సాగేను నా జీవ నావ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సాగేను నా జీవ నావ
దొరికేను ఓ ప్రేమ త్రోవ
నా యేసు పయనించు దారదీ
కల్వరిగిరి చేరే త్రోవదీ
ఆ….ఆ….ఆ….        ||సాగేను||

నేనెవరో నేనెరుగని తరుణంలో
నా ఉనికిని యేర్పరచిన నాథుడు
విశ్వాసపు నా జీవనతీరంలో
ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు
ఆ….ఆ….ఆ….        ||సాగేను||

తన రక్త ధారలను ప్రోక్షించి
నా హృదిలో పాపము తొలగించెను
అనురాగ రసరమ్య గీతిక
నా హృదిలో ప్రేమను వెలిగించెను
ఆ….ఆ….ఆ….        ||సాగేను||

ప్రభు పనిలో బలమైన యోధులుగా
ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు
నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట
వాడుటకు మమ్మును బలపరచుము
ఆ….ఆ….ఆ….        ||సాగేను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

గలిలయ తీరాన

పాట రచయిత: పి సతీష్ కుమార్
Lyricist: P Satish Kumar

Telugu Lyrics

గలిలయ తీరాన చిన్న నావ
యేసయ్య ఏర్పరచు-కున్న నావ (2)
యేసయ్య సేవలో వాడబడిన
యేసయ్య బోధకు ఉపయోగపడిన
ఆ నావలా నేనుంటే చాలునయ్యా          ||గలిలయ||

యేసయ్య రాకకై ఎదురు చూసిన
యేసయ్యను మోస్తూ పరవశించిన (2)
ఆత్మల సంపాదనకై వాడబడిన
ఆశ్చర్య కార్యములెన్నో చూసిన
ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ||

సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా
పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2)
ఆగకుండా ముందుకే కొనసాగిన
అలుపెరగని సేవకై సిద్ధపడిన
ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా          ||గలిలయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

మార్గములను సృజించువాడు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు
బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2)
నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు
అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2)

ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ
జలములు నాపైకి లేచిననూ (2)
సంకెళ్లు నను బిగదీసిననూ
శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2)        ||నేను||

జీవితమంతా శూన్యమైననూ
బంధువులందరు నను విడచిననూ (2)
వ్యాధులెన్నో నను చుట్టిననూ
అడ్డంకులెన్నో నాకెదురైననూ (2)        ||నేను||

English Lyrics

Audio

 

 

 

అదిగో నా నావ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు (2)

వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను (2)
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే (2)       ||అదిగో||

నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా (2)
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును (2)       ||అదిగో||

లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి (2)
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును (2)       ||అదిగో||

English Lyrics

Audio

నడిపించు నా నావా

పాట రచయిత: ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు
Lyricist: Andhra Kraisthava Keerthanalu

Telugu Lyrics


నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున నా జన్మ తరియింప       ||నడిపించు||

నా జీవిత తీరమున నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు
నా యాత్మ విరబూయ నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము నా సేవ చేకొనుము        ||నడిపించు||

రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ          ||నడిపించు||

ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని అల్లాడే నావలలు              ||నడిపించు||

ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై యిపుడు పాటింతు నీ మాట       ||నడిపించు||

లోటైన జలములలో లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు
లోపించని అర్పనగా లోకేష చేయుమయా         ||నడిపించు||

ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు     ||నడిపించు||

English Lyrics

Audio

Chords

Download Lyrics as: PPT

HOME