పాట రచయిత: జి డేవిడ్ విజయరాజు
Lyricist: G David Vijayaraju
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగ యుగములు కలుగును దేవా (2)
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో (2)
కొనియాడబడుచున్న దేవా (2)
ఆరాధన ఆరాధన (2)
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
పరిశుద్ధ స్థలములలో వసియించువాడా (2)
ఆరాధన ఆరాధన (2)
ఆ.. ఆ.. ఆ.. హల్లెలూయా (4)
యుగ యుగములకు తర తరములకు
మహిమా నీకే
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతుల మీద ఆసీనుడా (2)
ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు||
మహిమా నీకే మహోన్నతుడా
మనసారా నిన్నే స్తుతియింతుము (2)
ఆరాధన ఆరాధన (2) ||స్తుతియు||
English Lyrics
Audio
Download Lyrics as: PPT