ఉతక మీద తలుపు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును

సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2)
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2)    ||ఉతక||

చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (2)
అయినను అవి క్రమము గానే నడచును
వేసవిలో ఆహారము కూర్చును (2)       ||సోమరీ||

చిన్న కుందేళ్ళను చూడు
ఏ మాత్రము బలము లేని జీవులు (2)
పేరు సందులలో జీవించును
బంధకములు లేనివై తిరుగును (2)       ||సోమరీ||

చిన్న జీవులు మిడతలు చూడు
వాటికి న్యాయాధిపతి లేడుగా (2)
పంక్తులుగా తీరి సాగి పోవును
జ్ఞానము గల వానిగ పేరొందును (2)       ||సోమరీ||

తెల్లవారుచుండగనే పక్షులు
కిలకిలమని దేవుని స్తుతియించును (2)
బ్రతుకు తెరువు కోసమై తిరుగును
ప్రొద్దుగూకు వేళలో గూడు చేరును (2)        ||సోమరీ||

ఓ మానవుడా నీ మనసును మార్చుకో
ఎందుకో నీ పయనము తెలుసుకో (2)
ప్రభు రాకడ ఎప్పుడో అది తెలియదు
అంతమొచ్చుఁ కాలమొక్కటున్నది (2)        ||సోమరీ||

English Lyrics

Audio

నా దేవుని కృపవలన

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


నా దేవుని కృపవలన
సమస్తము సమకూడి జరుగును (2)
నాకు లేమి లేనే లేదు
అపాయమేమియు రానే రాదు (2)       ||నా దేవుని||

కరువులో కష్టాలలో
ఆయనే నన్ను బలపరుచును (2)
ఆయనే నన్ను బలపరుచును
ఆయనే నన్ను ఘనపరుచును (2)       ||నా దేవుని||

శ్రమలలో శోధనలో
ఆయనే నాకు ఆశ్రయము (2)
ఆయనే నాకు ఆశ్రయము
ఆయనే నాకు అతిశయము (2)       ||నా దేవుని||

ఇరుకులో ఇబ్బందిలో
ఆయనే నన్ను విడిపించును (2)
ఆయనే నన్ను విడిపించును
ఆయనే నన్ను నడిపించును (2)       ||నా దేవుని||

English Lyrics

Audio

యెహోవా మా కాపరి

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యెహోవా మా కాపరి
యేసయ్య మా ఊపిరి
మాకు లేనిది లేదు లేమి కలుగదు (2)         ||యెహోవా||

వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2)
మా ప్రాణములు సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను         ||యెహోవా||

కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడకలో ఊపిరి పోసెను (2)
మా తోడు నీడై నిలిచి నడచెను
శత్రు పీఠమున విందు చేసెను         ||యెహోవా||

పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను
నిరతము మేము కీర్తింతుము         ||యెహోవా||

English Lyrics

Audio

 

 

 

యెహోవా నా కాపరి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics


యెహోవా నా కాపరి నాకు లేమిలేదు
పచ్చికగలచోట్ల మచ్చికతో నడుపున్        || యెహోవా ||

మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించున్      || యెహోవా ||

పగవారి ఎదుట ప్రేమతో ఒక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశమెందెదను      || యెహోవా ||

నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది            || యెహోవా ||

చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసమొందెదను        || యెహోవా ||

English Lyrics

Audio

Chords

HOME