ఎవరి కోసమో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము (2)
నీ కోసమే నా కోసమే
కలువరి పయనం – ఈ కలువరి పయనం (2)        ||ఎవరి||

ఏ పాపము ఎరుగని నీకు – ఈ పాప లోకమే సిలువ వేసిందా
ఏ నేరము తెలియని నీకు – అన్యాయపు తీర్పునే ఇచ్చిందా (2)
మోయలేని మ్రానుతో మోముపైన ఉమ్ములతో
నడువలేని నడకలతో తడబడుతూ పోయావా
సోలి వాలి పోయావా….           ||ఎవరి||

జీవకిరీటం మాకు ఇచ్చావు – ముళ్ళ కిరీటం నీకు పెట్టాము
జీవ జలములు మాకు ఇచ్చావు – చేదు చిరకను నీకు ఇచ్చాము (2)
మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా
నీ ప్రక్కలో బళ్ళెముతో – ఒక్క పోటు పొడిచితిమి
తండ్రీ వీరు చేయునదేదో వీరెరుగరు
వీరిని క్షమించు, వీరిని క్షమించు
అని వేడుకొన్నావా… పరమ తండ్రిని        ||ఎవరి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మనస యేసు మరణ బాధ

పాట రచయిత: మిక్కిలి సమూయేలు
Lyricist: Mikkili Samooyelu

Telugu Lyrics


మనస యేసు మరణ బాధ – లెనసి పడవే
తన – నెనరు జూడవే యా – ఘనుని గూడవే
నిను – మనుప జచ్చుటరసియే – మరక వేడవే          ||మనస||

అచ్చి పాపములను బాప – వచ్చినాడట
వా-క్కిచ్చి తండ్రితో నా – గెత్సేమందున
తా – జొచ్చి యెదను నొచ్చి బాధ – హెచ్చుగనెనట          ||మనస||

ఆ నిశీధ రాత్రి వేళ – నార్భటించుచు
న-య్యో నరాంతకుల్ చే-బూని యీటెలన్
ఒక – ఖూని వానివలెను గట్టి – కొంచుబోయిరా          ||మనస||

పట్టి దొంగవలెను గంత – గట్టి కన్నులన్
మరి – గొట్టి చెంపలన్ వడి – దిట్టి నవ్వుచున్
నిను – గొట్టి రెవ్వరదియు మాకు – జెప్పమనిరట          ||మనస||

ముళ్ల తోడ నొక కిరీట – మల్లి ప్రభు తలన్
బెట్టి – రెల్లు కర్రతో నా – కళ్ళ జనములు
రా-జిల్లు మనుచు గొట్టి నవ్వి – గొల్లు బెట్టిరా          ||మనస||

మొయ్యలేక సిల్వ భారము – మూర్చ బోయెనా
అ-య్యయ్యో జొక్కెనా యే-సయ్య తూలెనా
మా – యయ్యనిన్ దలంపగుండె – లదరి పోయెనా          ||మనస||

కాలు సేతులన్ గుదించి – కల్వరి గిరిపై
నిన్ – గేలి జేయుచు నీ – కాళ్ళ మీదను
నినుప – చీలలతో గృచ్చి నిన్ను – సిల్వ గొట్టిరా          ||మనస||

దేవ సుతుడా వైతి వేని – తీవరంబుగా
దిగి – నీవు వేగమే రమ్ము – గావు మనుచును
ఇట్లు – గావరించి పల్కు పగర – కరుణ జూపెనా          ||మనస||

తన్ను జంపు శత్రువులకు – దయను జూపెనా
తన – నెనరు జూపెనా ప్రభు – కనికరించెనా
ఓ – జనక యీ జనుల క్షమించు – మనుచు వేడెనా          ||మనస||

తాళలేని బాధ లీచ్చి – దాహమాయెనా
న-న్నేలువానికి నా – పాలి స్వామికి
నే-నేల పాపములను జేసి – హింస పరచితి          ||మనస||

గోడు బుచ్చి సిలువపైన – నేడు మారులు
మా-ట్లాడి ప్రేమతో నా – నాడు శిరమును
వంచి – నేడు ముగిసె సర్వ మనుచు – వీడె ప్రాణము          ||మనస||

మరణమైన ప్రభుని జూచి – ధరణి వణకెనా
బల్ – గిరులు బగిలెనా – గుడి తెరయు జీలెనా
దివా-కరుడు చీకటాయె మృతులు – తిరిగి లేచిరి          ||మనస||

ఇంత జాలి యింత ప్రేమ – యింత శాంతమా
నీ – యంత కరుణను నే – జింత చేయగా
నీ – వింత లెల్ల నిత్య జీవ – విధము లాయెనా          ||మనస||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సిలువలో ఆ సిలువలో

పాట రచయిత: దేవరాజ్
Lyricist: Devaraj

Telugu Lyrics


సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా (2)
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా          ||సిలువలో||

నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ- మోయలేక మోసావు (2)
కొరడాలు చెల్లని చీల్చెనే – నీ సుందర దేహమునే (2)
తడిపెను నీ తనువునే – రుధిరంబు ధారలే (2)        ||వెలి||

వధకు సిద్దమైన గొర్రెపిల్ల వోలె
మోమున ఉమ్మివేయ మౌనివైనావే (2)
దూషించి అపహసించి హింసించిరా నిన్ను (2)
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా (2)        ||వెలి||

నాదు పాప భారం – నిను సిలువకు గురి చేసెనే
నాదు దోషమే నిన్ను – అణువణువున హింసించెనే (2)
నీవు కార్చిన రక్త ధారలే – నా రక్షణకాధారం (2)
సిలువలో చేరెదన్ – విరిగిన హృదయముతోను (2)        ||వెలి||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

 

 

ఎంతెంత భారమాయె

పాట రచయిత: సాయరాం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

ఎంతెంత భారమాయె ఆ సిలువ
లోక పాపములన్ని నువ్వు గెలువ (2)
కదిలినావు ఆ కల్వరికి
మరణముని దరి చేర్చుకొని (2)
యేసయ్యా… నా యేసయ్యా…
అలసిపోతివ నా యేసయ్యా… (2)

కొరడాలు నీ ఒళ్ళు చీల్చేను
పిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2)
వడి ముళ్ళు తలలోన నాటేను
నీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2)           ||యేసయ్యా||

బరువైన సిలువను మోయలేక
తడబడె నీ అడుగు అదిరిపడి (2)
వడివడిగా నిన్ను నడువుమని
పడి పడి తన్నిరి ఆ పాపులు (2)      ||యేసయ్యా||

చల్లని నీ దేహమల్లాడెను
ఏ చోటు లేకుండ గాయాలతో (2)
కాళ్ళు చేతులకు దిగి మేకులు
వ్రేళాడే సిలువకు నీ ప్రాణము (2)        ||యేసయ్యా||

వెలలేనిది తండ్రి నీ త్యాగము
నీ కష్టమంతయు నా పాపము (2)
మదిలోన కొలువుండు నా రక్షకా
వదిలేది లేదు నిన్ను నా పాలిక (2)            ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కలువరి గిరి నుండి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


కలువరి గిరి నుండి
ప్రవహించే ధార
ప్రభు యేసు రక్త ధార (2)
నిర్దోషమైన ధార
ప్రభు యేసు రక్త ధార (2)
ప్రభు యేసు రక్త ధార (2)       ||కలువరి||

నా పాపముకై నీ చేతులలో
మేకులను దిగగొట్టిరా (2)
భరియించినావా నా కొరకే దేవా
నన్నింతగా ప్రేమించితివా (2)     ||కలువరి||

నా తలంపులే నీ శిరస్సుకు
ముండ్ల కిరీటముగా మారినా (2)
మౌనము వహియించి సహియించినావా
నన్నింతగా ప్రేమించితివా (2)       ||కలువరి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎంతో వింత

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎంతో వింత యెంతో చింత
యేసునాధు మరణ మంత (2)
పంతము తో జేసి రంత
సొంత ప్రజలు స్వామి నంత (2)      ||ఎంతో||

పట్టి కట్టి నెట్టి కొట్టి
తిట్టి రేసు నాధు నకటా (2)
అట్టి శ్రమల నొంది పలుక
డాయె యేసు స్వామి నాడు (2)       ||ఎంతో||

మొయ్యలేని మ్రాను నొకటి
మోపి రేసు వీపు పైని (2)
మొయ్యలేక మ్రాని తోడ
మూర్చబోయే నేసు తండ్రి (2)      ||ఎంతో||

కొయ్యపై నేసయ్యన్ బెట్టి
కాలు సేతులలో జీలల్ (2)
కఠిను లంత గూడి కొట్టిరి
ఘోరముగ క్రీస్తేసున్ బట్టి (2)      ||ఎంతో||

దాహము గొన చేదు చిరక
ద్రావ నిడిరి ద్రోహు లకటా (2)
ధాత్రి ప్రజల బాధ కోర్చి
ధన్యుడా దివి కేగె నహహా (2)      ||ఎంతో||

బల్లెముతో బ్రక్కన్ బొడవన్
పారే నీరు రక్త మహహా (2)
ఏరై పారే యేసు రక్త
మెల్ల ప్రజల కెలమి నొసగు (2)      ||ఎంతో|

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

ఏ పాపమెరుగని

పాట రచయిత: యర్మనిశెట్టి దావీదు
Lyricist: Yarmanishetti Daaveedu

Telugu Lyrics

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా

ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||

కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప||

చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప||

ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||

పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప||

బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప||

కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

కల్వరిగిరిలోన సిల్వలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)

ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు (2)
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు (2) ||నీ కోసమే||

వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు (2)
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||

సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి (2)
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||

English Lyrics

Audio

 

 

భాసిల్లెను సిలువలో

పాట రచయిత: ఏ బి మాసిలామని
Lyricist: AB Maasilaamani

Telugu Lyrics

భాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా      ||భాసిల్లెను||

కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2)      ||భాసిల్లెను||

దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2)     ||భాసిల్లెను||

పాపము చేసి గడించితి మరణం
శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి (2)     ||భాసిల్లెను||

నీ మరణపు వేదన వృధా గాదు
నా మది నీ వేదనలో మునిగెను
క్షేమము కలిగెను హృదయములో (2)     ||భాసిల్లెను||

ఎందులకో నాపై ఈ ప్రేమ
అందదయ్యా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని (2)     ||భాసిల్లెను||

నమ్మిన వారిని కాదన వనియు
నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదంబులను (2)      ||భాసిల్లెను||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

అపరాధిని యేసయ్యా

పాట రచయిత: సిరిపురపు కృపానందము
Lyricist: Siripurapu Krupaanandamu

Telugu Lyrics

అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా (2)
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు (2)

సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా (2)

ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో (2)

ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)

దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి (2)
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను (2)

ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని (2)
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)

చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)

శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME