అదిగదిగో ఒక యుద్ధం

పాట రచయిత:
Lyricist:

అదిగదిగో ఒక యుద్ధం
అరెరెరె ఆగేనే ఆ సైన్యం
ఆర్బాటించెను ఆ జైంటు
ఆయెను సౌలు సైన్యం ఫెయింటు

అడుగడుగో ఒక చిన్నోడు
అరె దైవిక రోషం ఉన్నోడు
చేతిలో వడిసెలు పట్టాడు
ఆ జైంటు పకపక నవ్వాడు
హహహహహహ

విసిరితె వడిసెల రాయి
కొట్టింది దేవుడేనోయి (2)
గొల్యాతాయెను జీరో
దావీదే ఇక హీరో (2)

అదిగదిగో ఒక యుద్ధం
అరెరెరె ఆగేనే ఆ సైన్యం

Download Lyrics as: PPT

పిల్లలారా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

పిల్లలారా నా మాట వినుడి
యెహోవా యందు భక్తి నేర్పెదను – (2)       ||పిల్లలారా||

బ్రతుక గోరువాడెవడైన కలడా? (2)
మేలునొందుచు చాలా దినములు (2)       ||పిల్లలారా||

కపటమైన చెడు మాటలాడక (2)
కాచుకొనుము నీదు పెదవులను (2)       ||పిల్లలారా||

కీడు మాని మేలునే చేయుము (2)
సమాధానము వెదకి వెంటాడు (2)       ||పిల్లలారా||

యెహోవా దృష్టి నీతిమంతులపై (2)
కలదు వారి మొఱల వినును (2)       ||పిల్లలారా||

దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి (2)
కొట్టివేయు తన సన్నిధి నుండి (2)       ||పిల్లలారా||

నీతిమంతులు మొఱ పెట్టగా (2)
విని శ్రమల నుండి తప్పించును (2)       ||పిల్లలారా||

విరిగినట్టి హృదయములకు (2)
యెహోవా ఆసన్నుడై యున్నాడు (2)       ||పిల్లలారా||

నలిగియున్న వారల నెల్ల (2)
ఆయనే రక్షించు ప్రేమగల్గి (2)       ||పిల్లలారా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఈ సాయంకాలమున

పాట రచయిత: మల్లెల దావీదు
Lyricist: Mallela Daaveedu

Telugu Lyrics

ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు     ||ఈ సాయంకాలమున||

చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ     ||ఈ సాయంకాలమున||

దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు     ||ఈ సాయంకాలమున||

నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున
సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా     ||ఈ సాయంకాలమున||

జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం
అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్     ||ఈ సాయంకాలమున||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మైటీ జీసస్ తోడుంటే

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు
సే… భయమే లేదు
మిరాకిల్స్ కెప్పుడు కొదువ లేదు
ఎస్… కొదువ లేదు (2)
ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్
వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ (2)
ఎస్… నో వర్డ్స్

లాలాలా… లలలల్ల లాలాలా (2)

పగలు మేఘమై ఆ… ఆ… ఆ.. నీడనిచ్చెను ఓ… ఓ… ఓ..
అగ్ని స్తంభమై ఆ… ఆ… ఆ.. రాత్రి కాచెను ఓ… ఓ… ఓ..
పగలు మేఘమై నీడనిచెను
అగ్ని స్తంభమై రాత్రి కాచెను      ||మైటీ జీసస్||

మధుర మన్నాతో ఆ… ఆ… ఆ.. పోషించెను ఓ… ఓ… ఓ..
బండ చీల్చెను ఆ… ఆ… ఆ.. నీరు నిచ్చెను ఓ… ఓ… ఓ..
మధుర మన్నాతో పోషించెను
బండ చీల్చెను నీరు నిచ్చెను      ||మైటీ జీసస్||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఉదయకాలము మధ్యాహ్నము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఉదయకాలము మధ్యాహ్నము
సాయంకాలము చీకటి వేళలో (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (2)

లోకమునకు వెలుగైన
ఆ యేసే దారి చూపును (2)
చింత లేదు బాధ లేదు
భీతి లేదు భయము లేదు
యేసు ఉన్నాడు
నాలో యేసు ఉన్నాడు (4)

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
యేసు ప్రియ బిడ్డను (2)
సంతసముగ సాగిపోయెదన్ (2)
చెంత యేసు నాతో ఉండగా (2)     ||చిన్న||

ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా (2)
తొట్రిల్లను నేను చింతించను (2)
తోడుగా నా యేసు ఉండగా (2)     ||చిన్న||

పచ్చికగల చోటికి నన్ను నడుపును
శాంత జలముతో నన్ను తృప్తి పరచును (2)
నా కాపరి నా ప్రియుడేసుడే (2)
చిరకాలము నన్ను కాయును (2)     ||చిన్న||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

చెవులు ఉన్నాయా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)
ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2)
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)
విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్!
యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2)
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)

సాతాను మాటలా? దేవుని మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?
కాకి విన్నది చేప విన్నది
గాడిద విన్నది సృష్ఠి విన్నది (2)
యేసయ్య విన్నాడు ప్రాణం పెట్టాడు
వింటేనే రక్షణ యేసు కర్పణ         ||చెవులు||

ఫ్రెండ్స్ మాటలా? పేరెంట్స్ మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?
భూతు మాటలా సినిమా పాటలా
వద్దు బాబోయ్ దురద చెవులు (2)
దేవుని మాటలు వినే చెవులు ఉండాలని
బైబిల్లో మన కోసమే వ్రాయబడినది         ||చెవులు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఫేస్బుక్ యూట్యూబ్

పాట రచయిత: జోనా శామ్యూల్
Lyricist: Jonah Samuel

Telugu Lyrics

ఫేస్బుక్.. యూట్యూబ్.. ఏదైనా కానీ
నీ ఆత్మకు మేలుకై వాడుకోమని
వాట్సాప్.. మెసెంజర్.. ఏదైనా కానీ
దేవుని మహిమకై వాడుకోమని
నీ చెవిలో అరచి చెప్పనా
రిమైండర్ లా గుర్తు చెయ్యనా
ఓ అన్నా ఓ అక్కా
ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
యేసయ్య ప్రేమను
మించిందేమి లేదంటూ చాటి చెప్పనా

మండే.. ట్యూస్డే.. ఏ రోజైనా కానీ
దేవుని సన్నిధిని వదలవద్దని
సమ్మర్.. వింటర్.. ఏదైనా కానీ
దేవుని పనికై ముందుండాలని
నీ చెవిలో అరచి చెప్పనా
రిమైండర్ లా గుర్తు చెయ్యనా
ఓ అంకుల్ ఓ ఆంటీ
ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
యేసయ్య ప్రేమను
మించిందేమి లేదంటూ చాటి చెప్పనా

కోపం.. ఆనందం.. ఏదైనా కానీ
దేవుని ప్రేమను మరువవద్దని
ఫీవర్.. కాఫ్ అండ్ కోల్డ్.. ఏదైనా కానీ
దేవుని స్తుతించడం మానవద్దని
నీ చెవిలో అరచి చెప్పనా
రిమైండర్ లా గుర్తు చెయ్యనా
ఓ అన్నా ఓ అక్కా
ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
యేసయ్య ప్రేమను
మించిందేమి లేదంటూ చాటి చెప్పనా
చాటి చెప్పనా – (2)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

గిర గిర తిరిగి

పాట రచయిత: సురేష్ కుమార్ పాకలపాటి
Lyricist: Suresh Kumar Pakalapati

Telugu Lyrics

గిర గిర తిరిగి తిరిగి తిరిగి
తిరిగి తిరిగి తిరిగి తిరిగి
నెమలి వలె నే ఆడెద
గల గల పారే పారే పారే
పారే పారే పారే పారే
అలల వలె నే పొంగెద
తెల్లని వస్త్రము ధరియించెద
దేవుని మహిమకై జీవించెద
ఈ సౌందర్యము నా దేవునిదే
నా దేవుని మహిమకే నే వాడెద

గిర గిర తిరిగి తిరిగి తిరిగి
తిరిగి తిరిగి తిరిగి తిరిగి
నెమలి వలె నే ఆడెద
గల గల పారే పారే పారే
పారే పారే పారే పారే
అలల వలె నే పొంగెద
యేసుని శిష్యునిగా ఉండెద
ఆయన సువార్తనే చాటెద
పరలోకముకై వేచియుండెదా
జీవ కిరీటము నే పొందెద        ||గిర||

English Lyrics

Audio

నా చిన్ని హృదయంలో

పాట రచయిత: షారోన్ ఫిలిప్
Lyricist: Sharon Philip

Telugu Lyrics


నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4)
తన ప్రేమనే మాకు చూపి
తన వారసులుగా మము చేసెను
నాలో సంతోషం నాలో ఉత్సాహం
యేసయ్య నింపాడు (4)

లాలించును నను పాలించును
ఏ కీడు రాకుండా నను కాపాడును (2)
తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను
ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును         ||నాలో||

హత్తుకొనును నను ఓదార్చును
ఎల్లప్పుడూ నాకు తోడుండును (2)
అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా
మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము         ||నాలో||

English Lyrics

Audio

HOME