మారని దేవుడవు నీవేనయ్యా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


మారని దేవుడవు నీవేనయ్యా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)
సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా
మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2)         ||మారని||

చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా
నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2)
మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2)
మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2)       ||మారని||

నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా
నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2)
నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2)
నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2)         ||మరని||

English Lyrics

Audio

 

 

 

నిను స్తుతించినా చాలు

పాట రచయిత:
Lyricist: 

Telugu Lyrics

నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో…
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు      ||నిను||

స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2)        ||నిను||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

యేసు మాతో నీవుండగా

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


యేసు మాతో నీవుండగా
మేము అలసిపోలేమయ్యా (2)
అంతా నీవే చూసుకుంటావు (4)       ||యేసు మాతో||

సమాధానకారకుడు నీవేనయ్యా
సర్వశక్తుడవు నీవేనయ్యా (2)           ||యేసు మాతో||

అద్భుత దేవుడవు నీవేనయ్యా
ఆలోచన కర్తవు నీవేనయ్యా (2)         ||యేసు మాతో||

నా యొక్క సౌందర్యం నీవేనయ్యా
నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2)  ||యేసు మాతో||

English Lyrics

Audio

 

 

HOME