నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా

పాట రచయిత: పాలపర్తి ప్రభుదాస్
Lyricist: Palaparthi Prabhudas

Telugu Lyrics


నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నను గన్న తండ్రి నా యేసయ్యా
పూజింతును ఓ పూజార్హుడా
భజియింతును ఓ భవదీయుడా
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2)
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము         ||నా ప్రాణ||

ఒంటరినై తోడులేక దూరమైతిని
ఓదార్చే వారు లేక భారమైతిని (2)
తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2)
నీ తోడు దొరికాక చిగురించితిని (2)        ||నీవు గాక||

శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2)
తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే
కష్టమంతయు తీరిపోయెను
బాధలన్నియు తొలగిపోయెను        ||నీవు గాక||

క్షణమైన నీ నామం మరువకుంటిని
మరణమైన మధురంగా ఎంచుకుంటిని (2)
తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని (2)
నా కొరకు నీవు నీ కొరకు నేను (2)        ||నీవు గాక||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా హృదయాన కొలువైన

పాట రచయిత: హోసన్నా మినిస్ట్రీస్
Lyricist: Hosanna Ministries

Telugu Lyrics


నా హృదయాన కొలువైన యేసయ్యా
నా అణువణువు నిన్నే – ప్రస్తుతించెనే కీర్తనీయుడా
నా హృదయార్పణతో – ప్రణమిల్లెదనే
నీ సన్నిధిలో పూజార్హుడా (2)        ||నా హృదయాన||

అగ్ని ఏడంతలై – మండుచుండినను
అగ్ని జ్వాలలు తాకలేదులే – నీ ప్రియుల దేహాలను (2)
అగ్ని బలము చల్లారెనే – శత్రు సమూహము అల్లాడెనే (2)
నేను నీ స్వాస్థ్యమే – నీవు నా సొంతమే
నా స్తోత్రబలులన్ని నీకేనయ్యా (2)        ||నా హృదయాన||

అంతా వ్యర్థమని – వ్యర్థులైరెందరో
నా గురి నీపై నిల్పినందుకే – నా పరుగు సార్థకమాయెనే (2)
నీయందు పడిన ప్రయాసము – శాశ్వత కృపగా నాయందు నిలిచెనే (2)
నీపై విశ్వాసమే – నన్ను బలపరచెనే
నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును (2)        ||నా హృదయాన||

విత్తినది ఒకరు – నీరు పోసింది వేరొకరు
ఎరువు వేసింది ఎవ్వరైననూ – వృద్ధి చేసింది నీవే కదా (2)
సంఘక్షేమాభివృద్ధికే – పరిచర్య ధర్మము నియమించినావే (2)
నీ ఉపదేశమే – నన్ను స్థిరపరచెనే
నా సర్వము నీకే అర్పింతును (2)        ||నా హృదయాన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

ఇశ్రాయేలు దేవా

పాట రచయిత: జయరాజ్
Lyricist: Jayaraj

Telugu Lyrics

ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా
నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2)
ఏమని నిన్ను నేను కీర్తింతును
ఏమని నిన్ను నేను పూజింతును (2)
ఏమని నిన్ను నేను ఆరాధింతును (2)
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా
ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా        ||ఇశ్రాయేలు||

నా పితరులెందరో నిన్ను ఘనపరచి
దహనబలులు నీకు అర్పించగా (2)
ఇంపైన సువాసనగా అంగీకరించి
దీవెన వర్షము కురిపించితివే (2)      ||ఆరాధనా||

నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి
స్తుతుల సింహాసనము నీకు వేయగా (2)
ఆనంద తైలముతో నన్నభిషేకించి
స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2)      ||ఆరాధనా||

నా కొరకు సీయోనును సిద్ధపరచి
మహిమతో తిరిగి రానైయుంటివే (2)
ఆనంద ధ్వనులతో నన్నూరేగించి
శాశ్వత జీవము నాకిచ్చితివే (2)      ||ఆరాధనా||

English Lyrics

Audio

స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా

పాట రచయిత: యేసుదాస్
Lyricist: Yesudas

Telugu Lyrics


స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా (2)
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు (2)        ||స్తుతి||

నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2)
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు (2)         ||స్తుతి||

నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ (2)
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో (2)         ||స్తుతి||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

HOME