సాటి ఎవ్వరూ

పాట రచయిత: జోయెల్ ఎన్ బాబ్
Lyricist: Joel N Bob

Telugu Lyrics


సాటి ఎవ్వరూ లేరు ఇలలో
సమానులెవ్వరూ ఇహ పరములో (2)
యోగ్యత లేని నాపై దేవా
మితిలేని కృప చూపి
నిరాశే మిగిలిన ఈ జీవితంలో
నిరీక్షణనిచ్చావు        ||సాటి ఎవ్వరూ||

దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (4)

పాప బానిస బ్రతుకు
ఆకర్షణ నిండిన లోకం
సర్వమనే భ్రమలోనే బ్రతికానే
నీ వాక్యముతో సంధించి
నా ఆత్మ నేత్రములు తెరచి
ప్రేమతో నన్నాకర్షించావే (2)

దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (2)

మలినమైన మనసు
గమ్యంలేని పయనం
హృదయమే చీకటిమయమయ్యిందే
నీ రక్తముతో నను కడిగి
నాకు విడుదలను దయచేసి
వెలుగుతో నాకు మార్గం చూపావే (2)

దేవా నా కరములనెత్తి
దేవా నిన్నే కీర్తించి
దేవా నిన్నారాధింతును (2)        ||సాటి ఎవ్వరూ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు వంటి సుందరుడు

పాట రచయిత: ఎం ఎస్ శాంతవర్ధన్
Lyricist: M S Shanthavardhan

Telugu Lyrics


యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భువిలో
ఎన్నడు నే చూడలేదు ఇక చూడబోనుగా
పరిపూర్ణ సుందరుడు భువిలోన జీవితమునకు
నీవే చాలు వేరేవ్వరు నాదు ప్రియ యేసయ్య
మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను
పాడు మట్టికోసం మాణిక్యమును విడిచిపెట్టెను

పరిపూర్ణ సుందరుడు రక్షించుకొంటివి నన్ను
సంపూర్ణముగా నన్ను నీకు అర్పించెదను     ||యేసు||

యెరుషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి
నీపై నున్న ప్రేమను తొలగించబూనిరి         ||యేసు||

దినదినం నీపై నాప్రేమ పొంగుచున్నది
యేసయ్యా వేగమే వచ్చి నన్ను చేరుము       ||యేసు||

English Lyrics

Audio

ప్రేమ యేసుని ప్రేమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది
నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది

ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ             ||ప్రేమ||

తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును                        ||ఎన్నడెన్నడు||

భార్యా భర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును   ||ఎన్నడెన్నడు||

బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును        ||ఎన్నడెన్నడు||

ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును        ||ఎన్నడెన్నడు||

English Lyrics

Audio

HOME