తరాలు మారినా యుగాలు మారినా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

తరాలు మారినా యుగాలు మారినా
మారని దేవుడు మారని దేవుడు
మన యేసుడు      ||తరాలు||

మారుచున్న లోకములో
దారి తెలియని లోకములో (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

సూర్యచంద్రులు గతించినా
భూమ్యాకాశముల్ నశించినా (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

నీతి న్యాయ కరుణతో
నిశ్చలమైన ప్రేమతో (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

నిన్న నేడు నిరంతరం
ఒకటైయున్న రూపము (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

English Lyrics

Audio

నజరేయుడా నా యేసయ్య

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద          ||నజరేయుడా||

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)       ||నజరేయుడా||

అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||

సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2)        ||నజరేయుడా||

English Lyrics

Audio

HOME