ఒకసారి నీ స్వరము

పాట రచయిత: జాన్ వెస్లీ
Lyricist: John Wesley

Telugu Lyrics

ఒకసారి నీ స్వరము వినగానే
ఓ దేవా నా మనసు నిండింది
ఒకసారి నీ ముఖము చూడగానే
యేసయ్య నా మనసు పొంగింది (2)
నా ప్రతి శ్వాసలో నువ్వే
ప్రతి ధ్యాసలో నువ్వే
ప్రతి మాటలో నువ్వే
నా ప్రతి బాటలో నువ్వే (2)         ||ఒకసారి||

నీ సిలువ నుండి కురిసింది ప్రేమ
ఏ ప్రేమ అయినా సరితూగునా (2)
నీ దివ్య రూపం మెరిసింది ఇలలో
తొలగించె నాలోని ఆవేదన        ||నా ప్రతి||

ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా
బ్రతికించు మమ్ములను నీ కోసమే (2)
తొలగాలి చీకట్లు వెలగాలి ప్రతి హృదయం
నడిపించు మమ్ములను నీ బాటలో        ||నా ప్రతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఈ లోక యాత్రాలో

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2)
ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2)
అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2)       ||ఈ లోక||

జీవిత యాత్ర ఎంతో కఠినము (2)
ఘోరాంధకార తుఫానులున్నవి (2)
అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2)
కాయు వారెవరు రక్షించేదెవరు (2)       ||ఈ లోక||

నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2)
అనుదినము నన్ను ఆదరించెదవు (2)
నీతో ఉన్నాను విడువలేదనెడు (2)
నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2)       ||ఈ లోక||

తోడై యుండెదవు అంతము వరకు (2)
నీవు విడువవు అందరు విడచినను (2)
నూతన బలమును నాకొసగెదవు (2)
నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2)       ||ఈ లోక||

English Lyrics

Audio

Chords

నీ జీవితములో

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా
ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2)     ||నీ జీవితములో||

నీ తల్లి గర్భాన నీవుండినపుడే
నిను చూచే ప్రభు కన్నులు (2)
యోచించలేవా ఏ రీతి నిన్ను
నిర్మించే తన చేతులు (2)         ||నీ జీవితములో||

నీలోనే తాను నివసింపగోరి
దినమెల్ల చేజాచెను (2)
హృదయంపు తలుపు తెరువంగ లేవా
యేసు ప్రవేశింపను (2)         ||నీ జీవితములో||

తన చేతులందు రుధిరంపు ధారల్
స్రవియించే నీకోసమే (2)
భరియించె శిక్ష నీకోసమేగా
ఒకసారి గమనించావా (2)         ||నీ జీవితములో||

ప్రభు యేసు నిన్ను సంధించునట్టి
సమయంబు యీనాడేగా (2)
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరా
ఈ చోటనుండి ప్రభు యేసు లేక
పోబోకుమో సోదరీ         ||నీ జీవితములో||

English Lyrics

Audio

Chords

HOME