శక్తి చేత కాదనెను

పాట రచయిత: ఇంజ దాస్ అబ్రహాం
Lyricist: Inja Das Abraham

Telugu Lyrics


శక్తి చేత కాదనెను
బలముతోనిది కాదనెను (2)
నా ఆత్మ ద్వారా దీని చేతునని
యెహోవ సెలవిచ్చెను (2)      ||శక్తి||

ఓ గొప్ప పర్వతమా
జెరుబ్బాబెలు నడ్డగింపను (2)
ఎంత మాత్రపు దానవు నీవనెను
చదును భూమిగా మారెదవు (2)      ||శక్తి||

ఓ ఇశ్రాయేలు విను
నీ భాగ్యమెంత గొప్పది (2)
యెహొవా రక్షించిన నిన్ను
బోలిన వారెవరు (2)      ||శక్తి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆనంద తైలాభిషేకము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా
పరిశుద్ధాత్ముడా – నా ప్రేమ పూర్ణుడా

ఎండిన ఎముకలు జీవింప జేయుము
ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2)          ||ఆనంద||

అరణ్య భూమిని ఫలియింప జేయుము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)          ||ఆనంద||

యవ్వనులకు నీ దర్శన మిమ్ము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)          ||ఆనంద||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఆత్మ వర్షము మాపై

పాట రచయిత: పాల్ ఇమ్మానుయేల్
Lyricist: Paul Emmanuel

Telugu Lyrics

ఆత్మ వర్షము మాపై కురిపించుము
కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2)
నీ ఆత్మతో సంధించుము
అభిషేకంతో నింపుము
నీ అగ్నిలో మండించుము
వరాలతో నింపుము (2)       ||ఆత్మ||

యెషయా పెదవులు కాల్చితివి
సేవకు నీవు పిలచితివి (4)
సౌలును పౌలుగా మార్చితివి
ఆత్మ నేత్రములు తెరచితివి (2)
మమునూ వెలిగించుము
మా పెదవులు కాల్చుము (2)       ||ఆత్మ||

పాత్మజు దీవిలో పరవశుడై
శక్తిని చూచెను యోహాను (2)
షడ్రకు మేషకు అబేద్నగో
ధైర్యముతో నిను సేవించిరి (2)
మామునూ రగిలించుము
మాకు దర్శనమిమ్ము (2)       ||ఆత్మ||

English Lyrics

Audio

నా కృప నీకు చాలని

పాట రచయిత: కే సాల్మన్ రాజు
Lyricist: K Solmon Raju

Telugu Lyrics


నా కృప నీకు చాలని
నా దయ నీపై ఉన్నదని
నా అరచేత నిన్ను భద్రపరచుకున్నానని
నా ఆత్మ శక్తితో నింపి నడుపుచున్నానని
నాతో మాట్లాడిన మహోన్నతుడా
నన్నాదరించిన నజరేయ (2)       ||నా కృప||

నేను నీకు తోడైయున్నానని
పొంగే జలములు నిన్నేమి చేయలేవని (2)
నీ అరికాలు మోపు చోటు అలలన్ని అణిగిపోవును (2)
పొంగి పొర్లే దీవెనలను నీయందు ఉంచానని (2)      ||నాతో||

పరిశుద్ధాత్మను నాయందు ఉంచానని
ఆత్మ శక్తితో నన్ను వాడుచున్నాని (2)
నీ వాక్కు శక్తిని నా నోట ఉంచానని (2)
జనుల కాపరిగా నన్ను ఎన్నుకున్నానని (2)      ||నాతో||

English Lyrics

Audio

ఆత్మ విషయమై

పాట రచయిత: పి విజయ్ కుమార్
Lyricist: P Vijay Kumar

Telugu Lyrics

ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది (2)

దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు (2)
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2)     ||ఆత్మ||

నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు (2)
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు (2)     ||ఆత్మ||

హృదయ శుద్ధి గలవారు ధన్యులు
వారు దేవుని చూచెదరు (2)
సమాధాన పరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు (2)     ||ఆత్మ||

English Lyrics

Audio

మన్నేగదయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మన్నేగదయ్యా మన్నేగదయ్యా (2)
మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప
మహిలోనిదంతా మన్నేగదయ్యా (2)        ||మన్నేగదయ్యా||

మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా
మించిన బంగారము మించిన నీ దేహము (2)
ఉంచుము ఎన్నాళ్ళకుండునో
మరణించగానే మన్నేగదయ్యా (2)        ||మన్నేగదయ్యా||

ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా
నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా (2)
మెల్లని పుష్పంబు పోలినా
పుష్పంబుతోనే ఊడిపడినది (2)        ||మన్నేగదయ్యా||

మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము
ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము (2)
కుక్క శవంతో సమమేగా
నిక్కముగనదియు మన్నేగదయ్యా (2)        ||మన్నేగదయ్యా||

మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల
మరణమును జయించుచున్న కాలమింత మన్నిల (2)
మరణ విజయుడేసు క్రీస్తుడే
మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును (2)        ||మన్నేగదయ్యా||

English Lyrics

Audio

యెహోవా మా కాపరి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా మా కాపరి
యేసయ్య మా ఊపిరి
మాకు లేనిది లేదు లేమి కలుగదు (2)         ||యెహోవా||

వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
మా ప్రాణములు సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను         ||యెహోవా||

కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడకలో ఊపిరి పోసెను (2)
మా తోడు నీడై నిలిచి నడచెను
శత్రు పీఠమున విందు చేసెను         ||యెహోవా||

పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను
నిరతము మేము కీర్తింతుము         ||యెహోవా||

English Lyrics

Audio

 

 

 

కృపామయుడా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

కృపామయుడా – నీలోనా (2)
నివసింప జేసినందున
ఇదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందునా
ఇదిగో నా స్తుతుల సింహాసనం
కృపామయుడా…

ఏ అపాయము నా గుడారము
సమీపించనీయక (2)
నా మార్గములన్నిటిలో
నీవే ఆశ్రయమైనందున (2)         ||కృపామయుడా||

చీకటి నుండి వెలుగులోనికి
నన్ను పిలచిన తేజోమయా (2)
రాజవంశములో
యాజకత్వము చేసెదను (2)       ||కృపామయుడా||

నీలో నిలిచి ఆత్మ ఫలము
ఫలియించుట కొరకు (2)
నా పైన నిండుగా
ఆత్మ వర్షము కుమ్మరించు (2)      ||కృపామయుడా||

ఏ యోగ్యత లేని నాకు
జీవ కిరీటమిచ్చుటకు (2)
నీ కృప నను వీడక
శాశ్వత కృపగా మారెను (2)      ||కృపామయుడా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ప్రార్థన శక్తి నాకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా
నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2)
యేసయ్యా కావాలయ్యా
నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి
నేను ప్రార్థింపగ దయచేయుమా (2)
ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా (2)
నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||

సింహాల గుహలోని దానియేలు శక్తి
ఈ లోకంలో నాకు కావలయ్యా (2)
నీతో నడిచే వరమీయుమా (2)
నీ సిలువను మోసే కృపనీయుమా (2)       || ప్రార్థన ||

పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి
నే పాడు చోటెల్ల దిగిరా దేవా (2)
చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె (2)
ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

ఆత్మ దీపమును

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఆత్మ దీపమును (2)
వెలిగించు యేసు ప్రభు (2)       ||ఆత్మ||

వసియించుము నా హృదయమునందు (2)
వసియించు నా నయనములందు (2)
అన్నియు నిర్వహించుచున్నావు (2)
నన్ను నిర్వహించుము ప్రభువా (2)       ||ఆత్మ||

కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2)
కష్టములంతరింప జేసి (2)
కల్వరి సిలువలో కార్చిన రక్త (2)
కాలువ యందు కడుగుము నన్ను (2)       ||ఆత్మ||

English Lyrics

Audio

HOME