తరచి తరచి

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesly

Telugu Lyrics

తరచి తరచి చూడ తరమా
వెదకి వెదకి కనుగొనగలమా
యేసు వంటి మిత్రుని లోకమందున
విడచి విడచి ఉండగలమా
మరచి మరచి ఇలా మనగలమా
యేసు వంటి స్నేహితుని విశ్వమందున

లోక బంధాలన్నీ తృప్తినివ్వలేవుగా
ఏ మనిషిని నమ్మాలో – తెలియదు ఈ లోకంలో
నేల మంటిలోన పరమార్ధం లేదుగా
ఎంత బ్రతుకు బ్రతికినా – చివరకు చితియేగా
నమ్మదగిన యేసు ప్రాణమిచ్చె నీకై
జగతిలోన దొరకునా ఇటువంటి ప్రాణప్రియుడు (2)         ||తరచి||

లేరు లేరు ఎవ్వరు కానరారు ఎవ్వరు
యేసు వంటి ప్రేమికుడు ఇహమందు పరమందు
పదివేలలోన అతి కాంక్షణీయుడు
కలతలన్ని తీర్చి కన్నీటిని తుడచును
కల్వరిగిరిలోన కార్చెను రుధిరం
హృదయమందు చేర్చుకో కృప చూపు నాథుని (2)         ||తరచి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యవ్వనులారా మీరు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


యవ్వనులారా మీరు – ప్రభు నొద్దకు రండి
సమృద్ధియైన జీవము నొందుటకు – (2)
ఆహాహా హల్లెలూయా – (6)

ప్రభు యేసు మన కొరకు
సిలువపై బలియాయెను (2)
మీ పాపమునొప్పుకొనిన (2)
క్షమియించి నూతన జీవమునిచ్చున్ (2)         ||ఆహాహా||

ప్రభు యేసుని స్వరమును వినుచు
ఆ ప్రభుని వెంబడించిన (2)
కాపాడును దుష్టుని నుండి (2)
నడిపించు నిన్ను అంతము వరకు (2)         ||ఆహాహా||

చేపట్టి జీవ వాక్యము
జ్యోతుల వలె ఇహమందున (2)
ప్రభు కొరకు ప్రకాశించుచు (2)
ప్రకటింతురు ప్రభు యేసుని సువార్తను (2)         ||ఆహాహా||

నిజ ఆహారా పానీయం
ప్రభు యేసు క్రీస్తే కాగా (2)
ఆయననే తిని త్రాగుచూ (2)
ఆ జీవముతో మనము జీవించెదము (2)         ||ఆహాహా||

మృతి నొందిన మనమందరము
పై వాటినే వెంటాడెదం (2)
మన జీవము వృద్ధి నొందుచూ (2)
ప్రభు యేసుని మహిమను పొందెదము (2)        ||యవ్వనులారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

సిలువ చెంతకు రా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువ చెంతకు రా (4)
సహోదరా సిలువ చెంతకు రా
సహోదరీ సిలువ చెంతకు రా

యవ్వన కాల పాపములో
మరణ మార్గాన వెళ్లెదవా (2)
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా (2)     ||సిలువ||

సమస్తము నష్టపరచుకొని
హృదయము బ్రద్దలై ఏడ్చెదవా (2)
యేసుని పొందని బ్రతుకుతో
పాపములో మరణించెదవా (2)     ||సిలువ||

సిలువలో వ్రేలాడే యేసుని
నీవు వీక్షించినా చాలును (2)
రక్షకుడు చిందిన రక్తముతో
నీ పాపములన్ని కడుగబడున్ (2)     ||సిలువ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఈ దినమెంతో శుభ దినము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఈ దినమెంతో శుభ దినము
నూతన జీవితం అతి మధురం
ఆగదు కాలం మన కోసం
గతించిపోయెను చెడు కాలం
వచ్చినది వసంత కాలం     ||ఈ దినమెంతో||

నీ హృదయం ఆశలమయము
కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2)
యేసుని కొరకై తెరచిన హృదయం
ఆలయం అది దేవుని నిలయం       ||ఈ దినమెంతో||

జీవితమే దేవుని వరము
తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2)
నూతన జీవము నింపుకొని
నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం      ||ఈ దినమెంతో||

English Lyrics

Audio

ఎట్టి వాడో యేసు

పాట రచయిత: గోడి సామ్యూల్
Lyricist: Godi Samuel

Telugu Lyrics

ఎట్టి వాడో యేసు – ఎన్ని వింతలు తనవి
వట్టి నరుడు కాడు – పట్టి చూడ ప్రభుని – (2)      ||ఎట్టి||

గాలి సంద్రాలను – గద్ధింపగా యేసు (2)
హద్దు మీరక ఆగి – సద్దుమణిగిపోయే (2)      ||ఎట్టి||

పక్షవాతపు రోగిని – తక్షణమే లెమ్మనగా (2)
పరుపెత్తుకొని లేచి – పరుగెత్తికొనిపోయె (2)      ||ఎట్టి||

పట్టు యేసుని పాదం – తట్టు దేవుని ద్వారం (2)
కట్టు ఇక నీ పాపం – నెట్టు నిను పరలోకం (2)      ||ఎట్టి||

English Lyrics

Audio

రాజులకు రాజైన ఈ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాజులకు రాజైన ఈ మన విభుని
పూజ చేయుటకు రండి
ఈ జయశాలి కన్నా
మనకింకా రాజెవ్వరును లేరని       ||రాజులకు||

కరుణ గల సోదరుండై ఈయన
ధరణికేతెంచెనయ్యా (2)
స్థిరముగా నమ్ముకొనిన
మనకొసగు పరలోక రాజ్యమును       ||రాజులకు||

నక్కలకు బొరియలుండే నాకాశ
పక్షులకు గూళ్లుండెను (2)
ఒక్కింత స్థలమైనను
మన విభుని కెక్కడ లేకుండెను       ||రాజులకు||

త్వరపడి రండి రండి ఈ పరమ
గురుని యొద్దకు మీరలు (2)
దరికి జేరిన వారిని
ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము       ||రాజులకు||

English Lyrics

Audio

సందేహమేల

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)      ||సందేహమేల||

ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      ||సందేహమేల||

ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)      ||సందేహమేల||

ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)      ||సందేహమేల||

లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)      ||సందేహమేల||

English Lyrics

Audio

యేసయ్య మాట బంగారు మూట

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్య మాట బంగారు మూట
ఎన్నటికి మారని మాటేనన్న
ఎన్నటెన్నటికి మారని మాటేనన్న
నిత్యజీవానికి సత్యమైనది
పరలోక రాజ్యానికి మార్గమైనది
పదరా పదరా పోదాం పదరా
(మన) యేసయ్య చెంతకు పోదాం పదరా – (2)

చెట్టు పైకి చక్కగా చూసాడయ్యా
పొట్టి జక్కయ్యను పిలిచాడయ్యా
తిన్నగా ఇంటికి వేళ్ళాడయ్యా
అబ్రహాము బిడ్డగా మార్చాడయ్యా         ||పదరా||

సమరయ స్త్రీని చూసాడయ్యా
కుండను బద్దలు కొట్టాడయ్యా
జీవపు ఊటలు ఇచ్చాడయ్యా
జీవితాన్నే మార్చివేసాడయ్యా         ||పదరా||

English Lyrics

Audio

యాకోబు బావి కాడ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా
ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2)
దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2)
నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2)       ||యాకోబు||

అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయె
మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2)
నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2)
చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2)       ||యాకోబు||

అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే
నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2)
అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2)
లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2)       ||యాకోబు||

నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే
ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2)
వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2)
ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2)       ||యాకోబు||

నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు
ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2)
గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2)
తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2)       ||యాకోబు||

English Lyrics

Audio

జీవితమంటే మాటలు కాదు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
(ఇవి) మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా – (2)       ||జీవితమంటే||

నమ్ముకున్నాడు యోసేపు – అమ్ముకున్నారు అన్నలు
నమ్ముకున్నాడు ఏశావు – మోసగించాడు యాకోబు (2)
ఈ అన్నల నమ్మే కంటే…
ఈ అన్నల నమ్మే కంటే
అన్న యేసుని నమ్ముకో
రాజ్యం నీదే మేలుకో
పరలోకం నీదే ఏలుకో       ||జీవితమంటే||

నమ్ముకున్నాడు యేసయ్యా – అమ్ముకున్నాడు శిష్యుడు
పాపుల కొరకై వచ్చాడమ్మా – ప్రాణాలే తీసారమ్మా (2)
ఈ మనుషులలోనే…
ఈ మనుషులలోనే – మమతలు లేవు
మంచితనానికి రోజులు కావు
సమయం మనకు లేదమ్మా
ఇక త్వరపడి యేసుని చేరమ్మా       ||జీవితమంటే||

నమ్మకమైన వాడు – ఉన్నాడు మన దేవుడు
నమ్మదగినవాడు – వస్తాడు త్వరలోనే (2)
యేసుని రాకకు ముందే…
యేసుని రాకకు ముందే
మారు మనస్సును పొందుమా
ప్రభుని చెంతకు చేరుమా
రక్షణ భాగ్యం పొందుమా       ||జీవితమంటే||

English Lyrics

Audio

HOME