యేసు కోసమే జీవిద్దాం

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం
యేసుని పోలి నడిచే సాక్షులం
యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం
లోకములో యేసుని ప్రతినిధులం
శోధనలెదురైనా అవరోధములెన్నున్నా
విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా        ||యేసు కోసమే||

నిందారహితులుగా జీవించుట మన పిలుపు
నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము
లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
ప్రేమయు సహనము యేసుని హృదయము
కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము       ||యేసు కోసమే||

యేసు స్వభామును ధరించిన వారలము
మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
రాజులు జనములు యేసుని చూచెదరు
విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు       ||యేసు కోసమే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పదే పాడనా

పాట రచయిత: జాషువా షేక్
Lyricist: Joshua Shaik

Telugu Lyrics

పదే పాడనా నిన్నే కోరనా – ఇదే రీతిగా నిన్నే చేరనా (2)
నీ వాక్యమే నాకుండగా – నా తోడుగా నీవుండగా
ఇదే బాటలో నే సాగనా – ఇదే రీతిగా నా యేసయ్య         ||పదే పాడనా||

ప్రేమను పంచే నీ గుణం – జీవము నింపే సాంత్వనం
మెదిలెను నాలో నీ స్వరం – చూపెను నాకు ఆశ్రయం
నీవే నాకు ప్రభాతము – నాలో పొంగే ప్రవాహము
నీవే నాకు అంబరం – నాలో నిండే సంబరం
నాలోన మిగిలే నీ ఋణం – నీతోటి సాగే ప్రయాణం        ||పదే పాడనా||

మహిమకు నీవే రూపము – మధురము నీదు నామము
ఇదిగో నాదు జీవితం – ఇలలో నీకే అంకితం
నీవే నాకు సహాయము – నిన్న నేడు నిరంతరం
నీవే నాకు ఆశయం – నాలో నీకే ఆలయం
ధరలోన లేరు నీ సమం – నీ ప్రేమధారే నా వరం          ||పదే పాడనా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నలుగకుండ గోధుమలు

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics


నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా
కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2)
ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా
ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2)       ||నలుగకుండ||

పగలని బండనుండి జలములు హోరులు
విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా (2)
పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా (2)
విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా (2)       ||నలుగకుండ||

రక్తము చిందకుండ పాపములు పోవునా
కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా (2)
అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా (2)
ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా
బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా         ||నలుగకుండ||

English Lyrics

Audio

HOME