పాట రచయిత:
Lyricist:
- Telugu Lyrics
- English Lyrics
- Audio
Telugu Lyrics
కరుణామయుడా పరలోక రాజా
నిత్యనివాసి నిర్మల హృదయుడా (2)
నీకే స్తోత్రములు – నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు – దేవా నీకే స్తోత్రములు
నీకే స్తోత్రములు ||కరుణామయుడా||
గడిచిన దినములన్ని కాపాడినావు
కృపాక్షేమములే నా వెంట ఉంచావు (2)
విడువక నా యెడల కృప చూపినావు (2)
విడువను యేసయ్యా మరువను నీ ప్రేమ (2) ||నీకే స్తోత్రములు||
శోధనలెన్నో నా చుట్టూ క్రమ్మినా
వేదనలెన్నో కలిగిన వేళలో (2)
సహించే శక్తి నాకిచ్చినావు (2)
నీ సేవలో నన్ను నడిపించినావు (2) ||నీకే స్తోత్రములు||
నూతన యుగములోన నను నిలిపినావు
నూతనాత్మతో నను నింపు దేవా (2)
నిత్యము సేవలో పౌలు వలె పరుగెత్తి (2)
ప్రాణము పోయే వరకు ప్రకటింతు నీ వార్త (2) ||నీకే స్తోత్రములు||
English Lyrics
Audio
Download Lyrics as: PPT