరలోకమెళ్లాడు – యేసన్న
త్వరలోనే వస్తాడు – యేసన్న (2)        ||ఏలియాలో||

English Lyrics

Audio

యేసయ్యా నా హృదయ స్పందన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2)
విశ్వమంతా నీ నామము ఘణనీయము (2)         ||యేసయ్యా||

నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే (2)
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే (2)
యుగయుగాల తలపు మది నిండెనే          ||యేసయ్యా||

నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే (2)
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2)
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే          ||యేసయ్యా||

నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే (2)
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే (2)
యుగయుగాలు నన్నేలు కొందువనే          ||యేసయ్యా||

English Lyrics

Audio

ఆనందమే పరమానందమే

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో (2)
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము (2)       ||ఆనందమే||

పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే (2)
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే (2)       ||ఆనందమే||

గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను (2)
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే (2)       ||ఆనందమే||

నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు (2)
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము (2)       ||ఆనందమే||

English Lyrics

Audio

మహాఘనుడవు మహోన్నతుడవు

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


మహాఘనుడవు మహోన్నతుడవు
పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు (2)
కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా
నను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా (2)

వినయముగల వారిని
తగిన సమయములో హెచ్చించువాడవని (2)
నీవు వాడు పాత్రనై నేనుండుటకై
నిలిచియుందును పవిత్రతతో (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)        ||మహా||

దీన మనస్సు గలవారికే
సమృద్ధిగా కృపను దయచేయువాడవని (2)
నీ సముఖములో సజీవ సాక్షినై
కాపాడుకొందును మెళకువతో (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)       ||మహా||

శోధింపబడు వారికి
మార్గము చూపించి తప్పించువాడవని (2)
నా సిలువ మోయుచు నీ సిలువ నీడను
విశ్రమింతును అంతము వరకు (2)
హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా (2)       ||మహా||

English Lyrics

Audio

కృపా క్షేమము

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే                  ||కృపా క్షేమము||

English Lyrics

Audio

 

 

నీ కృప నాకు చాలును

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నీ కృప నాకు చాలును
నీ కృప లేనిదే నే బ్రతుకలేను (2)
నీ కృప లేనిదే నే బ్రతుకలేను

జల రాసులన్ని ఏక రాసిగా
నిలిచిపోయెనే నీ జనుల ఎదుట (2)
అవి భూకంపాలే అయినా
పెను తుఫానులే అయినా (2)
నీ కృపయే శాశించునా
అవి అణగిపోవునా (2)         ||నీ కృప||

జగదుద్పత్తికి ముందుగానే
ఏర్పరచుకొని నన్ను పిలచితివా (2)
నీ పిలుపే స్థిరపరచెనే
నీ కృపయే బలపరచెనే (2)
నీ కృపయే ఈ పరిచర్యను
నాకు అనుగ్రహించెను (2)      ||నీ కృప||

English Lyrics

Audio

 

 

HOME