యేసు మంచి దేవుడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు మంచి దేవుడు – ప్రేమగల దేవుడు
యేసు గొప్ప దేవుడు – పరలోకమిచ్చు నాథుడు (2)
ఎంత పాపినైననూ చెంత జేర్చుకోనును
చింతలన్ని బాపి శాంతినిచ్చును (2)       ||యేసు మంచి||

శాశ్వతమైన ప్రేమతో
నిన్ను నన్ను ప్రేమించాడు (2)
సిలువలో ప్రాణమును బలిగా ఇచ్చాడు
తన రక్తముతో నిన్ను నన్ను కొన్నాడు (2)       ||యేసు మంచి||

శాంతి సమాధానం మనకిచ్చాడు
సమతా మమత నేర్పించాడు (2)
మార్గము సత్యము జీవమైనాడు
మానవాళికే ప్రాణమైనాడు (2)       ||యేసు మంచి||

English Lyrics

Audio

 

 

దేవా నీ గొప్పకార్యములన్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం
నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం
హల్లెలూయా నా యేసురాజ
హల్లెలూయా నా ప్రాణనాథ (2)
స్తుతులు మహిమ ఘనత నీకే (2)      ||దేవా నీ||

శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
పరమును వీడి భువికరుదెంచి
కలువరి సిలువలో రక్తము కార్చి
నీదు కృపతో నను రక్షించిన
నీ దివ్య ప్రేమను అత్యధికముగా
స్మరింతున్ జీవిత కాలమంతా          ||దేవా నీ||

నీ కంటిపాపగా నన్ను కాచి
నీ చేతి నీడలో నన్ను దాచి
నీ అరచేతిలో నను చెక్కుకొని
నీదు సొత్తుగా నను చేసుకొని
అక్షయమైన నీ మధుర ప్రేమను
దీక్షతో ఇలలో చాటెదను                 ||దేవా నీ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME