యెహోవా దయాళుడు (ఆయనకే కృతజ్ఞత)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు
నన్ను నడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

కష్టములలో నుండి
ఆపదలలో నుండి
నన్ను విడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యెహోవా దయాళుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా దయాళుడు సర్వ శక్తిమంతుడు
ఆయన కృప నిత్యముండును (2)
ఆయనే బలవంతుడు – ఆయనే యుద్ధ వీరుడు (2)
యెహోవా నాకు తోడుండగా – నాకు భయమే లేనే లేదు
యెహోవా నాకు తోడుండగా – నాకు దిగులే లేనే లేదు
జై జై యేసు రాజా – జయ యేసు రాజా (4)         ||యెహోవా||

సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే
మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే (2)        ||యెహోవా నాకు||

దావీదు వంశమును ఇల చిగురింప చేసిన వారాయనే
విలువైన రక్షణలో నను కడ వరకు నడిపించు వారాయనే (2)         ||యెహోవా నాకు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు రక్తమే జయం

Telugu Lyrics


యేసు రక్తమే జయం… యేసు రక్తమే జయం
యేసు నామం ఉన్నత నామం (2)

పేరు పెట్టి పిలచినవాడు – విడువడు ఎన్నడు
ఆశ తీర్చు దేవుడు – ఆదరించును (2)
ఆశలన్ని అడి ఆశలుగా
మార్చునంత విపరీతముగా
చేయునదే నీ పాపము (2)

యెహోవా దయాళుడు… యెహోవా దయాళుడు
ఆయన కృప నిత్యముండును (2)

ఎవరు ఉన్నా లేకపోయినా – యేసు ఉంటే చాలు
లోకమంత విడనాడినా – నిన్ను విడువడు (2)
శ్రమయు బాధ హింస అయిననూ
కరువు వస్త్ర హీనతైననూ
ఖడ్గ మరణమెదురే అయిననూ (2)

యేసు పునరుత్థానుడు… యేసు పునరుత్థానుడు
మరణపు బలము ఓడిపోయెను (2)

English Lyrics

Audio

 

 

HOME