బంధము నీవే

పాట రచయిత: ఆడమ్ బెన్ని
Lyricist: Adam Benny

బంధము నీవే – స్నేహము నీవే (2)
(యేసయ్యా) అతిథివి నీవేనయ్యా
ఆప్తుడా నీవేనయ్యా (2)

ప్రేమించువాడా కృప చూపువాడా
నాతోనే ఉండి నను నడుపువాడా (2)
కాలాలు మారినా మారని వాడా (2)
విడువవు నను ఎప్పుడూ
మరువని తండ్రివయ్యా (2)          ||బంధము||

మూగబోయిన నా గొంతులోన
గానము నీవై నను చేరినావా (2)
హృదయ వీనవై మధుర గానమై (2)
నాలోనే ఉన్నావయ్యా
నా ఊపిరి నీవేనయ్యా (2)          ||బంధము||

ఈ లోకములో యాత్రికుడను
ఎవ్వరు లేని ఒంటరినయ్యా (2)
నీవే నాకు సర్వము దేవా (2)
చాలును చాలునయ్యా
నీ సన్నిధి చాలునయ్యా (2)          ||బంధము||

Download Lyrics as: PPT

కాలాలు మారిన గాని

పాట రచయిత: సుధాకర్
Lyricist: Sudhakar

Telugu Lyrics

కాలాలు మారిన గాని – యేసు మారడు
తరతరాలు మారినా యేసుని
ప్రేమ మారదు – (2)         ||కాలాలు||

గర్భమున పుట్టిన మొదలు
తల్లి ఒడిలోనున్నది మొదలు (2)
కడవరకు మోసే ప్రేమది
ముదమార పిలిచే ప్రేమది (2)         ||కాలాలు||

నింగి నేల మారిన గాని
పర్వతాలు తొలగిన గాని (2)
కడవరకు నిలిచే ప్రేమది
కలుషములు తుడిచే ప్రేమది (2)         ||కాలాలు||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

తరాలు మారినా యుగాలు మారినా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

తరాలు మారినా యుగాలు మారినా
మారని దేవుడు మారని దేవుడు
మన యేసుడు      ||తరాలు||

మారుచున్న లోకములో
దారి తెలియని లోకములో (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

సూర్యచంద్రులు గతించినా
భూమ్యాకాశముల్ నశించినా (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

నీతి న్యాయ కరుణతో
నిశ్చలమైన ప్రేమతో (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

నిన్న నేడు నిరంతరం
ఒకటైయున్న రూపము (2)
మారని దేవుడు మన యేసుడు (2)       ||తరాలు||

English Lyrics

Audio

ఆధారం నీవేనయ్యా

పాట రచయిత: ఎస్ రాజశేఖర్
Lyricist: S Rajasekhar

Telugu Lyrics

ఆధారం నీవేనయ్యా (2)
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా         ||ఆధారం||

లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది       ||ఆధారం||

ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు (2)
అయినను ఎందుకో నెమ్మది లేదు (2)
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది         ||ఆధారం||

నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను (2)
హృదయము నిచ్చావు నెమ్మది నొందా (2)
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును          ||ఆధారం||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME