గతకాలమంత నీ నీడలోన

పాట రచయిత: దివ్య మన్నె
Lyricist: Divya Manne

గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2)
వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2)           ||గతకాలమంత||

ఎన్నెన్నో అవమానాలెదురైననూ
నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగిననూ
నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2)
వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2)           ||గతకాలమంత||

మాటలే ముళ్ళుగ మారిన వేళ
నీ మాట నన్ను పలకరించెనయా
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తం నను తాకెనయా
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2)
వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2)

గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2)
వందనం యేసయ్యా – విభుడవు నీవయ్యా (2)           ||గతకాలమంత||

Download Lyrics as: PPT

జై జై యేసు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

జై జై యేసు రాజా జై జై
రాజాధిరాజా నీకే జై జై – (2)       ||జై జై||

పాపకూపములో బడియున్న (2)
నన్ను జూచి చేయి జాచి (2)
చక్కగ దరికి జేర్చితివి (2)       ||జై జై||

సిలువ రక్తములో నన్ను కడిగి (2)
పాపమంతా పరిహరించిన (2)
పావనుడగు నా ప్రభుయేసు (2)       ||జై జై||

నీతి హీనుడనైన నాకు (2)
నీతి రక్షణ వస్త్రములను (2)
ప్రీతితో నొసగిన నీతి రాజా (2)       ||జై జై||

మంటి పురుగునైన నన్ను (2)
మంటి నుండి మింట జేర్చిన (2)
మహాప్రభుండా నీకే జై జై (2)       ||జై జై||

పాపశాపగ్రస్తుడనై యుండ (2)
నన్ను గూడ నీ స్వకీయ (2)
సంపాద్యముగా జేసితివి (2)       ||జై జై||

రాజులైన యాజక గుంపులో (2)
నన్ను గూడ నీ సొత్తైన (2)
పరిశుద్ధ జనములో జేర్చితివి (2)       ||జై జై||

తల్లియైన మరచిన మరచును (2)
నేను నిన్ను మరువననిన (2)
నమ్మకమైన నా ప్రభువా (2)       ||జై జై||

అధిక స్తోత్రార్హుడవైన (2)
ఆది యంతము లేని దేవా (2)
యుగా యుగములకు నీకే జై జై (2)       ||జై జై||

Download Lyrics as: PPT

ప్రేమతో యేసు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము (2)
రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము (2)      ||ప్రేమతో||

పాపమెరుగని ప్రభు నీ కొరకు
పాపముగను చేయబడెను (2)
శాపగ్రాహియాయె సిలువలో
శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

ముండ్ల కిరీటమును ధరించి
ముఖముపై నుమ్మి వేయబడె (2)
ప్రాణమిడె నేసు సిలువలో
ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

సిలువలో నీకై దప్పిగొని
కలుష నీ క్షమకై ప్రార్థించి (2)
సహించి ప్రాణమిడె నీ కొరకు
సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

తప్పిన గొర్రెను రక్షింప
తనదు రక్తమును చిందించె (2)
కాపరి స్వరము ధ్వనించె
కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

తామసించ తగదిక ప్రియుడా
త్వరపడుము నీ రక్షణ కొరకు (2)
నేడే నీ రక్షణ దినము
నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

తానే కడుగును తన రక్తముతో
తండ్రివలె నీ పాపమునంత (2)
తనయుడవై పోదు విపుడే
తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

ప్రేమవార్త ప్రకటింపబడె
ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము (2)
కృపాకాలమిదే జాగేల
కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము (2)      ||ప్రేమతో||

Download Lyrics as: PPT

ప్రభు యేసు ప్రభు యేసు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

ప్రభు యేసు.. ప్రభు యేసు – అదిగో శ్రమ నొందెను
ఖైదీలను విడిపించెను సిలువలో         || ప్రభు యేసు ||

ఎంత కౄరమో.. ఎంత కౄరమో – శత్రు కార్యము చూడుమా
అంతగా బాధించి సిలువమీది కెత్తిరి
బాధనొందియు.. బాధనొందియు – ఎదురు మాటలాడక
ఖైదీలను విడిపించెను సిలువలో (2)        || ప్రభు యేసు ||

ముండ్ల మకుటము.. ముండ్ల మకుటము – తన తల నుంచిరి
మూర్ఖుల దెబ్బల బాధను సహించెను
మూసియుండిన.. మూసియుండిన మోక్షద్వారము తెరచి
ఖైదీలను విడిపించెను సిలువలో (2)        || ప్రభు యేసు ||

ఆత్మదేవుడు.. ఆత్మదేవుడు – ప్రత్యక్షంబాయె సిలువలో
సూర్యుడదృశ్యుడై క్రమ్మెనంత చీకటి
సార్వత్రికము.. సార్వత్రికము – గడగడ వణికెను
ఖైదీలను విడిపించెను సిలువలో (2)        || ప్రభు యేసు ||

మరణించెను.. మరణించెను – సమాధి నుంచబడెను
మూడవనాడు సమాధినుండి లేచెను
విడిపించెను.. విడిపించెను మరణ బంధితులను
ఖైదీలను విడిపించెను సిలువలో (2)        || ప్రభు యేసు ||

తీసివేసెను.. తీసివేసెను – నా పాప నేరమంతయు
దేవయని ప్రభు అరచిన యపుడు
దేవుని దయ.. దేవుని దయ – కుమ్మరించబడెను
ఖైదీలను విడిపించెను సిలువలో (2)        || ప్రభుయేసు ||

కారు చీకటిలో.. కారు చీకటిలో – దుఃఖంబులో నేనుంటిని
నీకువేరుగా నారక్షణిల లేదుగా
నాదు శ్రమలు.. నాదు శ్రమలు – వేరెవ్వరు నెరుగరు
ఖైదీలను విడిపించెను సిలువలో (2)        || ప్రభు యేసు ||

Download Lyrics as: PPT

ఇదిగో నేనొక నూతన క్రియను

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2)
ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2)       ||ఇదిగో||

అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను (2)
ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను (2)       ||ఇదిగో||

నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు (2)
సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను (2)       ||ఇదిగో||

అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు (2)
ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి (2)       ||ఇదిగో||

నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి (2)
ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను (2)       ||ఇదిగో||

నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి (2)
ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్ (2)       ||ఇదిగో||

మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి (2)
చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును (2)       ||ఇదిగో||

పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్ (2)
కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ (2)       ||ఇదిగో||

Download Lyrics as: PPT

దేవాది దేవా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

దేవాది దేవా ప్రభువుల ప్రభూ
రాజుల రాజా హల్లెలూయ (2)

నీ రక్తముతో విమోచించి
నీ రక్తముతో సంపాదించి (2)
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి (2)
పరలోక పాటన్ నా కొసగితివి (2)         ||దేవాది దేవా||

జీవిత నావలో తుఫాను రేగ
భయపడకుడని అభయము నిచ్చి (2)
జయప్రదముగా నన్ను నడిపించి (2)
జయజీవితము నా కొసగుచున్న (2)         ||దేవాది దేవా||

పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి
కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి (2)
అరమర లేక నన్నాదరించి (2)
పరలోక దర్శనంబిచ్చితివి (2)         ||దేవాది దేవా||

మరణ పాత్రులం యిద్ధరణిలోన
దురిత ఋణముల స్మరణను మాన్పి (2)
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము (2)
నీ రాజ్యమందు రాజులన్ జేసి (2)         ||దేవాది దేవా||

శోధనగాధల కష్టములలో
నా దుఃఖములలో నే నేడ్వకుండా (2)
నీ దయ నాపై నిండార నింపి (2)
ఓదార్చి నన్ను నీ దారినడుపు (2)         ||దేవాది దేవా||

ప్రతి వత్సరము దయతోడ నింపున్
ప్రభు జాడలు సారము జల్లున్ (2)
ప్రతి బీడునూ సారము చిలకన్ (2)
ప్రతి పర్వతము ఆనందించున్ (2)         ||దేవాది దేవా||

పరలోక పరిశుద్ధ సంఘంబు యెదుట
సర్వశక్తిగల క్రీస్తుని యెదుట (2)
పరలోక నూతన గీతము పాడ (2)
జేర్చితివి నన్ నీ జనమునందు (2)         ||దేవాది దేవా||

Download Lyrics as: PPT

క్రీస్తుని స్వరము విందును

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు
మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – (2)

యెహోవా నీ స్వరము జలములపై వినబడెను (2)
మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2)           ||క్రీస్తుని||

బలమైన నీ స్వరము బహుప్రభావము గలది (2)
దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని (2)           ||క్రీస్తుని||

అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును (2)
ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును (2)           ||క్రీస్తుని||

ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ (2)
ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే (2)           ||క్రీస్తుని||

నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ (2)
ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు (2)           ||క్రీస్తుని||

నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును (2)
అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను (2)           ||క్రీస్తుని||

నీ మధుర స్వరము నీ మార్గము జూపును (2)
కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును (2)           ||క్రీస్తుని||

తుఫానులు కలిగి భయభీతులలో నుండ (2)
భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము (2)           ||క్రీస్తుని||

మరణాంధకార లోయలో నేనుండ (2)
నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ (2)           ||క్రీస్తుని||

ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ (2)
దీనుడనై నీ మాట అంగీకరించెదను (2)           ||క్రీస్తుని||

Download Lyrics as: PPT

నోవహు ఓడనే సంఘములో

పాట రచయిత:ఇశ్రాయేల్
Lyricist: Israel

నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు
నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2)
మాట వినిన పావురం – లోబడని కాకియు
ఆ సంఘములో విశ్వాసులైనాయి (2)     ||నోవహు ఓడనే||

గురుతు తెమ్మని నోవహు పంపాడు… తెలివైన కాకిని
దైవ జనుని మాటే మరచి… లోకమును ప్రేమించి… (2)
ఇటు అటు తిరుగుచుండెనా కాకి (2)
సంఘములో ఉన్న నీవు… పాపముపై ఆశతో (2)
ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా (2)
నీవు కాకివా… పావురానివా (2)     ||నోవహు ఓడనే||

గురుతు తెమ్మని నోవహు పంపాడు… నల్లని పావురమును
ఓడను మరచి పోక… కాలు నిలుప స్థలము లేక…
మరల తిరిగి వచ్చే ఆ పావురము (2)
సంఘములో ఉన్న నీవు… పరిశుద్ధత కాంక్షతో (2)
లోకమునకు వేరుగ ఉన్న భక్తి పావురానివా (2)
పావురానివా… నీవు కాకివా (2)     ||నోవహు ఓడనే||

గురుతు తెమ్మని నోవహు పంపాడు… మరలా ఆ పావురమును
ఆజ్ఞను మరచి పోక… ఒలీవాకు గురుతుగా తెచ్చె…
బాధ్యత కలిగిన ఆ పావురము (2)
సంఘములో ఉన్న నీవు… ఆత్మల భారముతో (2)
ఆత్మలను సంపాదించే భక్తి పావురానివా (2)
పావురానివా… నీవు కాకివా (2)

నోవహు ఓడనే సంఘములో రెండు పక్షులు
నీకు నాకు గురుతుగా ఉన్నాయి (2)
మాట వినిన పావురం – లోబడని కాకియు
ఆ సంఘములో విశ్వాసులైనాయి (2)
నీవు కాకివా… పావురానివా (4)

Download Lyrics as: PPT

HOME