ప్రతిగా (యేసు యేసూ)

పాట రచయిత: మోహన్ కృష్ణ & జోయెల్ ఎన్ బాబ్
Lyricist: Mohan Krishna & Joel N. Bob

Telugu Lyrics

యేసు యేసూ.. యేసూ.. యేసు
యేసు యేసూ.. యేసూ.. యేసు
నా ప్రియమైన యేసు నన్ను ప్రేమించినావు
నన్ను వెదకి రక్షించుటకై పరము వీడినావు
ప్రాణమైన నా యేసు నన్ను హత్తుకున్నావు
శాశ్వతా జీవమిచ్చి శ్వాస విడచినావు         ||యేసు యేసూ||

నా నీతికి ప్రతిగా నీవు పాపమయ్యావు
ఆశీర్వాదముగ నను చేయ – నీవు శాపమయ్యావు (2)
నా స్వస్థతకు ప్రతిగా వ్యాధిననుభవించావు
నాకు నీ రూపమిచ్చి నలుగగొట్టబడ్డావు         ||యేసు యేసూ||

ప్రాణానికి ప్రతిగా ప్రాణమే విడచినావు
అధిక విజయము నాకీయ మరణమే గెలచినావు (2)
పరమ పురములో నివసింప వారసత్వమిచ్చావు
నిన్ను నిత్యము ఆరాధింప – నన్ను ఎన్నుకున్నావు         ||యేసు యేసూ||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా ప్రాణమైన యేసు (ఆరాధన)

పాట రచయిత:
Lyricist:

Telugu Lyrics


ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)
నా ప్రాణమైన యేసు
నా ప్రాణముతో కలిసి
నా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్ – (2)        ||నా ప్రాణమైన||

లోకమంతా మాయెనయ్యా
నీ ప్రేమయే నాకు చాలునయ్యా (2)
(రాజా) నీ నామమునే స్తుతియింతున్
నా యేసయ్యా.. నా జీవితమంతయు (2)        ||నా ప్రాణమైన||

ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధన

ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు…
ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు…

హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా

ఆరాధన ఆరాధన
ఆరాధనా ఆరాధన           ||నా ప్రాణమైన||

English Lyrics

Audio

Download Lyrics as: PPT

నా ప్రాణమైన యేసు

పాట రచయిత: జయశీలన్
అనువదించినది: ఎం విలియం గవాస్కర్
Lyricist: Jayasheelan
Translator: M William Gavaskar

Telugu Lyrics


నా ప్రాణమైన యేసు
నా ప్రాణములోనే కలిసి
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్
నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2)
నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2)       ||నా ప్రాణమైన||

లోకమంతా మరచితినీ
విలువైనది కనుగొంటినీ (2)
నీ నామం స్తుతించుటలో
యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2)
రాజా…                 ||నా ప్రాణమైన||

నీ వాక్యం నాకు భోజనమే
శరీరమంతా ఔషధమే (2)
రాత్రియు పగలునయ్యా
నీ యొక్క వచనం ధ్యానింతును (2)
రాజా…                 ||నా ప్రాణమైన||

English Lyrics

Audio

HOME