పరిశుద్ధుడవై

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు
బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2)
దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్యా
స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడవై||

నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి (2)
శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి         ||ఆరాధన||

నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి (2)
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి         ||ఆరాధన||

ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు
నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి (2)
మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము
నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు         ||ఆరాధన||

English Lyrics

Audio

నా గీతారాధనలో

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – (2)        ||నా గీతా||

నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే (2)
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే (2)        ||నా గీతా||

చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2)        ||నా గీతా||

ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2)        ||నా గీతా||

English Lyrics

Audio

ఘనమైన నా యేసయ్యా

పాట రచయిత: Matthews
Lyricist: మాథ్యూస్

Telugu Lyrics


ఘనమైన నా యేసయ్యా
బహు ఆశ్చర్యములు నీ ఘన కార్యములు (2)
(నా) శిరము వంచి స్తుతియింతును
నీ – కృపా సత్యములను ప్రకటింతును (2)       ||ఘనమైన||

నీ చేతి పనులే కనిపించే నీ సృష్టి సౌందర్యము
నీ – ఉన్నతమైన ఉద్దేశమే మంటి నుండి నరుని నిర్మాణము (2)
ఒకని నుండి ప్రతి వంశమును సృష్టించినావయ్యా (2)
తరతరములుగా మనుష్యులను పోషించుచున్నావయ్యా (2)
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||

మహోన్నతమైన సంకల్పమే పరమును వీడిన నీ త్యాగము
నీ – శాశ్వత ప్రేమ సమర్పణయే కలువరి సిలువలో బలియాగము (2)
మార్గము సత్యము జీవము నీవై నడిపించుచున్నావయ్యా (2)
మానవ జాతికి రక్షణ మార్గము చూపించుచున్నావయ్యా (2)
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||

సంఘ క్షేమముకై సంచకరువుగా పరిశుద్ధాత్ముని ఆగమనము
అద్భుతమైన కార్యములే నీవు ఇచ్చిన కృపా వరములు (2)
పరిపూర్ణతకై పరిశుద్ధులకు ఉపదేశ క్రమమును ఇచ్చావయ్యా (2)
స్వాస్థ్యమైన జనులకు మహిమ నగరం నిర్మించుచున్నావయ్యా (2)
ఏమని వర్ణించెదను నీ ప్రేమను
నేనెన్నని ప్రకటించెదను నీ కార్యములు (2)       ||ఘనమైన||

English Lyrics

Audio

సీయోనులో స్థిరమైన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే

సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను (2)

సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని (2)
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని (2)
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా (2)          ||సీయోనులో||

సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము (2)
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును (2)
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే (3)
ఆనందమే పరమానందమే (10)

English Lyrics

Audio

రాజాధి రాజ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాజాధి రాజ రవి కోటి తేజ
రమణీయ సామ్రాజ్య పరిపాలక (2)
విడువని కృప నాలో స్థాపించెనే
సీయోనులో నున్న స్తుతుల సింహాసనమును (2)        ||రాజాధి||

వర్ణనకందని పరిపూర్ణమైన నీ
మహిమ స్వరూపమును – నా కొరకే త్యాగము చేసి (2)
కృపా సత్యములతో కాపాడుచున్నావు
దినమెల్ల నీ కీర్తి మహిమలను – నేను ప్రకటించెద (2)        ||రాజాధి||

ఊహలకందని ఉన్నతమైన నీ
ఉద్దేశములను – నా యెడల సఫలపరచి (2)
ఊరేగించుచున్నావు విజయోత్సవముతో
యేసయ్య నీ కన్నా తోడెవ్వరు – లేరు ఈ ధరణిలో (2)        ||రాజాధి||

మకుటము ధరించిన మహారాజువై నీ
సౌభాగ్యమును – నా కొరకే సిద్ధపరచితివి (2)
నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి
నీ సాక్షినై కాంక్షతో పాడెద – స్తోత్ర సంకీర్తనలే (2)        ||రాజాధి||

English Lyrics

Audio

మధురం మధురం

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


మధురం మధురం నా ప్రియ యేసుని చరితం మధురం
శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం (2)
దీన మనస్సు – దయ గల మాటలు
సుందర వదనం – తేజోమయుని రాజసం (2)    ||మధురం||

ఆశ్చర్యకరమైన వెలుగై దిగివచ్చి – చీకటిలో ఉన్న వారిని
బంధింప బడియున్న వారిని విడుదల చేయుటకు (2)
నిరీక్షణ కలిగించి వర్దిల్ల చేయుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||

పరిపూర్ణమైన నెమ్మదినిచ్చుటకు – చింతలన్నియు బాపుటకు
ప్రయాసపడు వారి భారము తొలగించుటకు (2)
ప్రతిఫలము నిచ్చి ప్రగతిలో నడుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||

కలవర పరిచే శోధనలెదురైన – కృంగదీసే భయములైనను
ఆప్యాయతలు కరువైన ఆత్మీయులు దూరమైనా (2)
జడియకు నీవు మహిమలో నిలుపుటకు
యేసే సరిపాటి నా యేసే పరిహారి (2)    ||మధురం||

English Lyrics

Audio

విజయశీలుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి (2)          ||విజయశీలుడా||

అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2)
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)
నిత్యానందము కలిగించె నీ
శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2)          ||విజయశీలుడా||

ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2)
అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2)          ||విజయశీలుడా||

ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2)
అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2)
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2)          ||విజయశీలుడా||

English Lyrics

Audio

హోసన్ననుచూ స్తుతి పాడుచూ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

హోసన్ననుచూ స్తుతి పాడుచూ సీయోనుకు చేరెదం (2)
హోసన్నా… హోసన్నా… (4)           ||హోసన్ననుచూ||

ఈ లోకయాత్రలో బాటసారులం
ఈ జీవన కడలిలో పరదేశులం (2)
క్షణభంగురం ఈ క్షయ జీవితం
అక్షయ నగరం మనకు శాశ్వతం (2)        ||హోసన్నా||

మన్నయిన ఈ దేహం మహిమరూపమై
ధవళవర్ణ వస్త్రములు ధరియించెదము (2)
నాధుడేసుకు నవ వధువులము
నీతి పాలనలోన యువరాణులము (2)           ||హోసన్నా||

ప్రతి భాష్ప బిందువును తుడిచివేయును
చింతలన్ని తీర్చి చెంత నిలుచును (2)
ఆకలి లేదు దప్పిక లేదు
ఆహా మన యేసుతో నిత్యమానందం (2)          ||హోసన్నా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

యెహోవ నా ఆశ్రయం

పాట రచయిత: డేవిడ్ ఎడిసన్ తేళ్ల
Lyricist: David Edison Thella

Telugu Lyrics


యెహోవ నా ఆశ్రయం
నా విమోచన దుర్గము (2)
నా ధ్యానం నా గానం
యెహోవ నా అతిశయం (2)      ||యెహోవ||

తన ఆలయాన నా మోర వినెను
భూమి కంపించేలా ఘర్జన చేసెను
మేఘాలు వంచి ఎగిరి వచ్చి
జలరాసులనుండి నన్ను లేపెను
ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను
ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2)

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)     ||యెహోవ||

నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను
నా గుండెకు శౌర్యము నేర్పెను
జయము నాకు జన్మ హక్కు
ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము
శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము
ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం
ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2)

హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4)       ||యెహోవ||

English Lyrics

Audio

దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా నా దేవా నిన్ను కీర్తించెదన్
దేవా నా ప్రభువా నిన్ను స్తుతియించెదన్ (2)
నిన్ను కీర్తించెదన్ – నిన్ను స్తుతియించెదన్
నీ నామమునే ఘనపరచెదన్ (2)
హల్లెలూయ హల్లెలూయ యేసయ్యా
హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (2)

పనికిరాని నన్ను నీవు
ఉపయోగ పాత్రగ మలచితివే (2)
నీదు కృపతో నను రక్షించిన
దేవా నీకే వందనము (2)          ||హల్లెలూయ||

నీదు ప్రేమతో నను ప్రేమించి
నూతన జీవితం ఇచ్చితివి (2)
నీవు నాకై చేసావు త్యాగం
దేవా నీకే వందనము (2)         ||హల్లెలూయ||

నిన్ను నమ్మిన నీ ప్రజలకు
అండగా నీవు నిలచితివి (2)
మాట తప్పని నిజమైన ప్రభువా
దేవా నీకే వందనము (2)     ||హల్లెలూయ||

English Lyrics

Audio

 

HOME