ఇంటి మీద నున్న

పాట రచయిత: బొనిగల బాబు రావు
Lyricist: Bonigala Babu Rao

Telugu Lyrics

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను (2)
నా యేసయ్యా నా బలమా (2)
నా దీన ప్రార్థన ఆలకించుమా          ||ఇంటి మీద||

వెతకాని బాణమును చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2)
నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2)
ఆలకించుమా ఆదరించుమా (2)        ||ఇంటి మీద||

తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – (2)
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)
ఆలకించుమా ఆదరించుమా (2)        ||ఇంటి మీద||

English Lyrics

Audio

నాకు జీవమై ఉన్న

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics


నాకు జీవమై ఉన్న నా జీవమా
నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా
నాకు బలమై ఉన్న నా బలమా
నాకు సర్వమై ఉన్న నా సర్వమా
నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా
నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు          ||నాకు జీవమై||

పూజ్యుడవు… ఉన్నత దేవుడవు
యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు (2)
నా ఆరాధన నా ఆలాపన
నా స్తుతి కీర్తన నీవే
నా ఆలోచన నా ఆకర్షణ
నా స్తోత్రార్పణ నీకే           ||నాకు జీవమై||

నాయకుడా… నా మంచి స్నేహితుడా
రక్షకుడా… నా ప్రాణ నాథుడా (2)
నా ఆనందము నా ఆలంబన
నా అతిశయము నీవే
నా ఆదరణ నా ఆశ్రయము
నా పోషకుడవు నీవే          ||నాకు జీవమై||

English Lyrics

Audio

యెహోవా నా బలమా

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthva Keerthanalu

Telugu Lyrics


యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం (2)                  ||యెహోవా||

నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ (2)
వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)
విడువక నను ఎడబాయని దేవా (2)         ||యెహోవా||

మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)
ఆదరెను ధరణి భయకంపముచే (2)         ||యెహోవా||

నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును (2)
జలరాసులనుండి బలమైన చేతితో (2)
వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2)     ||యెహోవా||

పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను (2)
తన నోటనుండి వచ్చిన అగ్ని (2)
దహించివేసెను వైరులనెల్లన్ (2)             ||యెహోవా||

మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును (2)
ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2)
అపజయమిచ్చును అపవాదికిని (2)       ||యెహోవా||

దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును (2)
గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)
సర్వమునెరిగిన సర్వాధికారి (2)             ||యెహోవా||

నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)
రక్షణ కేడెము నాకందించి (2)
అక్షయముగ తన పక్షము జేర్చిన (2)     ||యెహోవా||

యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)
అన్యజనులలో ధన్యత చూపుచు (2)
హల్లెలూయ స్తుతిగానము చేసెద (2)       ||యెహోవా||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME