రాజు పుట్టెను

పాట రచయిత: శ్యామ్ జోసఫ్
Lyricist: Shyam Joseph

Telugu Lyrics

రాజు పుట్టెను రాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను (2)
ఊరు వాడా పండుగాయెను (2)
కాంతులతో మెరసిపోయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను

దూతలు వెళ్లిరి గొల్లలకు తెల్పిరి
లోక రక్షకుడు పుట్టాడని (2)
అంధకారమైన బ్రతుకును మార్చుటకు
చీకటినుండి వెలుగులో నడుపుటకు (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను            ||రాజు పుట్టెను||

జ్ఞానులు వెళ్లిరి యేసుని చూచిరి
సంతోషముతో ఆరాధించిరి (2)
మన జీవితము మార్చుకొనుటకు
ఇదియే సమయము ఆసన్నమాయెను (2)
రాజు పుట్టెను మహారాజు పుట్టెను
లోకమంతా సందడి ఆయెను            ||రాజు పుట్టెను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

లే నిలబడు

పాట రచయిత: పి సాల్మన్
Lyricist: P Salman

Telugu Lyrics

లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే
నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే
సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా
నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా
నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా
పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు
నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో
పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో
కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు       ||లే నిలబడు||

రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా
పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి
యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే
రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి
ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా
బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా
మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు
ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు
సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం       ||లే నిలబడు||

సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే
ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి
ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న
పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి
బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో
తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన
చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న
ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి
గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం       ||లే నిలబడు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మాయాలోక ఛాయల్లోన

పాట రచయిత: జి యస్ మైఖేల్
Lyricist: G S Michael

Telugu Lyrics


మాయాలోక ఛాయల్లోన మోసం నాశనం ఉన్నాది (2)
నమ్మబోకు నమ్మబోకు సోదరా
ఈ మాయ లోకం నమ్మబోకు సోదరీ (2)
లోకమంతా తిరిగెదవా – లోకము నిన్నే ఏలునురా (2)
లోక రక్షకుడేసుని మాటకు లోబడుమిప్పుడే సోదరా
అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు
రొక్కాము లేకుండానే స్వర్గానికి పోదాం రండి
అక్కా మీరేమిట్లు – చక్కగ రండి మీరిట్లు
అన్నా మీరేమిట్లు – మనమే దేవుని పనిముట్లు

ప్రేమ గల దేవుడమ్మా – ప్రేమతో వచ్చాడమ్మా
రమ్మని పిలుచుచున్నాడు.. నిన్ను
అమ్మలా ఆదరిస్తాడు – అయ్యలా ఆదుకుంటాడు (2)
ఎంత ఘోర పాపివైన చింత లేదురా
సంతసమును నీకీయ స్వర్గము విడి యేసయ్యా
స్వర్గము విడి యేసయ్యా
చెంత చేరి ఈ క్షణమే సేదదీరుము
అంతు లేని ప్రేమలోనే మునిగి తేలుము
సమయమిదే కనుగొనుమా – త్వరపడు సుమ్మా – (2)      ||ప్రేమ గల||

చెప్పినాడు యేసయ్యా – చక్కనైన మాటలెన్నో
శత్రువును సైతము ప్రేమించమన్నాడు – (2)
నిక్కముగ నిన్ను వలే పక్కవాన్ని సూడమని
ఎక్కడున్న గాని వాడు యేసుకు వారసుడే – (2)
అన్నయ్యా యేసులోకి రావాలయ్యా
అక్కయ్యా యేసులోకి రావాలమ్మా (3)

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసయ్యా నా ప్రాణనాథా నిను

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


యేసయ్యా నా ప్రాణనాథా నిను
ఆడి పాడి కీర్తించెదను
నీవే నా జీవదాత అని
లోకమంతా చాటించెదను           ||యేసయ్యా||

సర్వశక్తిమంతుడా సర్వాధికారి
సర్వలోకమును సృష్టించిన సుందరుడా (2)
స్తుతి మహిమా ఘనతా నీకే అని
సంతసించి స్తోత్రించెదను           ||యేసయ్యా||

పాపమే ఎరుగని నీతిమంతుడా
పాపిని రక్షించిన నీతిసూర్యుడా (2)
పరిశుద్ధ పరలోక తండ్రి అని
పరవశించి నే పాడెదను           ||యేసయ్యా||

ఆది అంతమైన అల్ఫా ఒమేగా
మేఘముపై రానున్న మహిమోన్నతుడా (2)
ఉన్నవాడవు అనువాడవు నీవని
ఉల్లసించి ఆరాధింతును           ||యేసయ్యా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

పరవాసిని నే జగమున

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను       ||పరవాసిని||

లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వమును
ఇలలో.. వ్యర్ధము సర్వమును      ||పరవాసిని||

ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున (2)
పాపము నిండె జగములో (2)
శాపము చేకూర్చుకొనే
లోకము.. శాపము చేకూర్చుకొనే     ||పరవాసిని||

తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను        ||పరవాసిని||

ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని (2)
క్షమాపణ పొందితివనగా (2)
మహానందము కలిగే
నాలో.. మహానందము కలిగే        ||పరవాసిని||

యాత్రికుడనై ఈ లోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో (2)
అమూల్యమైన ధనముగా (2)
పొందితిని నేను
యేసునే.. పొందితిని నేను       ||పరవాసిని||

నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో (2)
చేరుదున్ పరలోక దేశము (2)
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే       ||పరవాసిని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

 

 

HOME