ప్రభుని గృహము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ప్రభుని గృహము ఆయన మహిమతో
పరిపూర్ణముగా నిండెను (2)

అపరాధములచే ప్రజలందరును
దేవుని మహిమను కోల్పోయిరి (2)
తన మహిమను మన కిచ్చుటకు (2)
యేసు ప్రభువే బలి యాయెన్ (2)        ||ప్రభుని||

కృపా సత్యములు సంపూర్ణముగా
మన మధ్యలో వసించెను (2)
తండ్రి మహిమను తన సుతునిలో (2)
మనమందరము చూచితిమి (2)        ||ప్రభుని||

ప్రభువు యింటిని నిర్మించు చుండె
సజీవమైన రాళ్ళతో (2)
ఆయన మహిమ దానియందుండ (2)
తన సంకల్పమై యున్నది (2)        ||ప్రభుని||

శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు
మానవ హస్తము అందుండదు (2)
క్రయమునిచ్చి స్థలముకొనెను (2)
తాను కోరిన స్థలమదే (2)        ||ప్రభుని||

ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి
తన పునాదిని వేసెను (2)
రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా (2)
ప్రభువే సర్వము చేసెను (2)        ||ప్రభుని||

సింహాసనముపై కూర్చున్న ప్రభువే
అణగ ద్రొక్కెను శత్రువును (2)
సంపూర్ణ జయముతో ఆర్భాటముతో (2)
వెలిగించెను తన యింటిని (2)        ||ప్రభుని||

దేవుని యిల్లు ముగించబడగా
పైనుండి అగ్ని దిగివచ్చున్ (2)
దహించబడును సర్వ మలినము (2)
ఇంటిని మహిమతో నింపును (2)        ||ప్రభుని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మేము భయపడము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


మేము భయపడము – ఇక మేము భయపడము
ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు (2)      ||మేము||

దైవ భ్రష్టులమైన మమ్ము
దివ్యంపుగా రక్షించే (2)
దీవారాత్రులు దేవుడే కాయును      ||మేము||

శత్రు కోటి మమ్ము జుట్టన్
పాతాళము మ్రింగ జూడన్ (2)
నిత్యుడు యేసు నిత్యము కాయును      ||మేము||

అగ్ని పరీక్షల యందు
వాగ్ధానమిచ్చె మాతో నుండ (2)
ఏ ఘడియైనను విడువక కాయును      ||మేము||

బలమైన ప్రభు హస్తములు
వలయము వలె మమ్ము జుట్టి (2)
పలు విధములుగా కాపాడు మమ్ము      ||మేము||

కునుకడు మన దేవుడు
యెన్నడు నిద్రించడు (2)
కను పాపగా మము కాపాడునెప్పుడు      ||మేము||

జీవిత కష్ట నష్టములు
ఆవరించి దుఃఖపరచ (2)
దేవుడొసంగిన ఈవుల నెంచుచు      ||మేము||

ఇహమందు మన శ్రమలన్ని
మహిమకు మార్చెడు ప్రభున్ (2)
మహిమపరచి మ్రొక్కెదములలో      ||మేము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సమాధాన గృహంబులోను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సమాధాన గృ-హంబులోను
సమాధాన-కర్త స్తోత్రములు (2)

క్రీస్తు యేసు మనకిలలో
నిత్య సమాధానము (2)
మద్యపు గోడను కూల ద్రోసెను (2)
నిత్య శాంతిని మనకొసగెన్ (2)         ||సమాధాన||

పర్వతములు తొలగినను
తత్థరిల్లిన కొండలు (2)
నాదు కృప నిను విడువదనెను (2)
నా సమాధానము ప్రభువే (2)         ||సమాధాన||

లోకమిచ్చునట్లుగా
కాదు ప్రభు సమాధానము (2)
సత్యమైనది నిత్యము నిల్చును (2)
నిత్యుడేసుచే కల్గెన్ (2)         ||సమాధాన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

హల్లెలూయా యేసు ప్రభున్

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి

రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి

తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి              ||రాజుల||

సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడగండ్లార మీరు  కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి              ||రాజుల||

యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి              ||రాజుల||

అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి              ||రాజుల||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

మాకు తోడుగ నీవుంటివి

పాట రచయిత: సొలొమోన్ రాజ్
Lyricist: Solomon Raj

Telugu Lyrics


మాకు తోడుగ నీవుంటివి
జీవిత యాత్రలో (2)
మమ్ము విడువని మా దేవా
నిండు మనస్సుతో వెంబడించెదం (2)          ||మాకు||

మాతో కూడా ఉందునంటివి
మారని మా దేవా (2)
పరము చేరు వరకు దేవా
మమ్ము నడిపెదవు (2)          ||మమ్ము విడువని||

శత్రువు మాపై చెలరేగగా
కృంగదీయ జూడగా (2)
యెహోవా నిస్సిగా మాకుండి
విజయమిచ్చితివే (2)          ||మమ్ము విడువని||

కష్టములెన్నెన్నో ఎదురైనా
నిన్నే వెంబడింతుము (2)
మాకు తోడుగా నీవుండగా
మేము భయపడము (2)          ||మమ్ము విడువని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME