నీ దయలో నేనున్న

పాట రచయిత: బద్దె హీవెన్ బాబు
Lyricist: Badde Heaven Babu

Telugu Lyrics


నీ దయలో నేనున్న ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం (2)
నీ దయ లేనిదే నేనేమౌదునో (2)
తెలియదయ్యా…          ||నీ దయలో||

తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా (2)
నీ దయ ఉంటే వారు – కాగలరు అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో – బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడలోనే నను దాచియుంచావని
నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని           ||నీ దయలో||

నేల రాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండ దాచావు (2)
నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము
ఏ కీడు నా దారికి రాకుండ నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే నే పరవశించాలని
నా ఆయువున్నంత వరకు నీ ప్రేమ పొందాలని           ||నీ దయలో||

English Lyrics

Audio

ప్రభువా కాచితివి

పాట రచయిత: క్రీస్తు దాస్
Lyricist: Kreesthu Das

Telugu Lyrics

ప్రభువా… కాచితివి ఇంత కాలం
కాచితివి ఇంత కాలం
చావైన బ్రతుకైన నీ కొరకే దేవా (2)
నీ సాక్షిగా నే జీవింతునయ్యా         ||ప్రభువా||

కోరి వలచావు నా బ్రతుకు మలిచావయ్యా
మరణ ఛాయలు అన్నిటిని విరిచావయ్యా (2)
నన్ను వలచావులే – మరి పిలిచావులే (2)
అరచేతులలో నను చెక్కు కున్నావులే (2)       ||ప్రభువా||

నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా
ఇలలో మనిషిగ పుట్టిన సర్పాన్నయ్యా (2)
పాపము కడిగావులే – విషము విరచావులే (2)
నను మనిషిగా ఇలలోన నిలిపావులే (2)       ||ప్రభువా||

బాధలను బాపితివి నీవేనయ్యా
నా కన్నీరు తుడిచితివి నీవేనయ్యా (2)
నన్ను దీవించితివి – నన్ను పోషించితివి (2)
నీ కౌగిలిలో నను చేర్చుకున్నావులే (2)       ||ప్రభువా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇంత కాలం

పాట రచయిత: శుభనాథ్ తాడి
Lyricist: Shubhanath Thaadi

Telugu Lyrics

ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2)         ||ఇంత కాలం||

ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
మారని వీడని ప్రేమే నీదయ్యా
మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2)         ||ఇంత కాలం||

నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)
నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2)           ||ఇంత కాలం||

దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు (2)
శోధన వేదన తీర్చిన యేసయ్యా
తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా (2)           ||ఇంత కాలం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME