ఉపవాసంతో ప్రార్ధనలో

పాట రచయిత: రాజా మండ్రు
Lyricist: Raja Mandru

Telugu Lyrics

ఉపవాసంతో ప్రార్ధనలో
నీ వైపే చూస్తున్నా దేవా
మోకాళ్లపై కన్నీటితో
నే చేయు ప్రార్ధన వినుము దేవా
అడిగిననూ ఇయ్యవా దేవా
వెదకిననూ దొరకవా దేవా
తట్టిననూ తీయవా దేవా
యేసయ్యా విను నా ప్రార్ధన        ||ఉపవాసంతో||

నా నోట మాటలెల్ల నిను స్తుతించాలయ్యా
నా యొక్క తలంపులన్ని నీవవ్వాలయ్య (2)
దీపముగా మారి వెలుగును ఇవ్వాలయ్యా (2)
రుచికరంగా నీ ఉప్పుగా ఉండాలయ్యా (2)      ||అడిగిననూ||

జీవించు కాలమంతా నీ సేవ చేయాలి
నీ యొక్క సువాసన నేనివ్వాలయ్యా (2)
నేటి యువతకు ఆదర్శంగా ఉండాలయ్యా (2)
రేపటి సంఘానికి నీ మార్గం చూపాలయ్యా (2)      ||అడిగిననూ||

English Lyrics

Audio

ఇంటి మీద నున్న

పాట రచయిత: బొనిగల బాబు రావు
Lyricist: Bonigala Babu Rao

Telugu Lyrics

ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను నేను
కన్నీటితో కృంగి పోతున్నాను (2)
నా యేసయ్యా నా బలమా (2)
నా దీన ప్రార్థన ఆలకించుమా          ||ఇంటి మీద||

వెతకాని బాణమును చేయుచుండె గాయములు
అపవాది కోరలు కోరుచుండె ప్రాణమును – (2)
నీ బాలి పీఠము చెంత నాకు చోటునీయుమా (2)
ఆలకించుమా ఆదరించుమా (2)        ||ఇంటి మీద||

తెలిసి తెలిసి చేసితిని ఎన్నెన్నో పాపములు
తరచి తరచి చూచినా తరగవు నా దోషములు – (2)
నీ ఆత్మను కోల్పోయిన దీనుడను నేను (2)
ఆలకించుమా ఆదరించుమా (2)        ||ఇంటి మీద||

English Lyrics

Audio

HOME