నా జీవిత యాత్రలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా జీవిత యాత్రలో
ప్రభువా నీ పాదమే శరణం
ఈ లోకమునందు నీవు తప్ప
వేరే ఆశ్రయం లేదు (2)       ||నా జీవిత||

పలు విధ శోధన కష్టములు
ఆవరించియుండగా (2)
కలత చెందుచున్న హృదయమును
కదలక కాపాడుము (2)       ||నా జీవిత||

నీ సన్నిధిలో సంపూర్ణమైన
సంతోషము కలదు (2)
నీదు కుడి హస్తములో నిత్యమున
నాకు సుఖ క్షేమముగా (2)       ||నా జీవిత||

ఈ లోక నటన ఆశలన్నియు
తరిగిపోవుచుండగా (2)
మారని వాగ్ధానములన్నియు
నే నమ్మి సాగెదను(2)       ||నా జీవిత||

ముందున్న సంతోషము తలంచి
నిందలను సహించి (2)
నీ సిలువను నే మోయుటకై
నీ కృప నాకీయుము (2)     ||నా జీవిత||

సీయోను యొక్క ఆలోచనతో
సదా నడిపించుము (2)
మహిమలో నీతోనే నిల్చుటకు
నా తండ్రి దయచూపుము (2)     ||నా జీవిత||

English Lyrics

Audio

1 comment

Leave a Reply

HOME