ఇద్దరొక్కటిగ మారేటి

పాట రచయిత: సాయరాం గట్టు
Lyricist: Sayaram Gattu

Telugu Lyrics

ఇద్దరొక్కటిగ మారేటి మధురమైన క్షణము
దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము (2)
వివాహమన్నది అన్నింట ఘనమైనది
ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి (2)

ఒంటరైన ఆదామును చూసి
జంట కావాలని మది తలచి (2)
హవ్వను చేసి జతపరచి – ఫలించమని దీవించెను
సృష్టిపైన అధికారముతో – పాలించుమని నియమించెను (2)           ||వివాహమన్నది||

ఏక మనసుతో ముందుకు సాగి
జీవ వృక్షముకు మార్గము ఎరిగి (2)
సొంత తెలివిని మానుకొని – దైవ వాక్కుపై ఆనుకొని
సాగిపోవాలి ఆ పయనం – దేవుని కొరకై ప్రతి క్షణం (2)           ||వివాహమన్నది||

భార్య భర్తలు సమానమంటూ
ఒకరి కోసము ఒకరనుకుంటూ (2)
క్రీస్తు ప్రేమను పంచాలి – సాక్ష్యములను చాటించాలి
సంతానమును పొందుకొని – తండ్రి రాజ్యముకు చేర్చాలి (2)           ||వివాహమన్నది||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మంగళమే యేసునకు

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushothamu Chaudhary

Telugu Lyrics


మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)
శృంగార ప్రభువునకు (2)
క్షేమాధిపతికి మంగళమే           ||మంగళమే||

పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)
నిరుపమానందునకు (2)
నిపుణ వేద్యునకు మంగళమే           ||మంగళమే||

దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)
కరుణా సంపన్నునకు (2)
జ్ఞాన దీప్తునకు మంగళమే           ||మంగళమే||

సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)
నిత్య స్వయంజీవునకు (2)
నిర్మలాత్మునకు మంగళమే           ||మంగళమే||

యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)
సత్య పరంజ్యోతి యగు (2)
సార్వభౌమునకు మంగళమే           ||మంగళమే||

నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3)
కరుదెంచిన మా పాలి (2)
వర రక్షకునకు మంగళమే           ||మంగళమే||

పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3)
పరమేశ్వర తనయునకు (2)
బ్రణుతింతుము నిన్ను మంగళమే           ||మంగళమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మధురం ఈ శుభ సమయం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మధురం ఈ శుభ సమయం
అతి మధురం వివాహ బంధం (2)
ఆనందమే ఇరువురి హృదయం (2)
జత కలిసె ఈ తరుణంలో (2)
నవ దంపతులకు స్వాగతం         ||మధురం||

ఆ దేవుని దీవెనలు ఎల్లవేళలా మీకుండగా
అబ్రహాము శారా వాలే ఏ క్షణమైనా వీడక (2)
మీ జీవిత సంద్రాన – ఎన్ని కష్టాలు ఎదురైనా (2)
ఒకరికొకరు తోడుగా కలకాలం నిలవాలి         ||మధురం||

ప్రేమకు ప్రతి రూపమే మీ పరిణయము
మనసులో వెలియగ మమతలు విరబూయగా (2)
అనురాగ పూవులే మీ ఇంట పూయగా (2)
మీ దాంపత్యం అందరికి కలకాలం నిలవాలి         ||మధురం||

English Lyrics

Audio

గుర్తుండిపోయే ఈ క్షణాలలో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం (4)

చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని        ||గుర్తుండిపోయే||

నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై (2)
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను (2)
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని       ||గుర్తుండిపోయే||

English Lyrics

Audio

మనసులొకటాయే భువిలో

పాట రచయిత: మైఖెల్ కళ్యాణపు
Lyricist: Michael Kalyanapu

Telugu Lyrics


మనసులొకటాయే భువిలో
ఇరువురొకటాయే హృదిలో (2)
మనసు పరవశమై మధుర లాహిరిలో (2)
మనసులోని భావాలు
ఉరకలు వేసే ఈ వేళా        ||మనసులొకటాయే||

ఎవరికెవరొక నాడు ఈ క్షణాన ఇచ్చోట
దేవ దేవుని సంకల్పం ఈ శుభ ఘడియా (2)
ఈ మధురమైన శుభవేళ (2)
ఒకరికొకరు తోడు నీడగా
సాగే ఈ తరుణం        ||మనసులొకటాయే||

అనురాగం నీ ప్రాణమై అభిమానం నీ స్నేహమై
జీవితాంతం ఒకరికొకరు ప్రేమ మూర్తులుగా (2)
ఘన యేసుని దివ్య ఆశీస్సు (2)
జీవితాంతం నిండుగ మెండుగ
నీతో నిలిచే ఈ తరుణం        ||మనసులొకటాయే||

English Lyrics

Audio

ఇది దేవుని నిర్ణయము

పాట రచయిత: జోనా సామ్యెల్
Lyricist: Jonah Samuel

Telugu Lyrics

ఇది దేవుని నిర్ణయము
మనుష్యులకిది అసాధ్యము (2)
ఏదేను వనమందు
ప్రభు స్థిరపరచిన కార్యము (2)
ప్రభు స్థిరపరచిన కార్యము      ||ఇది||

ఈ జగతి కన్నా మునుపే
ప్రభు చేసెను ఈ కార్యము (2)
ఈ ఇరువురి హృదయాలలో
కలగాలి ఈ భావము (2)
నిండాలి సంతోషము     ||ఇది||

వరుడైన క్రీస్తు ప్రభువు
అతి త్వరలో రానుండెను (2)
పరలోక పరిణయమే
మనమెల్లరము భాగమే (2)
మనమెల్లరము భాగమే     ||ఇది||

English Lyrics

Audio

గుణవతి అయిన భార్య

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

గుణవతి అయిన భార్య
దొరుకుట అరుదురా (2)
ఆమె మంచి ముత్యము కన్న విలువైందిరా
జీవితాంతము…
జీవితాంతము తోడురా
వెన్నెల బాటరా (2)
వెన్నెల బాటరా (4)       ||గుణవతి||

అలసినపుడు తల్లిలా
కష్టాలలో చెల్లిలా (2)
సుఖ దుఃఖములలో భార్యగా (2)
భర్త కన్నుల మేడరా        ||జీవితాంతము||

మరచిపోనిది మాసిపోనిది
పెండ్లనే బంధము (2)
మరచిపోకుమా జీవితమున (2)
పెండ్లి నాటి ప్రమాణము           ||జీవితాంతము||

English Lyrics

Audio

ఎక్కడెక్కడో పుట్టి

పాట రచయిత: ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
దేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – (2)

ఒంటరి బ్రతుకును విడిచెదరు
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)
పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలి
భార్య భర్తలు హత్తుకొనుటేమిటో        ||దేవుని||

గత కాల కీడంతా మరచెదరు
వీనులతో సంతసించెదరు (2)
పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో        ||దేవుని||

ఫలియించి భూమిని నింపెదరు
విస్తరించి వృద్ధి పొందెదరు (2)
పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ
ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో        ||దేవుని||

English Lyrics

Audio

ఊహించలేని కార్యములు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు
కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2)
దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు
ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు
ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే
కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము         ||ఊహించలేని||

ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం
ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2)
కలవాలి హృదయాలు ఒకటై
పండాలి నూరేళ్లు ఇకపై (2)
వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ       ||ఊహించలేని||

దేవుని సముఖములో బ్రతకాలి మీరు
మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2)
లోబడి ఉండాలి వధువు
ప్రేమను పంచాలి వరుడు (2)
దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి       ||ఊహించలేని||

English Lyrics

Audio

వివాహమన్నది

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

ఎముకలలో ఒక ఎముకగా – దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా- స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని – జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని – పురుషుని నియమించినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా – ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని – ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)          ||వివాహమన్నది||

English Lyrics

Audio

HOME