యేసు రాజుగా వచ్చుచున్నాడు

పాట రచయిత: వీధి ఏలియా
Lyricist: Veedhi Eliya

Telugu Lyrics


యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటారు (2)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
రారాజుగా వచ్చు చున్నాడు (2)    ||యేసు||

మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
లోకమంతా శ్రమకాలం (2)
విడువబడుట బహుఘోరం        ||యేసు||

ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
ఈ సువార్త మూయబడున్‌ (2)
వాక్యమే కరువగును         ||యేసు||

వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలన్ని ఆయన ఏలును (2)
నీతి శాంతి వర్ధిల్లును (2)
న్యాయమే కనబడును        ||యేసు||

ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
వంగని మోకాళ్ళన్నీ (2)
యేసయ్య యెదుట వంగిపోవును        ||యేసు||

క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
రెప్ప పాటున మారాలి (2)
యేసయ్య చెంతకు చేరాలి        ||యేసు||

English Lyrics

Audio

యేసు రాజు రాజుల రాజై

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


యేసు రాజు రాజుల రాజై
త్వరగా వచ్చుచుండె – త్వరగా వచ్చుచుండె
హోసన్నా జయమే – హోసన్నా జయమే
హోసన్నా జయం మనకే – హోసన్నా జయం మనకే ||యేసు||

యోర్దాను ఎదురైనా
ఎర్ర సంద్రము పొంగిపొర్లినా (2)
భయము లేదు జయము మనదే (2)
విజయ గీతము పాడెదము (2)      ||హోసన్నా||

శరీర రోగమైనా
అది ఆత్మీయ వ్యాధియైనా (2)
యేసు గాయముల్ స్వస్థపరచున్ (2)
రక్తమే రక్షణ నిచ్చున్ (2)       ||హోసన్నా||

హల్లెలూయ స్తుతి మహిమ
ఎల్లప్పుడు హల్లెలూయ స్తుతి మహిమ (2)
యేసు రాజు మనకు ప్రభువై (2)
త్వరగా వచ్చుచుండె (2)       ||హోసన్నా||

English Lyrics

Audio

రాకడ ప్రభుని రాకడ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాకడ ప్రభుని రాకడ
రాకడ రెండవ రాకడ
ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది
రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ||

నోవాహు దినములలో జరిగినట్లుగా
లోతు కాలమున సాగినట్లుగా (2)
పాపమందు ప్రజలంతా మునిగి తేలగా
లోకమంతా దేవుని మరచియుండగా (2)
మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా
మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2)      ||రాకడ||

దేవుని మరచిన ప్రజలందరిని
సువార్తకు లోబడని జనులందరిని (2)
శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును
అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2)
వేదనతో భూమినంత బాధపరచును
తన మహిమను ప్రజలకు తెలియపరచును (2)       ||రాకడ||

English Lyrics

Audio

 

 

అదే అదే ఆ రోజు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అదే అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు
పాపులంతా ఏడ్చే రోజు       ||అదే అదే||

వడగండ్లు కురిసే రోజు
భూమి సగం కాలే రోజు (2)
నక్షత్రములు రాలే రోజు
నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన
మనుషులంతా చచ్చే రోజు        ||అదే అదే||

సూర్యుడు నలుపయ్యే రోజు
చంద్రుడు ఎరుపయ్యే రోజు (2)
భూకంపం కలిగే రోజు
దిక్కు లేక అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

మిడతల దండొచ్చే రోజు
నీరు రక్తమయ్యే రోజు (2)
కోపాగ్ని రగిలే రోజు
పర్వతములు పగిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాధుడు లేడు         ||అదే అదే||

వ్యభిచారులు ఏడ్చే రోజు
మోసగాళ్ళు మసలే రోజు (2)
అబద్ధికులు అరచే రోజు
దొంగలంతా దొరికే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

పిల్ల జాడ తల్లికి లేక
తల్లి జాడ పిల్లకు లేక (2)
చేట్టుకొక్కరై పుట్టకొక్కరై
అనాథలై అరచే రోజు
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

ఓ మనిషి యోచింపవా
నీ బ్రతుకు ఎలా ఉన్నదో (2)
బలము చూసి భంగ పడకుమా
ధనము చూసి దగా పడకుమా
ఆ రోజు శ్రమ నుండి
తప్పించే నాథుడు లేడు       ||అదే అదే||

English Lyrics

Audio

 

 

నేడో రేపో నా ప్రియుడేసు

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

నేడో రేపో నా ప్రియుడేసు
మేఘాలమీద ఏతెంచును
మహిమాన్వితుడై ప్రభు యేసు
మహీ స్థలమునకు ఏతెంచును            ||నేడో రేపో||

చీకటి కమ్మును సూర్యుని
చంద్రుడు తన కాంతినీయడు (2)
నక్షత్రములు రాలిపోవును
ఆకాశ శక్తులు కదిలిపోవును (2)         ||నేడో రేపో||

కడబూర స్వరము ధ్వనియించగా
ప్రియుని స్వరము వినిపించగా (2)
వడివడిగ ప్రభు చెంతకు చేరెద
ప్రియమార ప్రభుయేసుని గాంచెద (2)       ||నేడో రేపో||

నా ప్రియుడేసుని సన్నిధిలో
వేదన రోదనలుండవు (2)
హల్లెలూయా స్తుతిగానాలతో
నిత్యం ఆనందమానందమే (2)               ||నేడో రేపో||

English Lyrics

Audio

 

 

HOME