వాటి వాటి కాలమున

పాట రచయిత: ఎస్ జే బెర్క్మన్స్
Lyricist: S J Berchmans

Telugu Lyrics


వాటి వాటి కాలమున అన్నిటిని
అతి మనోహరముగా చేయువాడా (2)
యేసయ్యా.. యేసయ్యా..
నా దైవం నీవేనయ్యా (2)       ||వాటి వాటి||

ఆశ భంగం కానేరదు
మంచి రోజు ముందున్నది (2)
సత్క్రియను ఆరంభించెను
ఎటులైన చేసి ముగించును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
ఎటులైన చేసి ముగించును (2)      ||యేసయ్యా||

అద్భుతములు చేసెదను
నీ తోడుంటానంటివి (2)
నా ప్రజల ఎదుట నీవు
(నను) హెచ్చింప చేసెదవు (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
హెచ్చింప చేసెదవు (2)      ||యేసయ్యా||

ఇప్పుడున్న వాటి కంటే
వెయ్యి రెట్లు చేసెదవు (2)
ఆకాశ తార వలె
భువిలో ప్రకాశింతును (2)
(నే) రూఢిగా నమ్ముచున్నాను
భువిలో ప్రకాశింతును (2)      ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

రాకడ ప్రభుని రాకడ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


రాకడ ప్రభుని రాకడ
రాకడ రెండవ రాకడ
ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది
రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ||

నోవాహు దినములలో జరిగినట్లుగా
లోతు కాలమున సాగినట్లుగా (2)
పాపమందు ప్రజలంతా మునిగి తేలగా
లోకమంతా దేవుని మరచియుండగా (2)
మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా
మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2)      ||రాకడ||

దేవుని మరచిన ప్రజలందరిని
సువార్తకు లోబడని జనులందరిని (2)
శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును
అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2)
వేదనతో భూమినంత బాధపరచును
తన మహిమను ప్రజలకు తెలియపరచును (2)       ||రాకడ||

English Lyrics

Audio

 

 

HOME