నీ పాద సన్నిధికి

పాట రచయిత: సీయోను గీతాలు
Lyricist: Songs of Zion

Telugu Lyrics

నీ పాద సన్నిధికి
కృపామయా యేసయ్యా
నీ ప్రేమ కనుగొనుచు
దేవా నే వచ్చితిని (2)       ||నీ పాద||

విశ్రాంతి నిచ్చెడు దేవా
శ్రమలెల్ల తీర్చుమయ్యా (2)
సిలువయే నా ఆశ్రయము
హాయిగా నచ్చటుండెదను (2)       ||నీ పాద||

ప్రార్ధించుమంటివి ప్రభువా
సంకట సమయములో (2)
దయ చూపి నను కరుణించి
ప్రేమతో ఆదరించుమయ్యా (2)       ||నీ పాద||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

దేవా నా దేవా

పాట రచయిత: జోయెల్ ఎన్ బాబ్
Lyricist: Joel N Bob

Telugu Lyrics


దేవా నా దేవా – నీవే నా కాపరి
నీ ప్రేమ నీ క్షమా – ఎంతో గొప్పది (2)
ఆరాధింతును హృదయాంతరంగములో
స్తుతించెదను నీ పాద సన్నిధిలో (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

పాపము నుండి విడిపించినావు
పరిశుద్ధుని చేసి ప్రేమించినావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

పరిశుద్ధాత్మను నాలో నింపావు
మట్టి దేహమును మహిమతో నింపావు (2)
నీవే కదా దేవుడవు – (2)
దేవా యేసు దేవా (4)        ||దేవా||

English Lyrics

Audio

ఉన్నపాటున వచ్చుచున్నాను

పాట రచయిత: పురుషోత్తము చౌదరి
Lyricist: Purushothamu Chowdary

Telugu Lyrics

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా
ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి
యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను          ||ఉన్న||

కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట
భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని
ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ            ||ఉన్న||

మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై
అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను
అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని           ||ఉన్న||

వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను
పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే
నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె            ||ఉన్న||

కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను
సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము
బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె             ||ఉన్న||

నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని
కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని
భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె         ||ఉన్న||

దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు
డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే          ||ఉన్న||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME