ఏ నామములో

పాట రచయిత: అను శామ్యూల్
Lyricist: Anu Samuel

Telugu Lyrics

ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో
ఆ నామమునే స్తుతింతును
ఏ నామములో పాపమంతా క్షమించబడెనో
ఆ నామమునే పూజింతును
ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో
ఆ నామమునే నమ్మెదను
ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో
ఆ నామమునే స్మరింతును

నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే ఆధారము
నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను
నీ నామమే నా జయము

రోగము తలవంచును నీ నామము ఎదుట
శాపము తల వంగును నీ నామము ఎదుట (2)
సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2)       ||నీ నామమునే||

ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట
ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2)
శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2)       ||నీ నామమునే||

హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా
కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా
కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా
అన్ని నామములకు పై నామముగా (2)
అన్ని నామములకు పై నామముగా – (3)       ||నీ నామమునే||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసుని నామములో

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసుని నామములో – మన బాధలు పోవును
దుష్టాత్మలు పారిపోవును
శోధనలో జయమొచ్చును
మృతులకు నిండు జీవమొచ్చును
హృదయములో నెమ్మదొచ్చును
యేసు రక్తముకే – యేసు నామముకే
యుగయుగములకూ మహిమే
అభిషిక్తులగు తన దాసులకు
ప్రతి సమయమునా జయమే    ||యేసుని||

ఘోరమైన వ్యాధులెన్నైనా
మార్పులేని వ్యసనపరులైనా
ఆర్ధికముగా లోటులెన్నున్నా
ఆశలు నిరాశలే ఐనా
ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు
పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు            ||యేసు రక్తముకే ||

రాజువైనా యాజకుడవైనా
నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా
ఆశ్రయముగా గృహములెన్నున్నా
నిలువ నీడే నీకు లేకున్నా
శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా
నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు         ||యేసు రక్తముకే ||

English Lyrics

Audio

యేసుని నా మదిలో

పాట రచయిత: క్రాంతి చేపూరి
Lyricist: Kranthi Chepuri

Telugu Lyrics


యేసుని నా మదిలో స్వీకరించాను
ఆయన నామములో రక్షణ పొందాను (2)
నేను నేనే కాను… నాలో నా యేసే… (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ          ||యేసుని||

పాతవి గతియించెను
క్రొత్తవి మొదలాయెను (2)
నా పాప హృదయింలో రారాజు జన్మించె
నా పాపం తొలగి పోయెను – నా దుుఃఖం కరిగి పోయెను (2)
యేసే నా జీవం…
ఆ ప్రభువే నా దెైవం (2)           ||హల్లెలూయ||

నీ పాపం తొలగాలన్నా
నీ దుుఃఖం కరగాలన్నా (2)
యేసుని నీ మదిలోకి స్వీకరించాలి
ఆయన నామములోనే రక్షణ పొందాలి (2)
యేసే మన జీవం…
ఆ ప్రభువే మన దెైవం (2)     ||హల్లెలూయ||

నీవు నమ్మితే రక్షణ
నమ్మకున్నచో శిక్షయే (2)
ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో
విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2)
ఈ క్షణమే నీవు తేల్చుకో…
ఇదియే అనుకూల సమయము (2)       ||హల్లెలూయ||

English Lyrics

Audio

HOME