నీవు లేని క్షణమైనా

పాట రచయిత: ఆర్ లాజరస్
Lyricist: R Lazarus

Telugu Lyrics

నీవు లేని క్షణమైనా ఊహించలేను
నీ కృప లేనిదే నేను బ్రతుకలేను (2)
నీవే నా కాపరి – నీవే నా ఊపిరి
నీవే నా సర్వము యేసయ్య
నీతోనే జీవితం – నేనే నీకంకితం
గైకొనుమో నన్ను ఓ దేవా…          ||నీవు లేని||

శ్రమలెన్నో వచ్చినా – శోధనలే బిగిసినా
నను ధైర్యపరిచె నీ వాక్యం
సంద్రాలే పొంగినా – అలలే ఎగసినా
నను మునగనీయక లేవనెత్తిన (2)
నీవే నా కండగా – నాతో నీవుండగా
భయమన్నదే నాకు లేదూ
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

శత్రువులే లేచినా – అగ్ని ఆవరించినా
అవి నన్ను కాల్చజాలవుగా
దుష్టులే వచ్చినా – సింహాలై గర్జించినా
నాకేమాత్రం హాని చేయవుగా (2)
వెన్నుతట్టి బలపరచిన – చేయిపట్టి నడిపించిన
వేదనలే తొలగించిన యేసయ్యా
సర్వలోక నాధుడా – కాపాడే దేవుడా
వందనము నీకే ఓ దేవా…          ||నీవు లేని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఎంత జాలి యేసువా

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

ఎంత జాలి యేసువా
యింతయని యూహించలేను     ||ఎంత||

హానికరుడ హింసకుడను
దేవదూషకుడను నేను (2)
అవిశ్వాసినైన నన్ను (2)
ఆదరించినావుగా     ||ఎంత||

రక్షకుండ నాకు బదులు
శిక్ష ననుభవించినావు (2)
సిలువయందు సొమ్మసిల్లి (2)
చావొందితివి నాకై     ||ఎంత||

ఏమి నీ కర్పించగలను
ఏమి లేమి వాడనయ్యా (2)
రక్షణంపు పాత్రనెత్తి (2)
స్తొత్రమంచు పాడెద     ||ఎంత||

నీదు నామమునకు యిలలో
భయపడెడు వారి కొరకై (2)
నాథుడా నీ విచ్చు మేలు (2)
ఎంత గొప్పదేసువా     ||ఎంత||

నేను బ్రతుకు దినములన్ని
క్షేమమెల్ల వేళలందు (2)
నిశ్చయముగ నీవు నాకు (2)
ఇచ్చువాడా ప్రభువా     ||ఎంత||

నాదు ప్రాణమునకు ప్రభువా
సేద దీర్చు వాడ వీవు (2)
నాదు కాపరివి నీవు (2)
నాకు లేమి లేదుగా     ||ఎంత||

అందరిలో అతి శ్రేష్ఠుండా
అద్వితీయుడగు యేసయ్యా (2)
హల్లెలూయ స్తోత్రములను (2)
హర్షముతో పాడెద     ||ఎంత||

English Lyrics

Audio

Chords

నీ కృప లేని క్షణము

పాట రచయిత: పాకలపాటి జాన్ వెస్లీ
Lyricist: Pakalapati John Wesley

Telugu Lyrics

యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా

నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము
నేనూహించలేను యేసయ్యా (2)
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా
నీ కృప లేనిదే నేనుండలేనయ్యా (2)     ||నీ కృప||

మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహిని నీవు మాధుర్యముగా మార్చి
మాదిరి చూపి మరో రూపమిచ్చావు (2)
మహిమలో నేను మహిమను పొంద
మహిమగా మార్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి
ఆపత్కాలమున ఆదుకొన్నావు
ఆత్మీయులతో ఆనందింప చేసి
ఆనంద తైలముతో అభిషేకించావు (2)
ఆశ తీర ఆరాధన చేసే
అదృష్టమిచ్చింది నీ కృప (2)     ||యేసయ్యా||

English Lyrics

Audio

నీతో నుండని బ్రతుకు

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics


నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము
ఊహించలేను నా యేసయ్యా
నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు
ఊహించలేను నా యేసయ్యా (2)

నీదు స్వరము వినకనే నేను
నిను విడచి తిరిగితి నేను
నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2)          ||నిను||

నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి
అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని (2)
అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ
నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా        ||నీతో||

నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ
నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ (2)
నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు
నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా          ||నిను||

English Lyrics

Audio

HOME