ఓ దేవా దయ చూపుమయ్యా

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics

ఓ దేవా దయ చూపుమయ్యా
దేశాన్ని బాగుచేయుమయ్యా
నీ ప్రజల మొరను అలకించుమా
నీ కృపలో మమ్మును నడిపించుమా
మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు        ||ఓ దేవా||

సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా
నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా
అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా
పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా

ఒకసారి చూడు – ఈ పాప లోకం
నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు
దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు         ||ఓ దేవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇశ్రాయేలు సైన్యములకు

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics

ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2)
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా (2)

సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే (2)
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి (2)

పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి (2)
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి (2)

నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి (2)
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి (2)

ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి (2)
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము (2)      ||ఇశ్రాయేలు||

English Lyrics

Audio

ఆశ్రయదుర్గమా

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే           ||ఆశ్రయ||

లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2)        ||ఆశ్రయ||

నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2)
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2)        ||ఆశ్రయ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME