పరమ తండ్రి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

పరమ తండ్రి కుమారుడా
పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం
నీతిమంతుడా మేఘారూఢుడా
స్తుతి పాత్రుడా నీకే మహిమ
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా (2)

నీ స్వస్థతల కన్నా
నీ సన్నిధియే మిన్న
నీ అద్భుతములు కన్నా
నీ కృపయే మిన్న (2)
నను నే ఉపేక్షించి
నిను నేను హెచ్చించి
కొనియాడి కీర్తింతును (2)

పరిశుద్ధుడా పరమాత్ముడా
పునరుత్తానుడా నీకే ఘనత
సృష్టికర్త బలియాగమా
స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన (2)

English Lyrics

Audio

నీవు తప్ప నాకీ లోకంలో

పాట రచయిత: మైలబత్తుల యేసు పాదం
Lyricist: Mylabatthula Yesu Padam

Telugu Lyrics


నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2)           ||నీవు||

గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)
కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2)           ||దావీదు||

లోకమంత చూచి నను ఏడిపించినా
జాలితో నన్ను చేరదీసిన (2)
ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2)           ||దావీదు||

నా తల్లి నన్ను మరచిపోయినా
నా తండ్రి నన్ను విడచిపోయినా (2)
తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2)           ||దావీదు||

English Lyrics

Audio

HOME