సుదూరము ఈ పయనము

పాట రచయిత: జోయెల్ కొడాలి
Lyricist: Joel Kodali

Telugu Lyrics


సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము       ||సుదూరము||

అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం       ||సుదూరము||

హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును       ||సుదూరము||

నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ       ||సుదూరము||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నిను స్తుతియించే కారణం

పాట రచయిత: షాలేం ఇశ్రాయేల్ అరసవెల్లి
Lyricist: Shalem Ishrayel Arasavelli

Telugu Lyrics

నిను స్తుతియించే కారణం
ఏమని చెప్పాలి ప్రభువా (2)
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా భాగ్యము
ప్రతి క్షణము ప్రతి దినము
స్తుతియించుటే నా జీవము      ||నిను||

ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము
అగాధ జలములలోన నీకు స్తోత్రము (2)
పరమందు నీకు స్తోత్రం
ధరయందు నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

చీకటి లోయలలోన నీకు స్తోత్రము
మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము (2)
గృహమందు నీకు స్తోత్రం
గుడిలోన నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము
ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము (2)
శ్రమలైనా నీకు స్తోత్రం
కరువైనా నీకు స్తోత్రం (2)
ప్రతి చోట నీకు స్తోత్రం
ప్రతి నోట నీకు స్తోత్రం (2)    ||నిను||

English Lyrics

Audio

దేవా నీ సాక్షిగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా నీ సాక్షిగా నేనుండుట
ఈ మంటికి భాగ్యము (2)
జాలిగా మనుజాళికై
కలువరిలోని ఆ యాగము
చాటెద ప్రతి స్థలమందు
నా తుది శ్వాస ఆగే వరకు      ||దేవా||

నాలాంటి నర మాత్రుని చేరుట
నీ వంటి పరిశుద్ధునికేలనో (2)
ఏ మేధావికి విధితమే కాదిది
కేవలం నీ కృపే దీనికాధారము
ఈ సంకల్పమే నా సౌభాగ్యమే
నా బ్రతుకంత కొనియాడుట      ||దేవా||

నా ఊహకందని మేలుతో
నా గుండె నిండింది ప్రేమతో (2)
నా కన్నీటిని మార్చి పన్నీరుగా
నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
ఈ శుభవార్తను చాటు సందేశము
నేను ఎలుగెత్తి ప్రకటించెద      ||దేవా||

English Lyrics

Audio

బ్రతికియున్నానంటే నీ కృప

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసయ్యా నా యేసయ్యా…
యేసయ్యా నా యేసయ్యా…
బ్రతికియున్నానంటే నీ కృప
జీవిస్తున్నానంటే నీ కృప (2)
ఏ యోగ్యత నాలో లేదు – ఎంత భాగ్యము నిచ్చావు
పరిశుద్ధత నాలో లేదు – నీ ప్రేమను చూపావు (2)
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా (2)

నా జీవిత నావా సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరి కొట్టగా
కదలలేక నా కథ ముగించబోగా
నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు (2)
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా
నీ పాదాల చెంతనే వాలిపోయేదా (2)         ||యేసయ్యా||

నా జీవితమంతా ప్రయాసలు పడగా
శోధనల సంద్రములో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా
ఆప్యాయత చూపి ఆదరించినావు (2)
నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది
నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా (2)        ||బ్రతికి||

English Lyrics

Audio

ఆశ తీర నా యేసు స్వామిని

పాట రచయిత: ఎన్ జె సైమన్
Lyricist: N J Symon

Telugu Lyrics

ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆత్మతో సత్యముతో స్తుతించెదను
ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము     ||ఆశ||

దుప్పి నీటికై ఆశపడునట్లుగా
దేవుని కొరకై ఆశ పడుచున్నాను
దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2)
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను          ||ఎంత||

లోక ఆశలు లయమైపోవును
లోకులెవ్వరు కాపాడలేరు
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం (2)
లోబడు వారిని పారమున చేర్చును         ||ఎంత||

English Lyrics

Audio

HOME