ఎంత పాపినైనను

పాట రచయిత: ఎర్డ్మాన్ న్యూమీస్టెర్
అనువాదకుడు: అల్లూరి పెదవీరాస్వామి
Lyricist: Erdmann Neumeister
Translator: Alluri Peda Veeraaswaami

Telugu Lyrics

ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను
అంత జాటించుడి

హల్లెలూయ హల్లెలూయ
ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనున
టంచు బ్రకటించుడి

మెండుగా క్షమాపణన్
పూర్ణ సమాధానము
నెంత పాపి కైన దా
నిచ్చి చేర్చుకొనును     ||హల్లెలూయ||

తన దివ్య సిల్వచే
దీసి పాప శాపమున్
నను బవిత్రపర్చెను
నాకు హాయి నిచ్చెను     ||హల్లెలూయ||

ఘోర పాపినైనను
నన్ను జేర్చుకొనును
పూర్ణ శుద్ధి నిచ్చును
స్వర్గమందు జేర్చును     ||హల్లెలూయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

Leave a Reply

HOME