నా మనో నేత్రము

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నా మనో నేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి (2)
అంధకారములో నేనుండ (2)
వెదకి నన్ రక్షించితివి (2)       ||నా మనో||

నే పాప భారము తోడ
చింతించి వగయుచునుంటి (2)
కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)
పొంది నన్ విడిపించితివి (2)         ||నా మనో||

ఎన్నాళ్ళు బ్రతికిననేమి
నీకై జీవించెద ప్రభువా (2)
బాధలు శోధనలు శ్రమలలో (2)
ఓదార్చి ఆదుకొంటివయా (2)         ||నా మనో||

నీ సన్నిధిని నే కోరి
నీ సన్నిధిలో నే మారి (2)
స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)
యుగయుగములు సర్వ యుగములు (2)          ||నా మనో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME