దేవా నీ ఆత్మను

పాట రచయిత: డినో
Lyricist: Dino

Telugu Lyrics


దేవా నీ ఆత్మను నా నుండి
నువ్వు తీసివేయకుమా
నీ సన్నిధిలో నుండి నన్ను
నువ్వు త్రోసివేయకుమా (2)
నీ దృష్టి యెదుటనే
చెడుతనము చేసియున్నాను
పాపిని అని ఒప్పుకొని
క్షమాపణ కోరుచున్నాను
నీవే నీవే కరుణామయుడవు నీవే
నీవే నీవే ప్రేమామయుడవు నీవే     ||దేవా||

నీ వెలుగుతో నను నింపిననూ
చీకటినే కోరుకున్నాను (2)
నా కళ్ళు నీవు తెరిచిననూ
గ్రుడ్డివాడిలా నడుచుకున్నాను      ||నీ దృష్టి||

నీ ఆత్మతో నను నింపిననూ
శరీరమునే తృప్తిపరిచాను (2)
ఆత్మచేత నడిపించబడక
శరీరాశలలో మునిగాను       ||నీ దృష్టి||

English Lyrics

Audio

సిలువలో నీ ప్రేమ

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


సిలువలో నీ ప్రేమ – పాపము తీసేనయ్యా
మరణము చెరలో నుండి – నను విడిపించేనయ్యా (2)
ఘోర పాపిని నేను – పరిశుద్ధుని చేసితివి
నిత్యజీవములో నన్ను – నిలుపుటకు బలి అయితివి (2)      ||సిలువలో||

తాళలేని నీ తాపం – తొలగించెను నాదు శాపం
నలిగినట్టి నీ రూపం – ఇచ్చేను నాకు స్వరూపం (2)
నను విడిపించుటకు – విలువను విడిచితివి
పరమును చేర్చుటకు – మహిమను మరిచితివి (2)     ||ఘోర పాపిని||

దైవ తనయుని దేహం – మోసింది చేయని నేరం
కడిగేందుకు నా దోషం – చిందించె నిలువునా రుధిరం (2)
నను కాపాడుటకు – రొట్టెగా విరిగితివి
మరణము దాటుటకు – బలిగా మారితివి (2)     ||ఘోర పాపిని||

అధముడయినట్టి నేను – నీ ప్రేమ అర్హుడను కాను
పొగిడి నిన్ను ప్రతి క్షణము – తీర్చలేను నీ ఋణము (2)
నిను చాటించుటకు – వెలుగై సాగెదను
ప్రేమను పంచుటకై – ఉప్పుగ నిలిచెదను (2)     ||ఘోర పాపిని||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

హీనమైన బ్రతుకు నాది

పాట రచయిత: బాలరాజ్
Lyricist: Balraj

Telugu Lyrics

హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు      ||హీనమైన||

మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)
కరుణించి నన్ను కష్టాలు బాపు (2)
కరుణామయా క్రీస్తేసువా      ||హీనమైన||

తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ
భార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)
పాపి కొరకు ప్రాణమర్పించిన (2)
త్యాగ శీలివి నీకే స్తోత్రము        ||హీనమైన||

నిన్న నేడు రేపు యేసు – మారనే మారవు
లోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2)
వెరువను జడియను (2)
నీ కంటి పాపను నను కాచే దైవమా         ||హీనమైన||

English Lyrics

Audio

దేవా పాపిని

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


దేవా పాపిని నిన్నాశ్రయించాను
ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2)     ||దేవా||

అపరాధినై అంధుడనై
అపవాదితో అనుచరుడై (2)
సంచరించితి చీకటిలో
వంచన చేసితి ఎందరినో – (2)     ||దేవా||

కలువరిలో సిలువొంద
కలవరమొందె జగమంతా (2)
పాపినైన నా కొరకు
మరణమునే భరించితివి
మరణమునే జయించితివి          ||దేవా||

English Lyrics

Audio

నా తండ్రి

పాట రచయిత: స్వప్న ఎడ్వర్డ్స్
Lyricist: Swapna Edwards

Telugu Lyrics


నా తండ్రి నన్ను మన్నించు
నీకన్నా ప్రేమించే వారెవరు (2)
లోకం నాదే అని నిన్ను విడిచాను
ఘోర పాపిని నేను యోగ్యతే లేదు
ఓ మోసపోయి తిరిగి వచ్చాను
నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను

నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను
నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2)
నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను
నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది         ||లోకం||

నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో
నిన్ను మించిన ఈ ప్రేమ – ఎక్కడ కనరాలేదు (2)
నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని
గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివే     ||నా తండ్రి||

English Lyrics

Audio

యెహోవా నీదు మేలులను

పాట రచయిత: రాజ్ ప్రకాష్ పాల్
Lyricist: Raj Prakash Paul

Telugu Lyrics


యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను
కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం
దైవం నీవయ్యా పాపిని నేనయ్యా
నీదు రక్తముతో నన్ను కడుగు
జీవం నీవయ్యా జీవితం నీదయ్యా
నీదు సాక్షిగా నన్ను నిలుపు
కారణ భూతుడా పరిశుద్ధుడా
నీదు ఆత్మతో నన్ను నింపు
మరనాత యేసు నాథా
నీదు రాజ్యములో నన్ను చేర్చు

ఘనుడా సిల్వ ధరుడా
అమూల్యం నీదు రుధిరం (2) ఓ…
నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం
నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం
ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం
సర్వోన్నతుడా నీకే సర్వం          ||యెహోవా||

ప్రియుడా ప్రాణ ప్రియుడా
వరమే నీదు స్నేహం (2)
నా రక్షణకై పరమును వీడే
నా విమోచనకై క్రయ ధనమాయె
ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం
పరమాత్ముడా నీకే సర్వం         ||యెహోవా||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME