కృతజ్ఞతతో స్తుతి పాడెద

పాట రచయిత: పి జి అబ్రహాం
అనువదించినది: జోయెల్ ఎన్ బాబ్
Lyricist: P G Abraham
Translator: Joel N Bob

Telugu Lyrics


కృతజ్ఞతతో స్తుతి పాడెద
నా యేసు నాథా
నాకై నీవు చేసిన మేళ్లకై
కోటి కోటి కృతజ్ఞతలు (2)

అర్హతే లేని నాపై నీదు
ప్రేమ చూపిన కృపామయా (2)
నా ఊహలకంటెను అధికముగా
దయచేయు ప్రేమామయా (2)         ||కృతజ్ఞతతో||

నిజ రక్షకుడు యేసు క్రీస్తని
విశ్వసించెద అను నిత్యము (2)
నీ పాద సేవలో బ్రతుకుటకై
నీ వరము ప్రసాదించుము
నీ పాద సేవలో బ్రతుకుటకై
వరములతో అభిషేకించు       ||కృతజ్ఞతతో||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

ప్రియతమ బంధమా

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics

ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా
అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము
కృతజ్ఞతతో పాడెదను
నిరంతరము స్తుతించెదను       ||ప్రియతమ||

అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు
గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2)
నా నిరీక్షణ ఆధారం నీవు
నమ్మదగిన దేవుడవు నీవు (2)
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా (2)
వందనం వందనం దేవా – వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం     ||కృతజ్ఞతతో||

పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను
పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2)
విశ్వసించిన వారందరికి
నిత్య జీవము నొసగె దేవా (2)
కరుణ చూపి రక్షించినావు
కరుణామూర్తి యేసు నాథా (2)
వందనం వందనం దేవా – వందనం వందనం
అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం      ||కృతజ్ఞతతో||

English Lyrics

Audio

కృపలను తలంచుచు

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


కృపలను తలంచుచు (2)
ఆయుష్కాలమంతా ప్రభుని
కృతజ్ఞతతో స్తుతింతున్ (2)       ||కృపలను||

కన్నీటి లోయలలో నే.. కృంగిన వేళలలో (2)
నింగిని చీల్చి వర్షము పంపి
నింపెను నా హృదయం – (యేసు) (2)      ||కృపలను||

రూపింపబడుచున్న ఏ.. ఆయుధముండినను (2)
నాకు విరోధమై వర్ధిల్లదు యని
చెప్పిన మాట సత్యం – (ప్రభువు) (2)       ||కృపలను||

సర్వోన్నతుడైన నా.. దేవునితో చేరి (2)
సతతము తన కృప వెల్లడిచేయ
శుద్దులతో నిలిపెను – (ఇలలో) (2)       ||కృపలను||

హల్లెలూయా ఆమెన్ ఆ.. నాకెంతో ఆనందమే (2)
సీయోను నివాసం నాకెంతో ఆనందం
ఆనందమానందమే – (ఆమెన్) (2)       ||కృపలను||

English Lyrics

Audio

విజయశీలుడా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను (2)
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి (2)          ||విజయశీలుడా||

అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – (2)
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు (2)
నిత్యానందము కలిగించె నీ
శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి (2)          ||విజయశీలుడా||

ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – (2)
అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు (2)
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా (2)          ||విజయశీలుడా||

ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – (2)
అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు (2)
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు (2)          ||విజయశీలుడా||

English Lyrics

Audio

స్తుతించెదను స్తుతించెదను

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


స్తుతించెదను స్తుతించెదను
నా యేసు ప్రభున్ కృతజ్ఞతతో అనుదినము        ||స్తుతించెదను||

ఉన్నత దేవుడు సర్వాధిపతియు – ఉర్వి పరిపాలక (2)
ఉన్నతం విసర్జించి నన్ను వెదకిన – ఉత్తమ స్నేహితుని (2)
ఉదయం సంధ్యా ఎల్లప్పుడును – ఉత్సాహ ధ్వనితో పాడెదను (2)         ||స్తుతించెదను||

నాశనకరమైన పాప గుంట నుండి – నరక వేదన నుండి (2)
నన్ను విడిపించి నిలిపిన దేవా – నిర్మల స్వరూప (2)
నీతి సమాధానం సంతోషముతో – నిత్య జీవము నాకిచ్చితివి (2)         ||స్తుతించెదను||

పాపము క్షమించి రోగము బాపి – భయమును దీర్చి (2)
పవిత్రదాయక పావన మూర్తి – పరిశుద్ధ మిచ్చిన (2)
పరమ పాదం శరణ్యం నాకు – పరమ రాజా పుణ్య దేవా (2)         ||స్తుతించెదను||

తల్లి గర్భమునకు ముందేర్పరచి – దేహము నమర్చియును (2)
దక్షిణ బాహుతో పట్టుకొనిన – దయా సంపూర్ణుడా (2)
దిక్కు జయము ఆదరణయు – దయతో అనుగ్రహించితివి (2)         ||స్తుతించెదను||

సిలువనెత్తి శ్రమలు సహించి – సేవకు పిలచిన (2)
స్నేహ దర్శక వీర యోధ – సంశయ హారకా (2)
శ్రమలు నింద ఆకలియైన – నీ స్నేహమునుండి ఎడబాపునా (2)         ||స్తుతించెదను||

English Lyrics

Audio

నా కన్నులెత్తి వేచియుందును

పాట రచయిత: కృపల్ మోహన్
Lyricist: Kripal Mohan

Telugu Lyrics


నా కన్నులెత్తి వేచియుందును
నా చేతులెత్తి ఆరాధింతును క్రీస్తుని
నా ప్రాణముతో సన్నుతింతును
కృతజ్ఞతతో ఆరాధింతును క్రీస్తుని       ||నా కన్నులెత్తి||

మహిమా ఘనతా – యేసు నీ నామముకే
ఉత్సాహ ధ్వనులతో
స్తుతి నిత్యము చేసెదన్ (3)             ||నా కన్నులెత్తి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME