నీవే నా ఆశ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎక్కలేనంత ఎత్తైన కొండ
ఎక్కించు వారు లేరెవ్వరు
కొండల తట్టు నా కన్నులెత్తి
నిరాశలో నిన్నే పిలిచాను
చీకటి తొలగించి నీ ప్రేమతోనే
నా హృదయమును నింపావు
లేఖనాలన్ని నెరవేర్చినావు
యేసు రాజా నీవే నా ఆశ

ఊహించలేని నీ గొప్ప కృపను
సమృద్ధిగానే పొందితిని
యుగముల రాజా మహిమను వీడి
అవమానమునే భరియించావు
సిలువలో నేను క్షమనే పొందాను
నీ సొత్తుగా నన్నే మార్చావు
నా రక్షకా నీ వాడను నేను
యేసు రాజా నీవే నా ఆశ

హల్లెలూయా నిన్నే ఆరాధింతును
హల్లెలూయా మరణమునే గెలిచావు
బంధకాలను తెంచావు
నీ నామములో రక్షణ
యేసు రాజా నీవే నా ఆశ (2)

వచ్చింది ఉదయం నెరవేరే వాగ్ధానం
సమాధిలో దేహం ఊపిరి పీల్చెన్
మరణముకు నాపై అధికారం లేదని
మౌనమునే వీడి చాటించావు (2)
యేసు.. నీదే విజయము

హల్లెలూయా నిన్నే ఆరాధింతును
హల్లెలూయా మరణమునే గెలిచావు
బంధకాలను తెంచావు
నీ నామములో రక్షణ
యేసు రాజా నీవే నా ఆశ (2)

యేసు రాజా నీవే నా ఆశ
దేవా నీవే నా ఆశ

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిరంతరం నీతోనే

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా     ||నిరంతరం||

చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి (2)
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై     ||నిరంతరం||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా ఆశల పల్లకి

పాట రచయిత: జే పి రమేష్
Lyricist: J P Ramesh

Telugu Lyrics


నా ఆశల పల్లకి నీవే
నా ఊహల ఊట నీవే
నాలో ప్రతిధ్వనించే ప్రతి పదము నీవే (2)
యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా ఆశ నీవయ్యా (2)

ఎడారిలో నీటి కొరకు – ఆశపడు బాటసారిలా
నీ కొరకు నా ప్రాణం – ఆశపడుచున్నది (2)
నా ఆశ నీవైపే – నా ధ్యాస నీవైపే
దాహము తీర్చావని (2)
దాహము తీర్చావని      ||యేసయ్యా||

దిక్కులేని పక్షిగా నేను – నిరాశతో ఉండగా
నా ఆశ తీర్చావే – నీ దరి చేర్చావే (2)
నా గమ్యం నీవైపే – నా గానం నీ కొరకే
తోడుగ ఉన్నావని (2)
తోడుగ ఉన్నావని      ||యేసయ్యా||

స్నేహితులు లేరని – తోడెవరు రారని
నా మనసు నాలోన – దుఃఖించు సమయాన (2)
నా స్నేహం నీవయ్యావు – దుఃఖము తీర్చావు
ఆదరించావయ్యా (2)
ఆదరించావయ్యా      ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

వందనం

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా

ఆకలితో నే అలమటించినప్పుడు
అక్కరనెరిగి ఆదుకొన్నావు (2)
వందనం యేసయ్యా
నీకే వందనం యేసయ్యా
నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే… యేసయ్యా
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా

ఊహించలేని ఆశ్చర్య కార్యములతో
ఏ కొదువ లేక నను కాచుచుంటివి (2)
కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా
నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు             ||వందనం||

తప్పిపోయినా త్రోవ మరచినా
నీ కృప నన్ను విడచి వెళ్ళదు (2)
నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు (2)
యేసయ్యా..
నా ప్రతి విన్నపం
నీ చెంత చేరునేసయ్యా – యేసయ్యా
నా ప్రతి ప్రార్థనకు
జవాబు నీవే యేసయ్యా – యేసయ్యా (2)

వందనం యేసయ్యా
నీకే వందనం యేసయ్యా
ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై
యేసయ్యా… వందనం

English Lyrics

Audio

Download Lyrics as: PPT

కనుచూపు మేరలోన

పాట రచయిత:ఏ ఆర్ స్టీవెన్సన్
Lyricist: A R Stevenson

Telugu Lyrics

నేనున్నా నీతో అంటూ
నా చెంతకు చేరావు
యేసయ్యా.. యేసయ్యా…

కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ
ఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళ
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)

మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా
బెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)
పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)

శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా
చెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)
స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)

కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగా
సడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2)
అడుగేసి సాగగ అనువుకాని వేళ (2)
నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు
నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2)         ||కనుచూపు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నడవాలని యేసు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నడవాలని యేసు నడవాలని
నడవాలని నీతో నడవాలని
నాకున్న ఆశ నీపైనే ధ్యాస (2)
నిరంతరం నీతోనే నడవాలని (2)

హానోకు నీతో నడిచాడు దేవ
పరలోకపు నడకతో చేరాడు నిన్ను      ||నడవా||

నోవాహు నీతో నడిచాడు దేవ
రక్షణనే ఓడలో రక్షింప బడెను      ||నడవా||

అబ్రాహాము నీతో నడిచాడు దేవ
విశ్వాసపు యాత్రలో సాగాడు నీతో      ||నడవా||

నా జీవితమంతా నీతో నడవాలని
నా చేయి పట్టుకొని నడిపించు ప్రభువా      ||నడవా||

English Lyrics

Audio

ఎండిన ఎడారి బ్రతుకులో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఎండిన ఎడారి బ్రతుకులో
నిండైన ఆశ నీవేగా
యేసు.. నిండైన ఆశ నీవేగా
తడబడెడు నా పాదములకు
తోడు నీవే గదా
యేసు.. తోడు నీవే సదా       ||ఎండిన||

ఎండమావులు చూచి నేను
అలసి వేసారితి (2)
జీవ జలముల ఊట నీవై
సేద దీర్చితివి
నా బలము నీవైతివే
యేసు.. బలము నీవైతివే

నిత్య మహిమకు నిలయుడా నీ
దివ్య కాంతిలోన (2)
నీదు ఆత్మతో నన్ను నింపి
ఫలింప జేసితివే
నా సారధి నీవైతివే
యేసు.. సారధి నీవైతివే

అంధకార లోయలెన్నో
ఎదురు నిలచినను (2)
గాయపడిన నీ హస్తమే నన్ను
గమ్యము చేర్చును
నా శరణు నీవే గదా
యేసు.. శరణు నీవే గదా       ||ఎండిన||

English Lyrics

Audio

నాకున్న చిన్ని ఆశ

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


చిట్టి పొట్టి పాపను నేను
చిన్నారి పాపను నేను (2)

యేసయ్యా నిన్ను చూడాలని
నాకున్న చిన్ని ఆశ
యేసయ్యా నిన్ను చేరాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీ సన్నిధిలోనే ఉండాలని
నాకున్న చిన్ని ఆశ
నీ సన్నిధిలో పాట పాడాలని
నాకున్న చిన్ని ఆశ         ||చిట్టి||

నీకై నేను జీవించాలని
నాకున్న చిన్ని ఆశ
నిన్నే నేను సేవించాలని
నాకున్న చిన్ని ఆశ      ||చిట్టి||

English Lyrics

Audio

Chords

నిను పాడాలని

పాట రచయిత: నరేంద్ర భాస్కర్
Lyricist: Narendra Bhaskar

Telugu Lyrics

నిను పాడాలని కీర్తించాలని
ఆశ.. యేసు నా ఆశ
ఆశ.. యేసు నా ఆశ (2)
ఆరాధింతును ఆనందింతును (2)
నీలో.. యేసు నీలో (2)      ||నిను||

నిరాశపడిన వేళలో
నా ఆశ నీవైతివే
నా ఆశ నీవైతివే (2)
నా సంతోషమా నా ఆనందమా (2)
నా ఆధారమా నీవే (2)      ||నిను||

నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే
నను చేసినది నీవే
నను చేసినది నీవే (2)
స్తుతియింతును ఘనపరతును (2)
నా దైవం నీవే అని (2)      ||నిను||

English Lyrics

Audio

నీవు లేక క్షణమైనా

పాట రచయిత: రవిందర్ వొట్టెపు
Lyricist: Ravinder Vottepu

Telugu Lyrics


నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా (2)
నా ఆశ నీవే కదా
ఓ.. నా అండ నీవే కదా (2)
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా (2)

నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే
నీ ఋణము తీర్చేదెలా
నిను తృప్తి పరచేదెలా (2)
నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా (2)
విలువైనదేది నీకన్నా          ||యేసయ్యా||

నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే
నిను పోలి జీవించగా
నీ ఆత్మ నాకివ్వుమా (2)
నా జీవితము నీకై – నా జన్మ తరియింప (2)
పరిశుద్ధాత్మను ప్రోక్షించు          ||యేసయ్యా||

English Lyrics

Audio

HOME