అంజలి ఘటియింతు

పాట రచయిత: దియ్యా ప్రసాద రావు
Lyricist: Diyya Prasada Rao

Telugu Lyrics

అంజలి ఘటియింతు దేవా (2)
నీ మంజుల పాదాంబుజముల కడ
నిరంజన మానస పరిమళ పుష్పాంజలి       ||అంజలి||

పరమాత్మ నీ పాద సేవ
చిరజీవ సంద్రాన నావ (2)
సిలువ మహా యజ్ఞ సింధూర
రక్తా రుణమేయ సంభావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా       ||అంజలి||

అవతార మహిమా ప్రభావ
సువిశాల కరుణా స్వభావ (2)
పరలోక సింహాసనాసీన
తేజో విరాజమాన జగదావనా (2)
దేవా దేవా యేసు దేవా (2)
అంజలి ఘటియింతు దేవా       ||అంజలి||

English Lyrics

Audio

Leave a Reply

HOME