చిందింది రక్తం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిందింది రక్తం ఆ సిలువ పైన
కారింది రుధిరం కలువరిలోన (2)
కరుణ చూప లేదే కసాయి మనుష్యులు
కనికరించలేదే మానవ లోకం (2)     ||చిందింది||

ఏదేనులో పుట్టిన ఆ పాపము
శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2)
ఆ మరణమును తొలగించుటకు
మరణ పాత్రను చేబూనావా (2)
నా మరణమును తప్పించినావా        ||కరుణ||

చేసింది లోకం ఘోరమైన పాపం
మోపింది నేరం నీ భుజము పైనా (2)
యెరుషలేములో పారిన నీ రక్తము
ఈ లోక విమోచన క్రయధనము (2)
ఈ లోక విమోచన క్రయధనము        ||కరుణ||

నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం
మరణపు ముల్లును విరిచిన దేవుడా (2)
జీవకిరీటము నిచ్చుటకై
ముళ్ళ కిరీటము ధరించితివా (2)
నాకు నిత్య జీవమిచ్చితివా       ||కరుణ||

English Lyrics

Audio

మరువలేనయ్యా

పాట రచయిత: డేవిడ్ రాజ్
Lyricist: David Raj

Telugu Lyrics


సిలువలో నాకై చేసిన యాగము
మరువలేనయ్యా మరచిపోనయ్యా
నీ ప్రేమను… నీ త్యాగము…

మరువలేనయ్యా నీ ప్రేమను
మరచిపోనయ్యా నీ త్యాగము (2)
సిలువలో నాకై చేసిన యాగము (2)           ||మరువలేనయ్యా||

నా కోసమే నీవు జన్మించితివి
నా కోసమే నీవు సిలువనెక్కితివి (2)
నా కోసమే నీవు మరణించితివి (2)
నా కోసమే నీవు తిరిగి లేచితివి (2)           ||మరువలేనయ్యా||

ఎవరూ చూపని ప్రేమను చూపి
ఎవరూ చేయని త్యాగము చేసి (2)
విడువను ఎడబాయను అన్నావు (2)
నీ నిత్యజీవమును నాకివ్వగోరి (2)           ||మరువలేనయ్యా||

English Lyrics

Audio

చూడరే సిలువను

పాట రచయిత: ఒంగోలు అబ్రాహాము
Lyricist: Ongole Abraham

Telugu Lyrics

చూడరే సిలువను వ్రే-లాడు యేసయ్యను
పాడు లోకంబునకై – గోడు జెందె గదా        ||చూడరే||

నా చేతులు చేసినట్టు – దోషంబులే గదా
నా రాజు చేతులలో ఘోరంపు జీలలు        ||చూడరే||

దురితంపు దలఁపులే – పరమ గురిని శిరముపై
నెనరు లేక మొత్తెనయ్యొ – ముండ్ల కిరీటమై        ||చూడరే||

పరుగెత్తి పాదములు – చేసిన పాపంబులు
పరమ రక్షకుని – పాదములలో మేకులు        ||చూడరే||

పాపేఛ్చ తోడ గూడు – నాడు చెడ్డ పడకలే
పరమ గురుని ప్రక్కలోని – బల్లెంపు పోటులు        ||చూడరే||

English Lyrics

Audio

ఇదేనా న్యాయమిదియేనా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఇదేనా న్యాయమిదియేనా
కరుణామయుడు యేసు ప్రభుని – సిలువ వేయ       ||ఇదేనా||

కుంటి వారికి కాళ్ళ నొసగే
గ్రుడ్డి వారికి కళ్ళ నొసగే
రోగుల నెల్ల బాగు పరిచే – ప్రేమ మీర       ||ఇదేనా||

చెడుగు యూదులు చెరను బట్టి
కొరడా దెబ్బలు కసిగా గొట్టి
వీధులలోనికి ఈడ్చిరయ్యో – రక్తము కారన్       ||ఇదేనా||

మోయలేని సిలువ మోపి
గాయములను ఎన్నో చేసి
నడవలేని రాళ్ళ దారిన్ – నడిపిరయ్యో       ||ఇదేనా||

ప్రాణముండగానే సిలువ కొయ్యకు
మేకులెన్నో కొట్టిరయ్యో
ప్రక్కలోనే బల్లెముతో – పొడిచిరయ్యో       ||ఇదేనా||

ఎన్ని బాధలు పెట్టిన గాని
మారు పల్కడు యేసు ప్రభువు
ఎంత ప్రేమ ఎంత కరుణ – ఎంత జాలి       ||ఇదేనా||

ఎన్ని మారులు పాపము చేసి
యేసుని గాయముల్ రేపెదవేల
నరక బాధ ఘోరమయ్యొ – గాంచవేల       ||ఇదేనా||

English Lyrics

Audio

నా ప్రియుడు యేసు

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు
వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల (2)         ||నా ప్రియుడు||

మెల్లని చల్లని స్వరమే వినబడెను (2)
తండ్రీ వీరేమి చేయుచున్నారో (2)
ఎరుగరు గనుక క్షమించుమనెన్
ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే         ||నా ప్రియుడు||

అతని ప్రేమ మధురం మధురం
ఎన్నటికీ నే మరువలేను (2)
ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం
శాపమంతా బాపి నను దీవించెనుగా         ||నా ప్రియుడు||

వీపంతా దున్నబడె నాగలితో
కారె రక్త వరదల్ కనుమా (2)
యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత
నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా         ||నా ప్రియుడు||

తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి
నాకై విన్నతి చేయుచున్నాడు (2)
రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే
నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును         ||నా ప్రియుడు||

English Lyrics

Audio

కల్వరిలోన చేసిన యాగం

పాట రచయిత: సాయారం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics


కల్వరిలోన చేసిన యాగం
మరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2)
కడిగి వేసెను నాదు పాపం
నిలిపె నాలో నీ స్వరూపం (2)      ||కల్వరిలోన||

ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలు
తొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలు
పరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలు
నాలోని రోగాలకై పొందితివా గాయాలు (2)
దైవ సుతుడవే అయిన గాని
కనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2)      ||కల్వరిలోన||

ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారం
రద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారం
నువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెను
చిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2)
నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివి
నన్ను రక్షించుటకు వేదన పడితివి (2)      ||కల్వరిలోన||

సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహము
అందించేను నా కొరకై ఆ జీవ జలము
కఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదు
నింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2)
అధికారమే లేని మరణము నిలిచెను
నిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2)      ||కల్వరిలోన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇమ్మానుయేలు రక్తము

పాట రచయిత: విలియం కౌపర్
Lyricist: William Cowper

Telugu Lyrics

ఇమ్మానుయేలు రక్తము
ఇంపైన యూటగు
ఓ పాపి! యందు మున్గుము
పాపంబు పోవును

యేసుండు నాకు మారుగా
ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్త మెప్పుడు
స్రవించు నాకుగా

ఆ యూట మున్గి దొంగయు
హా! శుద్ధు-డాయెను
నేనట్టి పాపి నిప్పుడు
నేనందు మున్గుదు

నీ యొక్క పాప మట్టిదే
నిర్మూల మౌటకు
రక్షించు గొర్రె పిల్ల? నీ
రక్తంబే చాలును

నా నాదు రక్తమందున
నే నమ్మి యుండినన్
నా దేవుని నిండు ప్రేమ
నే నిందు జూచెదన్

నా ఆయుష్కాల మంతటా
నా సంతసం-బిదే
నా క్రీస్తు యొక్క రొమ్మునన్
నా గాన-మిద్దియే

English Lyrics

Audio

ప్రేమగల యేసయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ప్రేమగల యేసయ్యా
జీవ వృక్షమా యేసయ్యా (2)
సిలువలో బలి అయిన యేసయ్యా
తులువలో వెలి అయిన యేసయ్యా (2)
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా
పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా
పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా       ||ప్రేమగల||

యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా
రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా
కొరడాల దెబ్బలు చెళ్లుమనెను
శరీరపు కండలే వేలాడేను (2)
నలిగిపోతివా నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడా||

యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు
ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు
గడ్డము పట్టాయనను లాగుచుండగా
నాగటి వలె సిలువలో దున్నబడగా (2)
ఒరిగిపోతివా నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడా||

యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా
మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే
తనువంత రుధిరముతో తడిసిపోయెనే
తండ్రీ అని కేక వేసి మరణించెనే (2)
మూడవ దినాన తిరిగి లేచెను (2)        ||పరిశుద్ధుడా||

English Lyrics

Audio

సిలువే నా శరణాయెను రా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువే నా శరణాయెను రా
నీ… సిలువే నా శరణాయెను రా
సిలువ యందే ముక్తి బలము చూచితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకులందు
విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను చూచు కొలది – శిల సమానమైన మనసు
నలిగి కరిగి నీరగుచున్నది రా
నీ… సిలువే నా శరణాయెను రా

సిలువను దరచి తరచితి – విలువకందగరాని నీ కృప
కలుషమెల్లను బాపగ చాలును రా
నీ… సిలువే నా శరణాయెను రా

పలు విధ పథములరసి – ఫలితమేమి గానలేక
సిలువ యెదుటను నిలచినాడను రా
నీ… సిలువే నా శరణాయెను రా

శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా
దురిత దూరుడ నీ దరి జేరితి రా
నీ… సిలువే నా శరణాయెను రా

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

గాయాములన్

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


గాయాములన్ గాయములన్
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2)
నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు

సురూపమైన సొగసైనా లేదు
దుఃఖ భరితుడాయెను (2)
వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్
వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2)       ||గాయాములన్||

మా అతిక్రమ క్రియలను బట్టి
మరి నలుగ గొట్టబడెను (2)
తాను పొందిన దెబ్బల ద్వారా
స్వస్థత కలిగె మనకు (2)       ||గాయాములన్||

క్రీస్తు ప్రేమను మరువజాలము
ఎంతో ప్రేమించే మనల (2)
సిలువపై మేము గమనించ మాకు
విలువైన విడుదల కలిగె (2)       ||గాయాములన్||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME