సర్వ శరీరుల దేవుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా (2)
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే

లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా (2)       ||సర్వ శరీరుల||

ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా         ||లేనే లేదయ్యా||

అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా         ||లేనే లేదయ్యా||

మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు
భీకరుండా నీకే స్తోత్రము
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా         ||లేనే లేదయ్యా||

గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
విజయశీలుడా స్తోత్రము
సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
యూదా సింహమా స్తోత్రము
బోయజుతో రూతును విమోచించినావు
సమూయేలును మందసం నుండి పిలిచినావు
పరిశుద్ధుడా – విమోచకుడా
ఎబినేజరు స్తోత్రము         ||లేనే లేదయ్యా||

దావీదు నా హృదయానుసారుడంటివే
రాజాధి రాజా స్తోత్రము
సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
అనంత జ్ఞాని స్తోత్రము
ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
ఆత్మ రూపుడా – రోషవంతుడా
జీవము గల దేవుడా         ||లేనే లేదయ్యా||

నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
యెరూషలేము దేవా స్తోత్రము
జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
మందసపు దేవా స్తోత్రము
ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
దానియేలును సింహాల నుండి బ్రోచినావు
షద్రక్ మేషాకూ- అబేద్నెగోల దేవుడా
నిత్య రాజ్య స్థాపకుడా         ||లేనే లేదయ్యా||

యెహోషాపాతుకై పోరు సలిపినావు
యుద్ధ శూరుడా స్తోత్రము
యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
యజమానుడా స్తోత్రము
హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
యెషయాకు దర్శనమును చూపినావు
మహిమ రూపుడా – నిత్య జీవుడా
సింహాసనాసీనుడా         ||లేనే లేదయ్యా||

యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
నమ్మదగిన దేవా స్తోత్రము
యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
దీర్ఘశాంతుడా స్తోత్రము
యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు
యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
ప్రవక్తలందరికి దేవుడా         ||లేనే లేదయ్యా||

కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
యేసు దేవా నీకే స్తోత్రము
తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
దేవ తనయుడా స్తోత్రము
రక్తధారతో మా పాపమంతా కడిగినావు
మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
పునరుత్థానుడా – అభిషిక్తుడా
పాపుల రక్షకుడా         ||లేనే లేదయ్యా||

పేతురును బండలా స్థిరము చేసినావుగా
పరిశుద్ధాత్ముడా స్తోత్రము
సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
ఆశ్చర్యకరుడా స్తోత్రము
యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
రానున్న మా దేవుడా         ||లేనే లేదయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నీ కృప లేనిచో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)

నీ కృప లేనిచో ఒక క్షణమైననూ
నే నిలువజాలనో ప్రభు (2)
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా (2)        ||నీ కృప||

ఈ ఊపిరి నీదేనయ్యా
నీవిచ్చిన దానం నాకై
నా ఆశ నీవేనయ్యా
నా జీవితమంతా నీకై (2)
నిను నే మరతునా మరువనో ప్రభు
నిను నే విడతునా విడువనో ప్రభు (2)        ||నీ కృప||

నా ఐశ్వర్యమంతా నీవే
ఉంచినావు నీ దయ నాపై
నీ దయ లేనిచో నాపై
ఉందునా ఈ క్షణమునకై (2)
కాచి ఉంచినావయ్యా – ఇంత వరకును
నను వీడిపోదయ్యా – నాకున్న నీ కృప (2)        ||నీ కృప||

English Lyrics

Audio

నమ్మదగిన దేవుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నమ్మదగిన దేవుడా
నెమ్మదినిచ్చే యేసయ్యా (4)
నీవుంటే చాలయ్యా వేరేది వద్దయ్యా (2)
నీ తోడుంటే చాలయ్యా
భయమే నాకు లేదయ్యా (2)      ||నీ తోడుంటే||

శ్రమ అయినా బాధ అయినా
కరువైనా ఖడ్గమైనా (2)      ||నీ తోడుంటే||

కష్టమైనా కన్నీరైనా
కలతలైనా కలవరమైనా (2)      ||నీ తోడుంటే||

సాగరాలే ఎదురు నిలిచినా
శత్రువులంతా నన్ను తరిమినా (2)      ||నీ తోడుంటే||

భరువైనా భారమైనా
బాధ అయినా వేదనైనా (2)      ||నీ తోడుంటే||

ఎవరున్నా లేకున్నా
కలిమి అయినా లేమి అయినా (2)      ||నీ తోడుంటే||

English Lyrics

Audio

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త

పాట రచయిత: డేనియల్ కళ్యాణపు
Lyricist: Daniel Kalyanapu

Telugu Lyrics

ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త
బలవంతుడైన దేవుడా
నిత్యుడగు తండ్రి – సమాధాన అధిపతి
మనకై జన్మించెను (2)
వి విష్ యు హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
హోసన్నా హల్లలూయా
క్రిస్మస్ బాలునికే (2)     ||ఆశ్చర్యకరుడా||

ఏంజెల్స్ వి హావ్ హర్డ్ ఆన్ హై
స్వీట్లీ సింగింగ్ ఓవర్ ద ప్లేయిన్స్
అండ్ ద మౌంటైన్స్ ఇన్ రిప్లై
ఏకోయింగ్ థేయిర్ జాయ్యస్ స్ట్రయిన్స్

ధరపై ఎన్నో – ఆశ్చర్యకార్యములు చేయుటకు
దరిద్రుల దరి చేరి – ధనవంతులుగా చేయుటకు (2)
దొంగలను మార్చి దయచూపినావు (2)
ధవళ వస్త్రములు ధరింప చేసి
ధన్యుని చేసావు         ||వి విష్||

నిత్యుడగు తండ్రిగా – నిరీక్షణను ఇచ్చుటకు
నీతి న్యాయములు నేర్పి – నన్ను నీవు నడిపించుటకు (2)
నీ నిత్య మార్గములో శాంతినిచ్చ్చావు (2)
నీతో నిరతం జీవించుటకు
నిత్య జీవమియ్య అరుదెంచినావు         ||వి విష్||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇమ్మానుయేలు దేవుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా (2)
ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా (4)
మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా (2)
లాలి లాలి లాలమ్మ లాలి (2)

మా పాపము బాపి పరమును మము చేర్చగ
దివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా (2)      ||ఇస్సాకు||

అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగ
ప్రేమ రూపివై వెలసిన బాల యేసువా (2)      ||ఇస్సాకు||

English Lyrics

Audio

కలనైనా ఇలనైనా

పాట రచయిత: రవిందర్ వొట్టెపు
Lyricist: Ravinder Vottepu

Telugu Lyrics


కలనైనా ఇలనైనా నన్ను ఏనాడైనా
విడువని దేవుడా నా యేసయ్యా
శ్రమయైనా బాధైనా ఏ కన్నీరైనా
ఓదార్చే దేవుడా యేసయ్యా
ప్రేమించే వారే లేకున్నా
నన్ను కరుణించే వారే లేకున్నా
ఆదరించే యేసు నన్ను
తల్లి కన్న మిన్నయై       ||కలనైనా||

జిగటగల ఊబిలో నుండి లేవనెత్తినావు
లోకమంత నను విడచినను విడువనన్న యేసయ్యా
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2)         ||కలనైనా||

పరిశుద్ధాత్మతో నను నింపి శుద్ధిపరచువాడవు
లేమి లేక నా హృదయమును తృప్తిపరచువాడవు
నీకేమి చెల్లింతు యేసయ్యా
నిన్నెలా వర్ణింతు (2)         ||కలనైనా||

English Lyrics

Audio

స్తుతులపై ఆసీనుడా

పాట రచయిత: బన్నీ సుదర్శన్
Lyricist: Bunny Sudarshan

Telugu Lyrics

స్తుతులపై ఆసీనుడా
అత్యున్నత నా దేవుడా (2)
నీ ప్రేమలో నీ ప్రేమలో
నను నేను మరిచాను నీ ప్రేమలో
నీ నీడలో నీ జాడలో
మైమరచిపోయాను నేను ||స్తుతులపై||

నీవు చేసిన ఆశ్చర్య కార్యాలకు బదులు
నీవు పొందిన గాయాలకు బదులు (2)
బంగారం వజ్రాలు – మకుటాలు కిరీటాలు
వెండినడుగలేదు నీవు
విరిగి నలిగి – కరిగి వెలిగే
హృదయాన్నే కోరావు నీవు (2)
ఓ మాట సెలవియ్యి దేవా
నీ పాద ధూళిని కానా ప్రభువా
నీ పాదం స్పర్శించగానే
నా సంతోషానికి హద్దుండునా ||స్తుతులపై||

నీవు లేచిన పునరుథ్తానా దినము మొదలు
మా బ్రతుకులో విజయము మొదలు (2)
మరణం అనేటి ముల్లును విరచి
తిరిగి లేచావు నీవు
చీకటి నిండిన మాదు బ్రతుకులో
వెలుగులు నింపావు నీవు (2)
నీకోసం ఏదైనా దేవా
నే వెచ్చింప సంసిద్ధమయ్యా
ఆఖరికి నా ప్రాణమైనా
చిందులు వేస్తూ అర్పిస్తా ||స్తుతులపై||

English Lyrics

Audio

స్తోత్రము స్తుతి చెల్లింతుము

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

స్తోత్రము స్తుతి చెల్లింతుము నీకే సత్య దేవుడా
యుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా (2)
నీవే మార్గం నీవే జీవం
నీవే సత్యం నీవే సర్వం (2)           ||స్తోత్రము||

మరణమైననూ ఎర్ర సంద్రమైననూ
నీ తోడు నాకుండ భయము లేదుగా
శత్రు సైన్యమే నా ఎదుట నిలచినా
బలమైన కోట నీవేగా (2)
నా దుర్గమా నా శైలమా
నా అతిశయమా ఆనందమా (2)       ||నీవే||

హింసలైననూ పలు నిందలైననూ
నీ చల్లని రెక్కలే నాకాశ్రయం
చీకటైననూ అగాధమైననూ
నీ క్షమా కిరణమే వెలుగు మార్గము (2)
నీతి సూర్యుడా నా పోషకుడా
నా వైద్యుడా మంచి కాపరి (2)       ||నీవే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME