పాతాళంలో ఆత్మల ఆర్తనాదం

పాట రచయిత: సత్య వేద సాగర్
Lyricist: Sathya Veda Sagar

Telugu Lyrics


పాతాళంలో ఆత్మల ఆర్తనాదం
భూలోకంలో సువార్తల సునాదము (2)
మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం
ఎంచుకో స్వర్గం – నరకం (2)
గమనించుకో ఎటు నీ పయనం         ||పాతాళంలో||

ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది
విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది (2)
రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ
రక్షించే వారులేక రోధిస్తారక్కడ (2)         ||పాతాళంలో||

ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది
వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది (2)
ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది
ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది (2)         ||పాతాళంలో||

English Lyrics

Audio

నింగిలో దేవుడు

పాట రచయిత: Jaladi
Lyricist: జాలాడి

Telugu Lyrics

నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు
ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
చెంత చేరి సంతసించుమా (2)
స్వంతమైన క్రీస్తు సంఘమా        ||నింగిలో||

పాపాల పంకిలమై శోకాలకంకితమై
మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2)      ||నింగిలో||

సాతాను శోధనలే శాపాల వేదనలై
విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2)      ||నింగిలో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మనిషి బ్రతుకు రంగుల వలయం

పాట రచయిత: టోనీ ప్రకాష్
Lyricist: Tony Prakash

Telugu Lyrics


మనిషి బ్రతుకు రంగుల వలయం
ఆ బ్రతుకే క్షణ భంగురం (2)
మారాలి ప్రతి హృదయం
వెదకాలి క్రీస్తు రాజ్యము (2)        ||మనిషి||

గడ్డి పువ్వురా మనిషి జీవితం
గాలి వీచగా రాలిపోవును (2)
గాలిలో నిలువని దీపమురా ఇది
గాలిలో ఎగిరే గాలిపటం రా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)        ||మనిషి||

ఆత్మ వెళ్లగా శవమని నిన్ను
ఇంట నుంచరు పంచ చేర్చెదరు (2)
ఇరుగు పొరుగువారు కూడ కొందరు
వల్లకాటి వరకే వచ్చెదరు (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)        ||మనిషి||

ధనమున్నదని గర్వించకురా
ధనమే నీకు తోడు రాదురా (2)
లోకమే నీకు అశాశ్వతంబురా
పరలోకమే నీకు శాశ్వతంబురా (2)
తెలుసుకో ఓ మానవా
ఈ క్షణమే ప్రభు యేసుని (2)         ||మనిషి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎవరో తెలుసా యేసయ్యా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఎవరో తెలుసా యేసయ్యా
చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి
రక్షణ పొందయ్యా (2)

దేవాది దేవుడు యేసయ్యా
మానవ జన్మతో వచ్చాడయ్యా (2)
మరణించాడు మరి లేచాడు
నీ నా పాప విమోచనకై (2)        ||ఎవరో||

ధనవంతుడై యుండి యేసయ్యా
దరిద్రుడై ఇల పుట్టాడయ్యా (2)
రూపు రేఖలు కోల్పోయాడు
నీ నా పాపవిమోచనకై (2)        ||ఎవరో||

పాపుల రక్షకుడేసయ్యా
కార్చెను రక్తము పాపులకై (2)
తన దరి చేరిన పాపులనెల్ల
కడుగును తనదు రక్తముతో (2)        ||ఎవరో||

యేసే దేవుడు ఎరుగవయ్యా
రాజుల రాజుగా వస్తాడయ్యా (2)
నమ్మినవారిని చేర్చును పరమున
నమ్మని వారికి నరకమేగా (2)         ||ఎవరో||

యేసుని తరుపున ప్రతినిధినై
దేవుని ప్రేమకు ప్రతిరూపమై (2)
అతి వినయముగా బతిమాలుచున్నాను
నేడే నమ్ముము ప్రభు యేసుని (2)       ||ఎవరో||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రండి రండి యేసుని యొద్దకు

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే

యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల
అవనిలో అగచాట్ల పాలైన
అబ్బదు శాంతి ఆత్మకు నిలలో         ||రండి||

కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను
యూదులు తిరిగి వచ్చుచున్నారు        ||రండి||

ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యా ఘనుడు మనకై       ||రండి||

యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును      ||రండి||

నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని
యెంచి చెప్పిన యేసుని వద్దకు     ||రండి||

English Lyrics

Audio

Chords

దుర్దినములు రాకముందే

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesly

Telugu Lyrics


దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2)       ||దుర్దినములు||

సాగిపోయిన నీడవంటి జీవితం
అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
తెరచి ఉంది తీర్పు ద్వారం
మార్పులేని వారికోసం (2)
పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2)       ||దుర్దినములు||

రత్నరాసులేవి నీతో కూడ రావు
మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
యేసు క్రీస్తు ప్రభువు నందే
ఉంది నీకు రక్షణ (2)
తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2)       ||దుర్దినములు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

భేదం ఏమి లేదు

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics


భేదం ఏమి లేదు అందరును పాపం చేసియున్నారు
దేవాది దేవుడు ఇచ్ఛే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు (2)
ఏ కులమైనా మతమైనా జాతైనా రంగైనా
దేవుని దృష్టిలో అందరు పాపులే (2)          ||భేదం||

ఆస్తిపాస్థులు ఎన్నున్నా నిత్య రాజ్యము నీకివ్వవు
విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వవు
సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు
కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు
నీవెవరైనా నీకెంతున్నా ఎవరున్నా లేకున్నా
యేసు లేకుంటే నీకున్నవన్ని సున్నా (2)          ||భేదం||

పుణ్య కార్యాలు చేసినా పవిత్రత నీకు రాదుగా
తీర్థ యాత్రలు తిరిగినా తరగదు నీ పాపము
పరమును వీడిన పరిశుద్ధుడేసు రక్తము కార్చెను కలువరిలో
కోరి కోరి నిను పిలిచెను పరమ రాజ్యము నీకివ్వగా
నీ స్థితి ఏదైనా గతి ఏడైన వృత్తేదైనా భృతి ఏదైనా
కలువరి నాథుడే రక్షణ మార్గము (2)          ||భేదం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

భారత దేశమా యేసుకే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


భారత దేశమా యేసుకే
నా భారత దేశమా ప్రియ యేసుకే (2)
నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

సృష్టికర్తనే మరచి – భారత దేశమా
సృష్టిని పూజించుట తగునా – నా భారత దేశమా (2)
ఈ లోకమును సృష్టించిన యేసే – భారత దేశమా
నిను రక్షించుటకు ప్రాణం పెట్టెను – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
నూతన సృష్టిగ మార్చబడుదువు భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

శాంతికి అధిపతి ఆ యేసే – భారత దేశమా
శాంతి రాజ్యమును స్థాపించును – నా భారత దేశమా (2)
లోకమంతయు లయమైపోవును – భారత దేశమా
లోకాశలన్నియు గతించిపోవును – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
శాంతి సమాధానములను పొందుము భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

రాజుల రాజుగ మన యేసే – భారత దేశమా
పెండ్లి కుమారుడై రానుండె – నా భారత దేశమా (2)
యేసుని నమ్మిన దేశములన్ని – భారత దేశమా
యేసుతో కూడ కోనిపోబడును – భారత దేశమా (2)
భారత దేశమా యేసుని చేరుమా
సువర్ణ దేశముగ మార్చబడుదువు భారత దేశమా (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

భారత దేశమా నా యేసుకే
భారత దేశమా ప్రియ యేసుకే (2)
నువ్వు సొంతం కావాలన్నదే నా ప్రార్థన
నిను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం (2)
యేసు నామమే జయము జయమని ఇహమంత మారుమ్రోగిపోవాలి
పని చేయుచున్న సాతాను శక్తులు పటా పంచలైపోవాలి (2)
భారత దేశమా నా భారత దేశమా
నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి
భారత దేశమా నా భారత దేశమా
ఉగ్రతలోనుండి నీవు రక్షణ పొందాలి

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రండి సువార్త సునాదముతో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రండి సువార్త సునాదముతో
రంజిలు సిలువ నినాదముతో
తంబుర సితార నాదముతో
ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2)            ||రండి||

యేసే మానవ జాతి వికాసం
యేసే మానవ నీతి విలాసం
యేసే పతీత పావన నామం
భాసుర క్రైస్తవ శుభ నామం          ||రండి||

యేసే దేవుని ప్రేమ స్వరూపం
యేసే సర్వేశ్వర ప్రతిరూపం
యేసే ప్రజాపతి పరమేశం
ఆశ్రిత జనముల సుఖవాసం          ||రండి||

యేసే సిలువను మోసిన దైవం
యేసే ఆత్మల శాశ్వత జీవం
యేసే క్షమాపణ అధికారం
దాసుల ప్రార్ధన సహకారం          ||రండి||

యేసే సంఘములో మన కాంతి
యేసే హృదయములో ఘన శాంతి
యేసే కుటుంబ జీవన జ్యోతి
పసిపాపల దీవెన మూర్తి          ||రండి||

యేసే జీవన ముక్తికి మార్గం
యేసే భక్తుల భూతల స్వర్గం
యేసే ప్రపంచ శాంతికి సూత్రం
వాసిగ నమ్మిన జన స్తోత్రం          ||రండి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

హృదయమనెడు తలుపు నొద్ద

పాట రచయిత: పులిపాక జగన్నాథము
Lyricist: Pulipaaka Jagannaathamu

Telugu Lyrics

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను (2)        ||హృదయ||

పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు (2)        ||హృదయ||

కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు (2)        ||హృదయ||

ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను (2)        ||హృదయ||

అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును (2)        ||హృదయ||

జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు (2)        ||హృదయ||

సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు (2)        ||హృదయ||

చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను (2)        ||హృదయ||

అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ (2)        ||హృదయ||

బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి (2)        ||హృదయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME