అద్వితీయ సత్య దేవుడు

పాట రచయిత: విద్యార్థి గీతావళి
Lyricist: Vidyaarthi Geethaavali

Telugu Lyrics

అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు (2)           ||అద్వితీయ||

పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం (2)
హల్లెలూయా హల్లెలూయ (2)           ||అద్వితీయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అద్వితీయ సత్య దేవా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా
వందనం వందనం వందనం

అద్వితీయ సత్య దేవా వందనం – వందనం
పరమ తండ్రి పావనుండా వందనం – వందనం
దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం
పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం (2)
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

వ్యోమ సింహాసనుండ వందనం – వందనం
ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం (2)
ఆద్యంత రహిత నీకే వందనం – వందనం
అక్షయ కరుణీక్షుండా వందనం – వందనం (2)           ||హల్లెలూయా||

ప్రాణదాత యేసునాథా వందనం – వందనం
ముక్తిదాత జీవదాతా వందనం – వందనం (2)
సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనం
ముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం (2)           ||హల్లెలూయా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

అల్ఫా ఒమేగయైన

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

అల్ఫా ఒమేగయైన – మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా – నిరంతరం స్తోత్రార్హుడా (2)
రాత్రిలో కాంతి కిరణమా – పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా (2)       ||అల్ఫా||

కనికర పూర్ణుడా – నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను (2)
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే (2)       ||అల్ఫా||

తేజోమయుడా – నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను (2)
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే (2)       ||అల్ఫా||

నిజస్నేహితుడా – నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే (2)       ||అల్ఫా||

English Lyrics

Audio

నూతన సంవత్సరం

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


నూతన సంవత్సరం దయచేసిన దేవా
నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2)
ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు (2)
అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2)         ||నూతన ||

పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు
శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు
చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా
ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా
నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని
నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని          ||నూతన||

కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా
కష్టాలతో నేను సతమతమౌతుండగా
నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా
ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి
నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని
నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని          ||నూతన||

English Lyrics

Audio

HOME